మానసిక క్షోభకు గురి చేసి నా కుమారుడిని చంపేశారు

author img

By

Published : Aug 20, 2022, 9:04 PM IST

Updated : Aug 20, 2022, 9:38 PM IST

డబ్బు తీసుకొని ఇవ్వకుండా క్షోభకు గురిచేసి నా కుమారుడిని చంపేశారు

Manjunatha Reddy ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి అల్లుడు మంజునాథరెడ్డి మృతికి సహస్ర కంపెనీ నిర్వాకుడు చక్రధర్ అనే వ్యక్తి కారణమని ఆయన తండ్రి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. వ్యాపారం నిమిత్తం డబ్బు తీసుకొని ఎన్నిసార్లు అడిగినా తిరిగి ఇవ్వలేదన్నారు.

డబ్బు తీసుకొని ఇవ్వకుండా క్షోభకు గురిచేసి నా కుమారుడిని చంపేశారు

Kapu Ramachandra Reddy son in law: ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి అల్లుడు మంజునాథరెడ్డి మృతికి సహస్ర కంపెనీ నిర్వాహకుడు చక్రధర్ అనే వ్యక్తి కారణమని ఆయన తండ్రి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. చక్రధర్ వ్యాపారం నిమిత్తం మంజునాథ్ వద్ద డబ్బులు తీసుకొని మోసం చేసి మానసిక క్షోభకు గురి చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బు ఇవ్వమని ఎన్నిసార్లు అడిగినా ఇవ్వలేదన్నారు. నాలుగేళ్లుగా తిప్పుకుంటూ ఒక్కరూపాయి ఇవ్వలేదని వాపోయారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఇదిలా ఉండగా మంగళగిరి ప్రభుత్వాసుపత్రిలో శవపంచనామా అనంతరం మంజునాథ రెడ్డి మృతదేహాన్ని రాయచోటికి తరలించారు. మంజునాథ్ రెడ్డి మృతితో కాపు రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

జే-ట్యాక్సులో తేడాల వల్లే..: తాడేపల్లి ప్యాలెస్​కు వచ్చే జే-ట్యాక్సులో తేడాలతోనే మంజునాథ్ రెడ్డి బలయ్యారని తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు ఆరోపించారు. సహస్త్ర కనస్ట్రక్షన్ ఎండీ సుగవాసి చక్రధర్ వల్లే తన కొడుకు చనిపోయాడని మృతుడి తండ్రి చెప్పడాన్ని పిల్లి మాణిక్యరావు ప్రస్తావించారు. వైకాపా ఎంపీ అయోధ్య రామిరెడ్డికి, ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డికి సంబంధించిన రాంకీ కంపెనీ డైరక్టర్​గా చక్రధర్ ఉన్నారన్నారు. గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓఎంసీ కంపెనీని తిరిగి ప్రారంభిస్తున్న సందర్భంలో మంజునాథ్ రెడ్డి మరణం అనుమానాలకు తావిస్తోందన్నారు. అక్రమ మైనింగ్​లో తలదూర్చిన వారంతా జగన్ గ్యాంగ్ చేతుల్లో కనుమరుగవుతున్నారని మాణిక్యరావు ఆరోపించారు. జగన్​ అక్రమ ఆస్తులతో లింకులున్న వారంతా ఇలా అనుమానాస్పదస్థితిలో మృతి చెందాల్సిందేనా అని ఆయన నిలదీశారు.

ఏం జరిగిందంటే..: ప్రభుత్వ విప్‌, అనంతపురం జిల్లా రాయదుర్గం వైకాపా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు పప్పిరెడ్డి మంజునాథరెడ్డి (34) శుక్రవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని అవంతి అపార్ట్‌మెంట్‌ 101వ నంబరు ఫ్లాటులో ఈ ఘటన చోటు చేసుకుంది. మంజునాథరెడ్డి అప్పుడప్పుడూ ఈ ఫ్లాటుకు వచ్చి రెండు, మూడు రోజులు ఉండి వెళ్తుంటారు. మూడు రోజుల కిందట ఇక్కడికి వచ్చిన ఆయన శుక్రవారం శవమై కనిపించారు. మంజునాథరెడ్డి స్వగ్రామం అన్నమయ్య జిల్లాలోని రామాపురం మండలం హసనాపురం పంచాయతీలోని పప్పిరెడ్డిగారిపల్లె. ఆయన తండ్రి మహేశ్వర్‌రెడ్డి వైకాపా నాయకుడు, పీఎంఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ యజమాని. కుమారుడి మృతి వార్త తెలుసుకుని ఆయన హుటాహుటిన విజయవాడకు బయల్దేరారు. మంజునాథరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారని సామాజిక మాధ్యమాల్లో తొలుత విస్తృత ప్రచారం జరిగింది. కానీ ఘటనా స్థలంలో పరిస్థితులు గమనించినా, స్థానికులు చెబుతున్న అంశాలు విన్నా ఇది అనుమానాస్పద మృతిగానే కనిపిస్తోంది. ఈ వ్యవహారంపై పోలీసులు నోరు మెదపకపోవడం, ఫోన్లు చేసినా స్పందించకుండా గోప్యత పాటించడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. కాగా.. మంజునాథరెడ్డి భార్య స్రవంతి వైద్యురాలు.

ముగిసిన అంత్యక్రియలు: మంజునాథరెడ్డి అంత్యక్రియలు ఆయన స్వగ్రామం అన్నమయ్య జిల్లా రామాపురం మండలం పప్పిరెడ్డి గారి పల్లెలో ముగిశాయి. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తన అల్లుడి మృతదేహన్ని చూడగానే బోరున విలపించారు. అంతిమయాత్రలో కర్ణాటక రాష్ట్రం బళ్లారి ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డి, కడప జడ్పీ చైర్మన్ అమరనాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గడికోట మోహన్ రెడ్డి, ద్వారకనాథ్ రెడ్డి, రమేశ్ రెడ్డి, తితిదే పాలకమండలి మాజీ సభ్యుడు ప్రసాద్ బాబు తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి

Last Updated :Aug 20, 2022, 9:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.