వైసీపీ పాలనపై పవన్​కల్యాణ్​ వ్యంగ్యాస్త్రాలు.. ఏమన్నారంటే..!

author img

By

Published : Feb 1, 2023, 8:35 PM IST

Pawan Kalyan

Pawan Kalyan: వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్ల వర్షం కురిపించారు. ప్రభుత్వం పాలన తీరుపై విమర్శలు సంధించారు. భూమి నుంచి ఇసుక వరకు, మద్యం నుంచి గనుల వరకు, అడవుల నుంచి కొండల వరకు, కాగితం నుంచి ఎర్రచందనం వరకు ఏపీ నుంచి వచ్చే ప్రతి పైసా ధనిక ముఖ్యమంత్రి చేతిలోనే ఉందటూ ఆరోపించారు.

Pawan Kalyan respond in Twitter: సీఎం వైఎస్‌ జగన్‌ తీరుపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ట్విటర్‌ వేదికగా విమర్శలు సంధించారు. వైసీపీ పాలనపై తనదైన శైలిలో స్పందించారు. "అరకులో బాక్సైట్‌ తవ్వకాలను ప్రోత్సహిస్తున్న భారతదేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి.. కామ్రేడ్‌ చారు మజుందార్‌, కామ్రేడ్‌ తరిమెల నాగిరెడ్డి, కామ్రేడ్‌ పుచ్చపల్లి సుందరయ్య వంటి ‘క్లాస్‌ వార్‌’ గురించి మాట్లాడుతున్నారు. ఇదో విచిత్రం..! ఆంధ్రప్రదేశ్‌లో వర్గాలకు తావు లేదు, ప్రజలంతా వైసీపీ రాజ్యానికి బానిసలుగా అయిపోయారు. భూమి నుంచి ఇసుక వరకు, మద్యం నుంచి గనుల వరకు, అడవుల నుంచి కొండల వరకు, కాగితం నుంచి ఎర్రచందనం వరకు ఏపీ నుంచి వచ్చే ప్రతి పైసా ధనిక ముఖ్యమంత్రి చేతిలోనే ఉంది. నిజంగా ఇదో గొప్ప కళాఖండం.

  • 1) Oxymoron (Noun) - Meaning - A Combination of Contradictory words.
    Ex – Andhra Pradesh is a State with Poor People run by the Richest CM of the Country
    Trivia – Our CM’s wealth is more than those of all the other CMs combined;
    AP CM, A "CLASS" apart!

    — Pawan Kalyan (@PawanKalyan) February 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • 4) Who needs Davos when YCP can bring the galaxy of investments to Andhra; Our IT and Industries Minister has already inaugurated Noodles Centre and Chai Points, now only waiting for the IT Companies to be set up. Another CLASS Act!

    — Pawan Kalyan (@PawanKalyan) February 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • The Richest CM in India with graft charges,who encourages bauaxite mining in Araku,talks about ‘Class War’ like Comrade Charu Mazumdhar, Comrade Tarimela NagiReddy and Comrade Pucchalipalli Sundarayya.What an Irony!!

    — Pawan Kalyan (@PawanKalyan) February 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

వైసీపీ ఏపీలోని పేదలను సామాన్యతతో సంతృప్తిగా ఉండేలా చేసింది. వారి జీవితాలు, గౌరవం, శ్రమ కొన్ని డబ్బులకు అమ్ముడుపోయాయి. ఏపీలో మిడిల్‌ క్లాస్‌పై అత్యంత నిర్లక్ష్యం. వారిని టాక్స్‌ పేయింగ్‌ మూగ సేవకులుగా వైసీపీ పరిగణిస్తోంది. వైసీపీ ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం తీసుకురాగలిగినప్పుడు.. దావోస్‌ ఎవరికి కావాలి? మన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి ఇప్పటికే నూడుల్స్‌ సెంటర్‌, చాయ్‌ పాయింట్లను ప్రారంభించారు. ఇప్పుడు ఐటీ కంపెనీల ఏర్పాటు కోసం మాత్రమే వేచి ఉన్నారు. ఇదో చిత్రమైన పరిణామం" అని పవన్‌ కల్యాణ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.