ETV Bharat / state

5.64 లక్షల ఓటర్లు ఔట్ - అనర్హులను ఏరివేసిన ఈసీ 'టీడీపీ ఫిర్యాదుకు స్పందన'

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 8, 2024, 5:10 PM IST

state_election_ceo_mukesh_kumar_meena
state_election_ceo_mukesh_kumar_meena

State Election CEO Mukesh Kumar Meena : 2024 ఓటర్ల తుది జాబితాకు సంబంధించి 2023 డిసెంబరు 9 వరకూ వచ్చిన వేర్వేరు దరఖాస్తులను పరిష్కరించామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. ఈమేరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఏపీకి రానున్న కేంద్ర ఎన్నికల సంఘాన్ని చంద్రబాబు - పవన్ కల్యాణ్​ మంగళవారం కలవనున్నారు.

State Election CEO Mukesh Kumar Meena : రాజకీయ పార్టీలు చేసిన ఫిర్యాదుల్లో 14.28 లక్షల ఓటర్ల పేర్లను గుర్తించి అందులో 5.64 లక్షల ఓటర్ల పేర్లు అనర్హులుగా ఓటర్ల జాబితా నుంచి తొలగించినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు రాసిన లేఖలో వివిధ అంశాలపై ఎన్నికల సీఈఓ సమాధానం ఇచ్చారు. గతంలో టీడీపీ దాఖలు చేసిన వేర్వేరు ఫిర్యాదులకు సంబంధించిన అంశాలను ప్రస్తావించిన సీఈఓ తాము తీసుకున్న చర్యలను లేఖలో పేర్కొన్నారు. ఓటర్ల జాబితా అవకతవకలకు సంబంధించి ఇద్దరు ఆర్వోలను సస్పెండ్ చేయటంతో పాటు 50 మంది బీఎల్వోలపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు. గంపగుత్తగా దాఖలైన ఫాం 7 దరఖాస్తులపైనా విచారణ జరిపి ఎఫ్​ఐఆర్​ నమోదు చేసినట్టు స్పష్టం చేశారు.

Adoni voter list: ఇది విన్నారా..! రెండు ఇళ్లలో 1350 ఓట్లు

2024 ఓటర్ల తుది జాబితాకు సంబంధించి 2023 డిసెంబరు 9 వరకూ వచ్చిన వేర్వేరు దరఖాస్తులను పరిష్కరించామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. 2024 ఓటర్ల తుది జాబితా తయారీలో భాగంగా 2023 డిసెంబరు 9 వరకూ వచ్చిన వేర్వేరు దరఖాస్తులను పరిష్కరించామని ఆయన తెలిపారు. డిసెంబరు 9వ తేదీ తర్వాత వచ్చిన 17,976 దరఖాస్తులను కూడా 2024 జనవరి 12వ తేదీలోగా పరిష్కరిస్తామని తెలిపారు. మృతి చెందిన ఓటర్లు, డూప్లికేట్ కేసులు, ఓటు బదిలీ దరఖాస్తులను ఇంటింటి సర్వే నిర్వహించి పరిష్కరించామని ఆయన వెల్లడించారు.

అన్ని రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో 14.48 లక్షల ఓటర్ల పేర్లను గుర్తించామని అందులో 5 లక్షల 64 వేల 819 పేర్లు అనర్హులుగా గుర్తించామని ఆయన వివరించారు. అన్ని జిల్లాల కలెక్టర్లూ ఆయా అనర్హులను ఓటర్ల జాబితా నుంచి తొలగించారని వెల్లడించారు. కొన్ని నియోజకవర్గాల్లో భారీ సంఖ్యలో ఓటర్లుగా ఆన్ లైన్ దరఖాస్తులు చేస్తున్నారన్న ఫిర్యాదులూ వచ్చాయని స్పష్టం చేశారు. కాకినాడ నగరంలో ఫాం 7ల ద్వారా గంపగుత్తగా ఓటర్లను చేరుస్తున్న 13 మందిపై ఎఫ్ఐఆర్​ను నమోదు చేశామని అన్నారు. ఈ వ్యవహారంలో పోలీసు స్టేషన్లలో అభియోగపత్రాలు కూడా దాఖలు అయ్యాయని వెల్లడించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో దురుద్దేశపూర్వకంగా ఫాం 7లు దాఖలు చేసిన ఆరుగురు వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఐపీసీ, ఐటీ చట్టాల కింద కేసులు నమోదు చేశామని తెలిపారు. పర్చూరు నియోజకవర్గంలోనూ 10 ఎఫ్ఐర్​లు నమోదు అయ్యాయని వెల్లడించారు. కావలి, గురజాల, బనగానపల్లె, పిఠాపురం తదితర నియోజకవర్గాల్లో ఫాం 7 దరఖాస్తుల్లో వచ్చిన అభ్యంతరాలను తనిఖీ చేయించామని సీఈఓ తన లేఖలో పేర్కొన్నారు.

Fake Votes in Vijayawada: ఒకే ఇల్లు.. ఆరుగురు ఉంటే 48 ఓట్లు.. తప్పులతడకగా ఓటరు జాబితా

చంద్రగిరి నియోజకవర్గంలో ఉల్లంఘనలకు పాల్పడిన 24 మంది బీఎల్ఓలపై చర్యలు తీసుకున్నామన్నారు. జీరో డోర్ నెంబర్లు, ఒకే ఇంటిలో 10 మంది కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న కేసుల్లో 97 శాతం మేర తనిఖీలు పూర్తి చేసి ఓటర్ల జాబితా సవరించామని పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఒకే కుటుంబంలోని ఓటర్లు వేర్వేరు పోలింగ్ కేంద్రాలకు మారిపోయిన ఘటనలూ విశాఖ, ఎన్టీఆర్ జిల్లాల్లో నమోదు అయ్యాయని స్పష్టం చేశారు. విశాఖలో 26 వేల మంది ఓటర్లు, ఎన్టీఆర్ జిల్లాలో 2,27,906 ఓటర్లకు సంబంధించి ఓటర్లు ఇతర పోలింగ్ కేంద్రాలకు మారిందని అన్నారు. గందరగోళం లేకుండా ఈ జాబితాలను సవరించేందుకు కార్యాచరణ చేపట్టామన్నారు. ఓకే చోట 3 ఏళ్లు సర్వీసు పూర్తైన ప్రభుత్వ ఉద్యోగులు, క్రిమినల్ కేసులు నమోదైన వారు, ఈసీ క్రమశిక్షణా చర్యలకు ఆదేశించిన అధికారులను ఎన్నికల విధుల్లో ఉండరని ఆయన పేర్కొన్నారు. ఓటర్ల జాబితా ఉల్లంఘనలకు సంబంధించి ఇప్పటికే ఉరవకొండ, పొద్దుటూరు నియోజకవర్గాల ఈఆర్వోలు, పర్చూరు ఏఈఆర్వో, 1 సీఐ, 3 ఎస్ఐలు సస్పెండ్ అయ్యారని పేర్కొన్నారు. 50 మంది వరకూ బీఎల్వోలపై క్రమశిక్షణా చర్యలకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ఇదిలా ఉండగా ఏపీకి రానున్న కేంద్ర ఎన్నికల సంఘాన్ని చంద్రబాబు - పవన్ కల్యాణ్​ మంగళవారం కలవనున్నారు.

'అయ్యో రామా'! ఏపీ ఓటర్ల జాబితా తమిళంలో - తవ్వేకొద్దీ అక్రమాలు, అవకతవకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.