Protests Across State Against Chandrababu Arrest:ఆగని ఆగ్రహ జ్వాలలు.. చంద్రబాబు విడుదల కోసం కొనసాగుతున్న తెలుగుదేశం ఆందోళనలు..
Published: Sep 19, 2023, 7:16 PM


Protests Across State Against Chandrababu Arrest:ఆగని ఆగ్రహ జ్వాలలు.. చంద్రబాబు విడుదల కోసం కొనసాగుతున్న తెలుగుదేశం ఆందోళనలు..
Published: Sep 19, 2023, 7:16 PM

Protests Across State Against Chandrababu Arrest: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ.. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసనలు తెలిపారు. ఏ తప్పూ చేయని చంద్రబాబుని.. అక్రమంగా అరెస్టు చేశారంటూ కార్యకర్తలు మోకాళ్లపై కూర్చుని నిరసన చేయగా.. మరోచోట పొర్లు దండాలు పెట్టారు. అధినేత త్వరగా బయటకు రావాలంటూ.. పలుచోట్ల.. ప్రత్యేక ప్రార్థనలు, రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు.
Protests Across State Against Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులు, చంద్రబాబు అభిమానులు ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు.చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ మహిళలు పెద్ద సంఖ్యలో నిరసన దీక్షలు చేపట్టారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసేందుకు వెళ్తున్న నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకోవడమేగాక.. గృహ నిర్బంధించారు.
ఉమ్మడి కృష్ణా: విజయవాడలో కనకదుర్గమ్మకు సారె సమర్పించేందుకు బయలుదేరిన ఉమ్మడి కృష్ణా జిల్లాల నేతలను ఎక్కడికక్కడ పోలీసులు గృహనిర్బంధించారు. అమ్మవారి గుడికి బయలుదేరిన మాజీమంత్రి కొల్లు రవీంద్రను విజయవాడలో పోలీలు అడ్డుకోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ పోలీసు కంట్రోల్ రూమ్ వద్ద బాబు రాజేంద్రప్రసాద్, బూరగడ్డ వేదవ్యాస్‌లను అరెస్ట్ చేశారు. విజయవాడలోని వినాయకుడి గుడివద్దకు చేరుకున్న దేవినేని ఉమ, బుద్ధ వెంకన్నలు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇరువురికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తెలుగుదేశం నేతలను గృహనిర్బంధించడంపై లోకేశ్, అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయవాడలోని మిల్క్‌సెంటర్‌లో శ్రీ అభయాంజనేయస్వామి గుడివద్ద పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కార్పొరేటర్లు పాల్గొన్నారు. గుడివాడలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. నందిగామలో ఏడోరోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. జగ్గయ్యపేటలో మహిళలు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. గన్నవరంలోనూ దీక్షలు కొనసాగుతున్నాయి. గుంటూరు జిల్లా పొన్నూరులో చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ సంఘీభావం తెలిపారు.
మేదరమెట్ల నుంచి శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి వారి ఆలయం వరకు టీడీపీ శ్రేణులు పాదయాత్ర నిర్వహించారు. బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం మేదరమెట్ల నుండి శింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయం వరకు తెదేపా శ్రేణులు పాదయాత్ర నిర్వహించారు. పల్నాడు జిల్లా ఓర్వకల్లులో గంగాదేవి పొంగళ్లు నివేదించారు.
గుడివాడలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. వేమవరం శ్రీ కొండలమ్మ వారి దేవస్థానంలో అమ్మవారికి వెనిగండ్ల రాము ప్రత్యేక పూజలు చేశారు. నందిగామలో ఏడోరోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. జగ్గయ్యపేటలో మహిళలు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. గన్నవరంలోనూ దీక్షలు కొనసాగుతున్నాయి.
ఉమ్మడి గుంటూరు జిల్లా: గుంటూరు జిల్లా పొన్నూరులో చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు ఎమెల్సీ పంచుమర్తి అనురాధ సంఘీభావం తెలిపారు. మేదరమెట్ల నుంచి శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి వారి ఆలయం వరకు చంద్రబాబు అభిమానులు పాదయాత్ర నిర్వహించారు.
ఉమ్మడి అనంతపురం జిల్లా: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో టిఎన్ఎస్ఎఫ్, తెలుగు యువత నాయకుల ఆధ్వర్యంలో మోకాళ్లపై కూర్చుని అర్థనగ్న నిరసన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ వినూత్నంగా టీడీపీ నాయకులు అంబేడ్కర్ విగ్రహం చుట్టూ పొర్లుదండాలు పెట్టి ధర్నా చేశారు.
