ETV Bharat / state

కాసులు కురిపిస్తోన్న స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ.. 9 నెలల్లోనే ఏకంగా..!

author img

By

Published : Jan 2, 2023, 5:22 PM IST

Stamps and Registrations Department Revenue : తెలంగాణ రాష్ట్రంలో స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ రాబడి గణనీయంగా పెరిగింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో గడిచిన తొమ్మిది నెలల్లో 14.54 లక్షల రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.10,583 కోట్లు రాబడి ప్రభుత్వ ఖజానాకు వచ్చింది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.7,944 కోట్లు రాబడి రాగా.. రూ.1,587 కోట్లు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చింది. రూ.1,052 కోట్లు ఇతర సేవల ద్వారా ఆదాయం సమకూరింది.

Stamps and Registrations Department Revenue
కాసులు కురిపిస్తోన్న స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ.. 9 నెలల్లోనే ఏకంగా..!

Stamps and Registrations Department Revenue : తెలంగాణ రాష్ట్ర ఖజానాకు వాణిజ్య పన్నుల శాఖ, ఎక్సైజ్‌ శాఖల తరువాత అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ. ఈ రాబడి క్రమంగా పెరుగుతోంది. రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరగకపోయినా 2022లో రెండుసార్లు ఛార్జీలు పెంచడం.. ఆదాయం పెరుగుదలకు దోహదం చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 14.54 లక్షల వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు, ఇతర సేవల ద్వారా దాదాపు రూ.10,583 కోట్లు రాబడి సమకూరింది. ఇందులో రూ.7,944 కోట్లు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ద్వారా రాబడి రాగా.. రూ.1,587 కోట్ల మేర వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చింది.

ప్రతి నెల సగటున రూ.1,175.87 కోట్లు మేర రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా ఆదాయం వస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రూ.15,600 కోట్లు మేర రాబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. డిసెంబరు నాటికి రూ.10,582 కోట్లు మేర రాబడి రావడంతో నిర్దేశించిన లక్ష్యంలో 67 శాతం వచ్చినట్లయ్యింది. గత ఆర్థిక ఏడాదిలో రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.10,997 కోట్ల రాబడి రాగా.. ఈ ఏడాది ఇప్పటికే దాదాపు అంతే మొత్తం ఆదాయం వచ్చింది.

ఈ ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో 5.63 లక్షల వ్యవసాయ ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరగ్గా, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు 8.91 లక్షలు జరిగాయి. డిసెంబరు ఒక్క నెలలోనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు రికార్డు స్థాయిలో 1.09 లక్షల జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 14.54 లక్షల రిజిస్ట్రేషన్లు జరగ్గా.. వీటిలో 39 శాతం వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు కాగా.. 61 శాతం వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ఉన్నాయి.

ప్రసుత్త ఆర్థిక సంవత్సరంలో డిసెంబరు ఆఖరు వరకు రిజిస్ట్రేషన్ల శాఖ రాబడి విశ్లేషణ రూపొందించింది. మరో మూడు నెలల్లో రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి అంచనాల మేరకు రాబడి సమకూరే అవకాశం ఉందని ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ చుట్టు పక్కల రియల్ ఎస్టేట్‌కు పెరుగుతున్న డిమాండ్... నలువైపులా క్రయ విక్రయాలు వంటి పరిణామాలు.. ప్రభుత్వ ఖజానాకు రాబడిని మరింత పెంచుతుందని పేర్కొంటున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.