ETV Bharat / state

రహదారి కష్టాలకు చెక్ - ప్రభుత్వ నిర్లక్ష్యానికి చెంపపెట్టుగా అడవిబిడ్డల అడుగులు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 2, 2023, 9:41 AM IST

Tribals Constructed Roads in Paderu Alluri District: గూండాగిరి చూశాం. గాంధీగిరి చూశాం. మరి 'దారి గిరి' గురించి ఎప్పుడైనా చదివారా. అది గిరిజనుల చేత, గిరిజనులు కోసం, గిరిజనులే మోగించిన నిరసన భేరి. నా ఎస్టీలంటూ మాటలతో మభ్యపెట్టే పాలకుల కళ్లు తెరిపించాలని అడవిబిడ్డలు చేసిన శ్రమదానం. ఏకపక్షంగా ఓటేసిన పాపానికి.. కనీసం ఊరికి దారి చూపలేని అసమర్థతపై ప్రయోగించిన అంకుశం. ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో అల్లూరి, మన్యం జిల్లాల్లో 11 గ్రామాల ప్రజలు చందాలు వేసుకుని రోడ్లు వేసుకున్నారు. మనకెందుకు జగన్ అంటూ తమ దారి తాము బాగు చేసుకున్నారు.

tribals_constructed_roads_in_paderu_alluri_district
tribals_constructed_roads_in_paderu_alluri_district

ఆరణ్యరోదనల గిరిపుత్రుల రోడ్ల కష్టాలు - ప్రభుత్వ నిర్లక్ష్యానికి చెంపపెట్టుగా అడవిబిడ్లల అడుగులు

Tribals Constructed Roads in Paderu Alluri District: కొండప్రాంతాల్లో ఉండే.. గిరిపుత్రులకు ప్రాణంమీదకొచ్చిన ప్రతీసారీ డోలీ మోతలే దిక్కు. ఇంతకష్టం ఎందుకు జగనన్న అంబులెన్సుకు ఫోన్‌చేస్తే కుయ్‌కుయ్‌మంటూ వస్తుంది కదా అంటారా. అలా వచ్చిన అంబులెన్సే ఇలా కుయ్యోమొర్రో అంటూ కూరుకుపోతున్నాయి. చివరకు గిరిజనులే ట్రాక్టర్‌తో లాగి అంబులెన్సునులకు దారి ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి.

పాడేరు, అల్లూరి జిల్లాల్లోని అనేక గిరిజన గ్రామాల్లో అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి బయల్దేరి మధ్యలోనే పోయిన ప్రాణాలెన్నో.. కొన ఊపిరితో మోసుకెళ్తంటే మధ్యలోనే ఊపిరి ఆగిన ఉదంతాలెన్నో. కాకపోతే ఆ ఆత్మఘోష అరణ్యరోదనగానే మిగిలిపోతుంది తప్ప ప్రభుత్వం ఆలకించదు. అంతటి దుఃఖంలోనూ వీళ్లు అద్దంలాటి రోడ్లు అడగడంలేదు. కనీసం కాలిబాటైనా చూపాలంటున్నారు. ద్విచక్రవాహనాలు వెళ్లే దారైనా వేయాలంటున్నారు.

Carrying The Dead Dody On Doli : మన్యంలో తప్పని డోలి మోతలు.. డోలీలో మృతదేహం తరలింపు

YSRCP Government Neglect on Roads: కానీ ఆలకించిన నాథుడే లేడు. నా ఎస్టీలని, లక్షలకోట్లు బటన్లు నొక్కుతున్నానని చెప్పే జగన్ కూడా మాటలు తప్ప చేతల్లో చేసిందేమీ లేదు. మట్టి రోడ్లకైనా నిధులివ్వలేదు. పాడేరు జిల్లా హుకుంపేట మండలం సంపంగిపుట్టు వెళ్లే 3కిలో మీటర్ల రోడ్డను ఇలా బాగుచేసుకున్నారు. తనను ఎమ్మెల్యే చేస్తే రోడ్డు వేయిస్తానని మాటిచ్చిన శెట్టి పాల్గుణ ముఖం చాటేశారంటూ గ్రామస్థులు ఆక్రోశించారు.

కొర్ర కేశవరావు, గ్రామ వాలంటీర్

Alluri District Roads: పలుగుపార పట్టిన వీరంతా ఉపాధి కూలీలు కాదు. పాడేరు జిల్లా కల్లాలబయలు వాసులు. పాడేరు వీళ్ల ఊరికి 7కిలోమీటర్ల దూరం. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 5 కిలోమీటర్లు రోడ్డు వేశారు. ఇంకో రెండు కిలో మీటర్లు వేస్తే వాళ్లకో దారి దొరుకుతుంది. దానికి 4 కోట్లు కావాలి. మూడేళ్ల క్రితం మంత్రి హోదాలో అవంతి శ్రీనివాసరావు ఈ రోడ్డేస్తామని నమ్మబలికారు. కానీ, అవంతి మంత్రి పదవీ పోయింది. ఆయనిచ్చిన మాటా మంటగలిసింది. ఇక విసిగిపోయిన కల్లాలబయలు వాసులు ఉపాధి హామీ పనులకు వెళ్లి సంపాదించిన కూలి సొమ్మును పోగేసుకున్నారు. 50 వేల రూపాయలతో 2022 మేలో రోడ్డు నిర్మించుకున్నారు.

గిరిజనులకు తప్పని డోలి మోతలు.. నిండు గర్భిణిని 4 కి.మీ మోసుకుని..