ధర్మవరంలో మాజీ మంత్రి పరిటాల సునీత కాన్వాయను పోలీసులు అడ్డుకున్నారు. కదిరిలో లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న పూజా కార్యక్రమానికి వెళ్తుండగా ధర్మవరం లక్ష్మీ చెన్నకేశవ సర్కిల్లో పోలీసులు అడ్డగించారు. అక్కడ నుంచి పోలీసు బందోబస్తు మధ్య రిలే నిరాహార దీక్ష శిబిరం వద్దకు చేరుకొని నిరసన తెలిపారు. పోలీసుల తీరుపై పరిటాల సునీత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూపురంలో పట్టణంలోని ఎన్టీఆర్ కూడలి వద్ద కళ్లకు గంతలు కట్టుకొని మోకాళ్లపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ అభిమానులతో పాటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. కదిరిలో జిల్లా నాయకులు రెండు కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. పట్టణములోని జాతీయ రహదారి 42 పై ఉన్న నానా దర్గాలో టీడీపీ నాయకులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
కడప జిల్లా: వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఒంటిమిట్ట మండలం మాధవరం హైవేపైకి టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుని.. ర్యాలీ చేపట్టారు. ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో.. వాగ్వాదం జరిగింది. కడపలోని ఎన్టీఆర్ విగ్రహానికి బాలయ్య అభిమానులు వినతిపత్రం అందజేశారు.
కర్నూలు జిల్లా: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో నిరసన దీక్షలు చేపట్టారు. మద్దికెరలో అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆదోనిలో ఏడో రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. మహిళలు కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. ఆదోనిలో మహిళలు భారీ నల్లజెండాతో నిరసన ర్యాలీ చేపట్టారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా: కరకుదురులో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వరంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ముమ్మడివరంలో తెలుగు యువత ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొని సంఘీభావం తెలిపారు. పి.గన్నవరంలో మహిళలు మోకాళ్లపై కూర్చొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ప్రకాశం జిల్లా: ప్రకాశం జిల్లా మార్కాపురంలో మహిళలు పెద్దఎత్తున దీక్షలో పాల్గొన్నారు. ఆంజనేయ స్వామి ఆలయంలో 1001 కొబ్బరికాయలు కొట్టి తమ నాయకుడు త్వరగా బయటకు రావాలని ఆకాక్షించారు. మహిళలు భారీ ర్యాలీ చేపట్టారు. ఆంజనేయస్వామి ఆలయంలో వెయ్యి కొబ్బరికాయలు కొట్టారు. కనిగిరిలో ఏడో రోజు నిరసన దీక్షలు కొనసాగాయి. బాబుతో మేము సైతం అంటూ జిల్లాలోని వెలిగండ్ల మండలం నుంచి టీడీపీ అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో దీక్షలో పాల్గొన్నారు. గిద్దలూరులో తెలుగుదేశం కార్యకర్త అరగుండు గీయించుకుని నిరసన తెలిపారు.
విశాఖ జిల్లా: సింహాచలం అప్పన్న గుడికి వెళ్తున్న మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తిని పోలీసులు అడ్డుకున్నారు. సింహాచలం వరాహ నరసింహస్వామి ఆలయంలో మెట్లపై మోకాళ్లపై నడిచి తెలుగుదేశం శ్రేణులు నిరసన తెలిపారు. చంద్రబాబునాయుడు ఆరోగ్యంగా ఉండాలని జైలు నుంచి విడుదల కావాలని కోరుతూ అనకాపల్లిలో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాయకారావుపేటలో బాలకృష్ణ అభిమానులు...కళ్లకు నల్లరిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు.
ఉమ్మడి విజయనగరం జిల్లా: సాలూరులో పోస్టుకార్డు ఉద్యమం చేప్టటారు. విజయనగరం జిల్లా రాజాంలో తెలుగుదేశం కార్యాలయం నుంచి అంబేడ్కర్ కూడలి వరకు మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్ ఆధ్వర్యంలో మహిళలు ర్యాలీ చేపట్టి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు.
శ్రీకాకుళం జిల్లా: శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో మహిళలు నిరసన ర్యాలీ నిర్వహించారు. నీలమణి అమ్మవారి ఆలయంలో పూజలు చేసేందుకు వందల సంఖ్యలో మహిళలు బయలుదేరారు. ర్యాలీ నిర్వహిస్తూ సీఎం డౌన్ డౌన్, సైకో పోవాలి సైకిల్ రావాలంటూ నినాదాలు చేశారు. కొంత దూరం ప్రయాణించిన తర్వాత పాతపట్నం పోలీసులు అడ్డుకున్నారు.
