ఊపందుకున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం.. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పోటీ

author img

By

Published : Mar 8, 2023, 10:51 PM IST

graduate MLC election in AP

graduate MLC election: రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అభ్యర్ధులతో పాటు వారి మద్దతుదారులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. సమావేశాలు ఏర్పాటు చేసి మరీ తమ అభ్యర్థులకే ఓట్లు వేయాలంటూ అభ్యర్థిస్తున్నారు.

ఊపందుకున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

graduate MLC election in AP: పేద ప్రజల సంక్షేమం కోసం పని చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాలని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కోరారు. నంద్యాల జిల్లా బేతంచర్లలోని వైసీపీ కార్యాలయంలో ఎంపీటీసీలు, వార్డు కౌన్సిలర్లతో సమావేశం నిర్వహించిన ఆయన... వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఫ్యాక్షనిజం తగ్గిందన్నారు. అందరూ పార్టీ అభ్యర్థులకు సహకరించాలని కోరారు.

ఎమ్మెల్సీ ఎన్నికల కోసం తిరుపతిలో వైసీపీ నేతలు దొంగ ఓట్లు నమోదు చేయించారంటూ... తెలుగుదేశం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆధ్వర్యాన... వెస్ట్ పోలీస్‍ స్టేషన్లో నాయకులు ఫిర్యాదు చేశారు. ఆధారాలను పోలీసులకు అందించారు. సీఎం జగన్ ఉద్యోగులు, టీచర్లు, యువతను సైతం మోసం చేసిన దొంగ ఓట్లతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు కుట్రలు పన్నుతున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. కేవలం ఒక్క తిరుపతిలోనే సుమారు 15 వేల దొంగ ఓట్లు నమోదు చేశారని అచ్చెన్నాయుడు తెలిపారు. దొంగ ఓట్లకు సంతకాలు పెట్టిన గెజిటెడ్ ఆఫీసర్లు జైలుకు వెళ్లడం ఖాయమని వెల్లడించారు.

ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం పోటాపోటీగా సాగింది. వైసీపీ అభ్యర్ధి సీతంరాజు సుధాకర్‌కు మద్దతుగా... ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి ప్రచారం చేశారు. విజయనగరంలో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధి వేపాడ చిరంజీవిరావు తరపున ఆ పార్టీ రాష్ట్ర పరిశీలకుడు చిక్కాల రామచంద్రరావు.... వార్డుల్లో తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు.

కర్నూలులో తెదేపా అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని టీజీ భరత్ ప్రచారం చేశారు. వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి విద్యా సంస్థల్లో ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం తిరుపతిలో వైసీపీ నేతలు దొంగ ఓట్లు నమోదు చేయించారంటూ... తెలుగుదేశం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆధ్వర్యాన... వెస్ట్ పోలీస్‍ స్టేషన్లో నాయకులు ఫిర్యాదు చేశారు. ఆధారాలను పోలీసులకు అందించారు. మహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణం చేసినట్లే... వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వస్త్రాపహరణం చేస్తోందని... సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. తిరుపతి యశోద నగర్ లోని ఓ చిన్న గదిలో 11 మంది గ్రాడ్యుయేట్ ఓట్లు ఉండటం, వైసీపీ అరాచకాలకు పరాకాష్టగా అభివర్ణించారు. దీనిపై కోర్టును ఆశ్రయిస్తామని ప్రకటించారు.

వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అక్రమాలకు అంతులేకుండా పోతోంది. తిరుపతి నగరంలో 7వేల దొంగ ఓట్లు నమోదయ్యాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓట్లను నమోదు చేయించిన రెవెన్యూ అధికారుల పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. -నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో సభాపతి తమ్మినేని సీతారాం, మంత్రి బొత్స సత్యనారాయణ పార్టీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.