Roads in Paderu: అల్లూరి జిల్లా తొటగొడిపుట్‌కు చెందిన ఆశాకార్యకర్త జమ్మె.. ఇక్కడ రోడ్డు పనులకు ప్రారంభించారు. రాళ్లు రప్పలు, ముళ్ల కంపలు నిండిన దారిలో గర్భిణిల ఆర్తనాదాలు ఆమె చెవులారా విన్నారు. అవకాశం వచ్చిన ప్రతీసారీ రోడ్డు వేయించండి సార్ అని.. పైఅధికారులకు విన్నవించుకున్నారు. కానీ, ఎవరూ ఆలకించలేదు. ఓవైపు జనం ఊరొదిలి వలసపోతున్నారు. ఊరికి దారి చూపుతానంటూ ఆమె తాను ఇల్లు కట్టుకోవాలని దాచుకున్న రెండున్నర లక్షలతో రోడ్డువేయించారు. జమ్మె ప్రయత్నం అనేక మంది మానవతామూర్తుల్ని కదిలించించిది. విజయనగరం జిల్లాకు చెందిన కొందరు ఆమెకు.. లక్షన్నర ఆర్థిక సాయం చేశారు. కానీ ప్రభుత్వం మాత్రం కనికరించలేదు.

ఇక మన్యం జిల్లా సాలూరు మండలం కొదమ పంచాయతీ కేంద్రం నుంచి ఒడిశా సరిహద్దు గ్రామం బారి వరకూ వెళ్లేరోడ్డు పరిస్థితి చూడాలి. కొదమలోని 125 కుటుంబాలు కలిసికట్టుగా 5లక్షలు పోగుచేసుకున్నారు. ఆ డబ్బుతోనే.. నెల రోజులు కష్టపడి 2020 ఆగస్టులో 5 కిలోమీటర్ల రోడ్డు వేసుకున్నారు. ఉపముఖ్యమంత్రి రాజన్న దొర ప్రాతినిధ్యం వహిస్తున్న మన్యం జిల్లా చింతామలలో 110 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. స్థానికులు సేకరించిన అటవీ ఉత్పత్తులు అమ్ముకోడానికి 6 కిలోమీటర్ల దూరంలోని సబకుమరివెళ్లాలి.రెండు గ్రామాల మధ్య గుట్టలు, బండరాళ్లతో కనీసం నడవడానికీ కష్టమే. చేసేదేమీలేక ఊరంతా కలిసి 7 లక్షల రూపాయలు సమీకరించుకున్నారు. ఆ సొమ్ముతో సొంతంగా రోడ్డు వేసుకున్నారు.

'ఇంకెన్నాళ్లీ డోలి మోతలు... విముక్తిని కలిగించండి'

Tribals Constructed Roads: మన్యం జిల్లా సిరివర నుంచి బందమెండంగి వెళ్లే రోడ్డు.. అసలే అంతంత మాత్రంగా ఉండే ఈ రోడ్డు వర్షకాలంలో.. అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితి ఉంటుంది. 4 కిలోమీటర్ల ఈ మార్గాన్ని స్థానికులే బాగు చేసుకున్నారు. ఇందుకోసం సిరివర, పొయిమల గ్రామాలకు చెందిన 36 కుటుంబాలు పలుగుపార చేతపట్టాయి. ఆరున్నర లక్షలు పోగుచేసుకుని.. 5రోజులు శ్రమదానం చేసి రోడ్డు ఏర్పాటు చేసుకున్నాయి.

మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గంలోని పాత పెద్దగూడ, రంగంవలస, ఉసిరికిపాడు వెళ్లేరోడ్డు పరిస్థితి దారుణం. ఈ 3గ్రామాలను అనుసంధానిస్తూ టీడీపీ హయాంలో వేసిన ఫార్మేషన్‌ రోడ్డు వర్షాలకు దెబ్బతింది. ఉపాధి హామీ పథకం కింద బాగు చేయాల్సి ఉన్నా.. జగన్‌ ప్రభుత్వానికి అది పట్టలేదు. దీంతో వారే 4 కిలోమీటర్ల మేర దారిని బాగుచేసుకున్నారు.

YSRCP Neglect on Roads construction: ఇలా ఒకట్రెండుకాదు ఇటీవలి కాలంలో బాహ్య ప్రపంచానికి తెలిసి దాదాపు 11రోడ్లను గిరిపుత్రులు చందాలు వేసుకుని బాగు చేసుకున్నారు. ఇందుకోసం కూలీనాలీ చేసుకుని దాచుకున్న డబ్బును 29 లక్షల రూపాయలు వెచ్చించారు. గిరిపుత్రులు సొంతగా వేసుకున్న రోడ్లన్నీ.. వైసీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాలే. ప్రస్తుత ఉపముఖ్యమంత్రి రాజన్నదొర నియోజకవర్గంలో 3 రోడ్లు, మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి నియోజకవర్గంలో మూడు, అరకు ఎమ్మెల్యే శెట్టిపాల్గుణ నియోజకవర్గంలో 2, పాలకొండ ఎమ్మెల్యే కళావతి నియోజకవర్గంలో 2, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి నియోజకవర్గంలో ఒక గ్రామానికి గిరి పుత్రులే సొంతంగా దారి వేసుకున్నారు. ఇంతమంది అధికారపార్టీ ఎమ్మెల్యేలుండీ కనీసం 29 లక్షలు రూపాయలు మంజూరు చేయించలేకపోయారు. జగనే బటన్‌ నొక్కి ఉంటే.. వీళ్లేంతా పలుగుపార పట్టాల్సిన అవసరం వచ్చేదా అని ప్రశ్నలు తలెత్తున్నాయి.

గర్భిణులకు పురిటి నొప్పులు - ఏజెన్సీలో గిరిజనులకు తప్పని డోలీ మోతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.