తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసును ఎందుకు విచారించడంలేదు: వర్ల రామయ్య

author img

By

Published : Sep 17, 2022, 12:46 PM IST

TDP COMPLIANT ON YSRCP

TDP COMPLIANT ON YSRCP : తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి చేసి 11 నెలలైనా ఇప్పటికీ కనీసం FIR నమోదు చేయకపోవడం పోలీసుల అసమర్థతను తెలియజేస్తోందని.. ఆ పార్టీ ఆరోపించింది. పోలీసుల వైఫల్యాన్ని నిరసిస్తూ వర్ల రామయ్య నేతృత్వంలో తెలుగుదేశం నేతలు.. మంగళగిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

TDP COMPLIANT : తెదేపా కేంద్ర కార్యాలయంపై వైకాపా దాడి చేసి నేటికి 11 నెలలు గడుస్తున్న ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ నేతలు మంగళగిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధ్యులపై ఇంతవరకూ ఎందుకు చర్యలు తీసుకోలేదో సమాధానం చెప్పాలంటూ డిమాండ్​ చేశారు. 11 నెలల క్రితం తెదేపా కేంద్ర కార్యాలయంపై వైకాపా ముష్కరులు దాడి చేసినా పోలీసులు చర్యలు శూన్యమని పార్టీ పొలిట్​బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విమర్శించారు.

"తెదేపా కేంద్ర కార్యాలయంపై వైకాపా దాడి చేసి 11 నెలలైంది. అయినా కేసు నమోదు చేయలేదు. దాడిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. పోలీసు వ్యవస్థ వల్ల ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది? సీసీ కెమెరా దృశ్యాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం.. దర్యాప్తునకు పోలీసులు ఎందుకు ముందుకు రావట్లేదు. సజ్జల, సీఎం చెబితేనే దర్యాప్తునకు ముందుకొస్తారా? త్వరలో పోలీసులపై ప్రైవేట్ కేసులు వేస్తున్నాం" -వర్ల రామయ్య, తెదేపా పొలిట్​బ్యూరో సభ్యులు

ఒక్కరిని కూడా ఇంతవరకు పట్టుకోకపోవడం సిగ్గుచేటన్నారు. ఈ పోలీసు వ్యవస్థ వల్ల ప్రజలకు ఏమి న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. 11 నెలలు అయినా పోలీసులు ఎవరినీ పట్టుకోలేదు.. డీజీపీకి సిగ్గుగా లేదా అంటూ వర్ల రామయ్య మండిపడ్డారు. సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నా.. దర్యాప్తు చేయడానికి పోలీసులు ముందుకు రావడం లేదని దుయ్యబట్టారు. త్వరలో పోలీసులపై ప్రైవేట్ కేసులు వేస్తున్నామన్నారు. సజ్జల, సీఎం చెప్తేనే కానీ పోలీసులు దర్యాప్తుకు ముందుకు రావడం లేదని వర్లరామయ్య ఆక్షేపించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.