ETV Bharat / state

హామీలేమయ్యాయ్ సీఎం గారూ..!: లోకేశ్

author img

By

Published : Sep 24, 2019, 11:26 PM IST

ముఖ్యమంత్రి జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నింటినీ మర్చిపోయారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఆరోపించారు. వైకాపా ప్రభుత్వ తీరుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా...నవరత్నాలంటూ నవ్వులు చిందిస్తున్నారే తప్ప ప్రజా సమస్యలపై మాట్లాడడం లేదని విమర్శించారు.

పాదయాత్రలో ఇచ్చిన హామీలేమయ్యాయ్ సీఎం గారూ..! : లోకేశ్

పాదయాత్రలో ఇచ్చిన హామీలేమయ్యాయ్ సీఎం గారూ..! : లోకేశ్

సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నింటినీ అధికారంలోకొచ్చేసరికి మర్చిపోయారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరులో పర్యటించిన ఆయన స్థానిక తెదేపా నేతలతో సమావేశమయ్యారు. ''ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 4 నెలలు కూడా పూర్తి కాక ముందే విమర్శించకూడదని అనుకున్నా... ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకతను చూసి తప్పనిసరై స్పందించాల్సి వస్తోంది'' అన్నారు. కరెంటు కోతలు, ఇసుక కొరతతో ప్రజలు అల్లాడుతున్నా.. నవరత్నాలంటూ నవ్వులు చిందించడం జగన్​కే చెల్లిందన్నారు.

900 పైగా హామీలిచ్చి 9 హామీలైన నవరత్నాలనే అమలు పరుస్తున్నారని లోకేశ్ ఆరోపించారు. వీటిల్లో నెలకో రత్నం రాలిపోతోందని.. రూపాయి బియ్యానికి 9 రూపాయల సంచిలో ఇవ్వడం ఒక్క జగన్​కే సాధ్యమని ఎద్దేవా చేశారు. పోలవరం రివర్స్ టెండర్ పేరిట వందల కోట్లు మిగిల్చామని ప్రకటించుకోవడం వెనుక ప్రమాదకరమైన చర్యలున్నాయని అనుమానించారు. రాజధాని ప్రాంతంలో తనకు 500 ఎకరాలుందని ఆరోపించిన వైకాపా నేతలు, ఇప్పటి వరకూ ఎందుకు నిరూపించలేకపోయారని ప్రశ్నించారు.

మంగళగిరి ప్రాంత ప్రజలు ఎన్నో ఆశలతో గెలిపించిన ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఎప్పుడూ కనిపించరని లోకేశ్ విమర్శించారు. ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే ఎమ్మెల్యే మాత్రం ఎప్పుడూ కరకట్టపైనే తిరుగుతుంటారని ఆక్షేపించారు. చంద్రబాబు ఇంటికి కాపలా ఉండేందుకు ఆయన ఎమ్మెల్యే అయ్యారా అనే అనుమానం కలుగుతోందన్నారు.

ఇదీ చదవండి:

తెదేపా నేతలు ఇకనైనా మారాలి:మంత్రి బాలినేని

Intro:ap_knl_14_24_police_suside_ab_ap10056
కర్నూల్ లో ఓ కానిస్టేబుల్ అనుమానాస్పదంగా మృతి చెందాడు .. వి ఆర్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న సోమ భూపాల్ ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.. విధుల నుండి మూడు గంటలకు ఇంటికి వచ్చిన సోమ భూపాల్ సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని.... తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీ.ఐతెలిపారు.
బైట్. రామకృష్ణారెడ్డి. సీ.ఐ.


Body:ap_knl_14_24_police_suside_vo_ab_ap10056


Conclusion:ap_knl_14_24_police_suside_vo_ab_ap10056
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.