ETV Bharat / state

TDP Leader Yanamala Ramakrishnudu on State Debts: తెలంగాణ కంటే ఏపీ 7 స్థానాలు వెనుకబడటానికి కారకులెవరు: యనమల

author img

By

Published : Aug 14, 2023, 5:02 PM IST

TDP Leader Yanamala Ramakrishnudu  on State Debts
tdp_leader_yanamala_ramakrishnudu_on_state_debts

TDP Leader Yanamala Ramakrishnudu on State Debts: రాష్ట్ర ఆర్ధికస్థితి 8వ స్థానం నుంచి 11 వ స్థానానికి దిగజారడానికి కారకులెవరని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. ఇది సీఎం జగన్ అసమర్ధత కాదా అంటూ మండిపడ్డారు. మన కంటే వనరులు తక్కువ ఉన్న తెలంగాణ ఆర్ధికస్థితి ఎంతో మెరుగ్గా 4వ స్థానానికి వృద్ధిచెందడం, రాష్ట్రం వెనకబడటం జగన్ మోహన్ రెడ్డి అసమర్ధత కాదా అంటూ ప్రశ్నించారు.

TDP Leader Yanamala Ramakrishnudu on State Debts: డాయిష్ బ్యాంకు సర్వే (Deutsche Bank Survey) లో ఏపీ ఆర్ధికస్థితి 8వ స్థానం నుంచి 11 వ స్థానానికి దిగజారడానికి కారకులెవరని శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. తెలంగాణ కంటే ఏపీ 7 స్థానాలు ఎందుకు పడిపోయిందన్న ఆయన.. ఇది జగన్ రెడ్డి అసమర్ధత కాదా అంటూ మండిపడ్డారు. ఏపీ ఆర్ధికస్థితి ఏడాదికేడాదికి దిగజారుతోందని చెబుతున్నా జగన్ రెడ్డి పెడచెవున పెట్టారని విమర్శించారు.

రాష్ట్రం క్లాసిక్ డెట్ ట్రాప్‌లోకి వెళ్తోందని గత నాలుగు సంవత్సరాలుగా ఏకరవు పెడుతున్నా దిద్దుబాటు చర్యలు తీసుకోలేదని అన్నారు. ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి వాస్తవ ఆర్థిక పరిస్థితిని విశ్లేషించకుండా పదేపదే అబద్దాలను వల్లెవేస్తున్నారంటూ యనమల రామకృష్ణుడు దుయ్యబట్టారు.

Andhra Pradesh Debt Details: రాష్ట్ర అప్పులను మరోసారి బయటపెట్టిన కేంద్రం

మన కంటే వనరులు తక్కువ ఉన్న తెలంగాణ ఆర్ధికస్థితి ఎంతో మెరుగ్గా 4 వ స్థానానికి వృద్ధిచెందడం, రాష్ట్రం వెనకబడటం జగన్ రెడ్డి చేతగానితనం కాదా అంటూ నిలదీశారు. నిన్నటి వరకు విద్యుత్ వినియోగదారులపై 57 వేల కోట్ల భారాలు వేసి ఇష్టానుసారం దోచుకున్న జగన్ రెడ్డి నేడు విద్యుత్ ఉద్యోగుల నిధులపై పడ్డారన్నారు.

మద్యం బాండ్లు విడుదల చేసి వాటికి విద్యుత్ ఉద్యోగుల పీఎఫ్, పెన్షన్ నిధులను అటాచ్ చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే మద్యం బాండ్లతో 16 వేల కోట్లు అప్పులు తెచ్చిన జగన్ రెడ్డి నేడు మరో 11,600 కోట్లు అప్పులు తెచ్చేందుకు బాండ్ల వేలానికి వెళుతున్నాడని విమర్శించారు.

AP Debts: అందినకాడికి అప్పులు.. 9 నెలల అప్పులు 4 నెలల్లోనే..

మద్యం బాండ్లలోకి విద్యుత్ ఉద్యోగుల పీఎఫ్, పెన్షన్ నిధులు మళ్లించే హక్కు మీకెవరిచ్చారని నిలదీశారు. జగన్ రెడ్డి ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు రూ.33 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని.. అది చాలదన్నట్లు ఇప్పుడు విద్యుత్ ఉద్యోగుల సొమ్ములు సైతం తాకట్టుపెట్టడం శోచనీయమని మండిపడ్డారు.

2018లో 16 వేల కోట్ల రూపాయలు ఉన్న రెవెన్యూ లోటు నేడు 40 వేల కోట్లకు ఎందుకు పెరిగిందని యనమల ప్రశ్నించారు. 2018 నాటికి ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ 2.5 లక్షల కోట్లు ఉంటే అవి 4.42 లక్షల కోట్లకు ఎందుకు పెరిగాయన్నారు. జగన్ రెడ్డి నిర్వాకం వల్ల రాష్ట్ర రెవెన్యూ నుంచి దాదాపు 30 వేల కోట్లు వడ్డీల చెల్లింపుకే వెచ్చించాల్సిన పరిస్థితి దాపురించిందని యనమల రామకృష్ణుడు దుయ్యబట్టారు.

Andhra Pradesh Debts: ఎడాపెడా అప్పులు.. పైగా ఓడీ.. అప్పుల్లో తగ్గేదేలే అంటున్న జగన్​ ప్రభుత్వం

ఆర్ధికలోటు, పన్నుల ఆదాయం, అప్పులు, జీఎస్టీపీ కేటగిరీల్లో రాష్ట్రం చాలా దారుణమైన స్థితిలో ఉందని యనమల తెలిపారు. రెవెన్యూ డెఫిసిట్, ఫిజికల్ డిఫెసిట్ విఫరీతంగా పెరిగిపోయాయని అన్నారు. విభజన నాటికి రాష్ట్ర రెవెన్యూ లోటు 2.62 శాతంగా ఉండేదని.. దాన్ని 2018-19 నాటికి 1.61 శాతంకు తగ్గించామని తెలియజేశారు. కానీ వైసీపీ ప్రభుత్వంలో అది ఇప్పుడు 3.60 కు పెరిగిందన్నారు.

AP Debts 2023: అప్పు చేయడంలో తగ్గేదేలే!.. అంటున్న జగన్‌ సర్కార్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.