ETV Bharat / state

High Court News: ప్రభుత్వ భూమిని కాపాడాలంటూ పిల్​.. వారికి నోటీసులు

author img

By

Published : Jul 20, 2023, 12:24 PM IST

High Court on Vinukonda Land Kabja: పల్నాడు జిల్లా వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి గ్రామ పరిధిలోని వివిధ సర్వే నంబర్లలోని 175 ఎకరాల ప్రభుత్వ, ఎసైన్డ్‌ భూములను మాల్పూరి ఆగ్రోటెక్‌ ప్రైవేటు లిమిటెడ్‌, శ్రీవత్స ఫుడ్‌పార్క్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలు ఆక్రమించాయని, ప్రభుత్వ భూమిని కాపాడాలంటూ వినుకొండకు చెందిన కీర్తిపాటి వెంకటేశ్వర్లు హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యానికి హైకోర్టు స్పందించింది. వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న శ్రీవత్స ఫుడ్‌పార్క్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ఎండీ, వినుకొండ వైకాపా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, మాల్పూరి ఆగ్రోటెక్‌ సంస్థ ఎండీ లక్ష్మణస్వామికి నోటీసులు జారీ చేసింది.

High Court on Vinukonda Land Kabja
High Court on Vinukonda Land Kabja

High Court on Vinukonda Land Kabja: పల్నాడు జిల్లా వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి గ్రామ పరిధిలోని వివిధ సర్వే నంబర్లలోని 175 ఎకరాల ప్రభుత్వ, ఎసైన్డ్‌ భూములను మాల్పూరి ఆగ్రోటెక్‌ ప్రైవేటు లిమిటెడ్, శ్రీవత్స ఫుడ్‌పార్క్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలు ఆక్రమించాయని, ప్రభుత్వ భూమిని కాపాడాలంటూ దాఖలైన ప్రజావ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న శ్రీవత్స ఫుడ్‌పార్క్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ఎండీ, వినుకొండ వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, మాల్పూరి ఆగ్రోటెక్‌ సంస్థ ఎండీ లక్ష్మణస్వామికి నోటీసులు జారీ చేసింది.

వారితోపాటు రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి, పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి, పల్నాడు జిల్లా కలెక్టర్, సబ్‌కలెక్టర్, ఆర్డీవో, వినుకొండ తహశీల్దార్‌ తదితరులకు నోటీసులు ఇచ్చింది. కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావుతో కూడిన ధర్మాసనం ఈమేరకు ఉత్తర్వులిచ్చింది.

బ్రాహ్మణపల్లి గ్రామంలోని వివిధ సర్వే నంబర్లలో ఉన్న 175 ఎకరాల ప్రభుత్వ, ఎసైన్డ్‌ భూములను మాల్పూరి ఆగ్రోటెక్‌ ప్రైవేటు లిమిటెడ్, శ్రీవత్స ఫుడ్‌పార్క్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థల ఆక్రమణలో ఉన్నాయని వాటిని కాపాడాలంటూ వినుకొండకు చెందిన కీర్తిపాటి వెంకటేశ్వర్లు హైకోర్టులో పిల్‌ వేశారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది జడ శ్రవణ్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ.. 175 ఎకరాలను బ్యాంకుల్లో తాకట్టుపెట్టి రూ.50 కోట్ల రుణం పొందారన్నారు. ఎసైన్డ్‌ భూముల విషయంలో అనధికారిక విక్రయ దస్తావేజులు సృష్టించారన్నారు. ఆక్రమణలో ఉన్న భూమిని స్వాధీనం చేసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.

High Court on Tiger Nageshwara Rao Movie: టైగర్‌ నాగేశ్వరావు సినిమా ఎరుకుల సామాజికవర్గం మనోభావాలను కించపరిచేదిగా ఉందని, స్టువార్టుపురం గ్రామప్రజల ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉందని పేర్కొంటూ చుక్కా పాల్‌రాజ్‌ హైకోర్టులో పిల్‌ వేశారు. ఆ సినిమా ప్రదర్శనకు ధ్రువీకరణ ప్రత్రం జారీ చేయకుండా సంబంధిత అధికారులను నిలువరించాలని కోరారు. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావుతో కూడిన ధర్మాసనం ముందుకు నిన్న ఈ వ్యాజ్యం విచారణకు వచ్చింది. పిల్‌ విచారణార్హతపై ముందుగా వాదనలు చెప్పాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాదికి సూచించిన ధర్మాసనం విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

High Court on Degree Colleges Entrance: గతేడాదిలో 25 శాతం కన్నా తక్కువ ప్రవేశాలు జరిగాయనే కారణంతో ఈ ఏడాది డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కౌన్సిలింగ్‌కు అనుమతించకపోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఇందుకు సంబంధించిన జీవో 24ను సస్పెండ్‌ చేసింది. కోర్టును ఆశ్రయించిన కళాశాలలను కౌన్సిలింగ్‌లో పాల్గొనేందుకు అనుమతివ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఈమేరకు ఉత్తర్వులిచ్చారు. తమ కళాశాలలకు కౌన్సిలింగ్‌లో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వకపోవడాన్ని, ఫీజులను ఖరారు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ పలు డిగ్రీ ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. న్యాయవాది మతుకుమిల్లి శ్రీవిజయ్‌ యాజమాన్యాల తరఫున వాదనలు వినిపించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.