ETV Bharat / state

PULICHINTALA: స్టాప్‌లాక్‌ పనులు పూర్తి

author img

By

Published : Aug 8, 2021, 4:48 AM IST

Updated : Aug 8, 2021, 7:30 AM IST

పులిచింతల ప్రాజెక్టులో గేటు ఊడిపోవడంతో తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్న స్టాప్‌లాక్‌ గేటు పనులు పూర్తయ్యాయి. అర్ధరాత్రి వరకు 11 ఎలిమెంట్లు పూర్తి చేశారు. అన్ని గేట్లు మూసి ఎగువ ప్రవాహంతో ప్రాజెక్టును నింపనున్నారు.

stop lock
stop lock

పులిచింతల జలాశయంలో నీటి ప్రవాహాన్ని నిలువరించే స్టాప్‌లాక్‌ గేటు ఏర్పాటు పనులు పూర్తయ్యాయి. ఆటంకాలను అధిగమిస్తూ క్రమంగా యంత్రాంగం ముందుకెళ్లింది. తాత్కాలిక గేటు ఏర్పాటుకు 11 ఎలిమెంట్లు బిగించారు. అర్ధరాత్రి వరకు శ్రమించిన నిపుణుల బృందం పనులు పూర్తి చేసింది. 27-30 టన్నుల బరువుండే ఇనుప దిమ్మెలను ఇన్నాళ్లూ వాడకపోవడంతో అమర్చేటప్పుడు కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. అందుకే ఒకరోజులో పని పూర్తికాలేదు. ఇక నుంచి అన్ని గేట్లు మూసి ఎగువ ప్రవాహంతో డ్యాంను నింపనున్నాురు.

.

కనిపించిన గేటు

ప్రవాహ ధాటికి ఊడి విరిగి పడిపోయిన 16వ నంబరు గేటు డ్యాం నుంచి 500 మీటర్ల దూరంలో కనిపించింది. 250 టన్నుల బరువుండే ఆ గేటు ఆచూకీ కోసం మత్స్యకారులను రంగంలోకి దింపారు. ఓ మత్స్యకారుడికి కనిపించగానే ఇంజినీరింగ్‌ అధికారులను తీసుకెళ్లి చూపగా వారు నిర్ధారించారు. గేటును ఇనుపతాళ్లతో లాగుతూ డ్యాం వద్దకు చేర్చాలని ఇంజినీరింగ్‌ అధికారి ఒకరు చెప్పారు. గేటును తిరిగి వినియోగంలోకి తేవటానికి అవసరమయ్యే ట్రునియన్‌ను జపాన్‌ నుంచి తెప్పిస్తామని చెబుతున్నారు.

అడుగంటిన నిల్వలు

మూడు రోజులుగా 38 టీఎంసీలకు పైగా నీటిని దిగువకు వదిలేయడంతో జలాశయంలో నీటి నిల్వలు అడుగంటాయి. ప్రస్తుతం 4-5 టీఎంసీలకు మించి నిల్వలు లేవు. అయితే, వర్షాకాలం కావటంతో ఎగువ నుంచి వరదలు వస్తాయని, వాటితో తిరిగి జలాశయాన్ని నింపుతామని అధికారులు చెబుతున్నారు.

సీడబ్ల్యూసీ ప్రోటోకాల్‌ పాటించలేకపోయాం: ఈఎన్‌సీ

తాత్కాలిక గేటు పనుల పర్యవేక్షణకు వచ్చిన ఈఎన్‌సీ నారాయణరెడ్డి మాట్లాడుతూ, ‘పులిచింతలకు మూడేళ్ల నుంచి వరదలు బాగా వస్తున్నాయి. కొత్త ప్రాజెక్టు కావటంతో ఎగువ నుంచి వచ్చే వరద నీటిని దిగువకు వదలడానికి కేంద్ర జలవనరుల మండలి (సీడబ్ల్యూసీ) నిబంధనల మేరకు కొన్ని ప్రోటోకాల్స్‌ పాటించాలి. వాటిని పాటించలేకపోయాం. మిగులు జలాలను దిగువకు వదిలేటప్పుడు గేట్లు ఊగుతున్నాయా? వైబ్రేషన్స్‌ వస్తున్నాయా, లీకేజీలు ఏమైనా ఏర్పడ్డాయా అనేది తెలుసుకోవచ్చు. ఆ ప్రోటోకాల్స్‌ పాటించకపోవడంతో అవేవీ తెలుసుకోలేకపోయాం. గేటు విరిగిపడిన విషయంలో నిర్లక్ష్యం ఎవరిదైనా వదలబోము. తాత్కాలిక గేటు పనులు పూర్తయిన మరుక్షణం నుంచే ఒక్క నీటి బొట్టు కూడా వృథా కాకుండా జలాశయంలోకి మళ్లిస్తాము’ అని తెలిపారు.

ఇదీ చదవండి:

AMARAVATI: కలల రాజధాని ఇప్పుడిలా..!

Last Updated :Aug 8, 2021, 7:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.