ETV Bharat / state

'వైసీపీ అభివృద్ధి పట్టించుకోకుండా.. ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోంది'

author img

By

Published : Dec 25, 2022, 10:22 PM IST

BJP Leaders comments on YCP: మాజీ ప్రధాని అటల్ బీహారి వాజ్ పేయ్ జయంతి సందర్బంగా బీజేపీ నేతలు సుపరిపాలన దినోత్సవం నిర్వహించారు. గుంటూరులో బీజేపీ జిల్లా కార్యాలయంలో మాజీ ప్రధాని వాజ్‌పేయి జయంతి కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న జీవీఎల్​.. ఐటీ రంగం అభివృద్ధి కోసం వైసీపీ ప్రభుత్వం చేసిన కృషి ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. విజయవాడలో సుపరిపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని సోము వీర్రాజు మట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఒక్కొక్క స్థానానికి సుమారు రూ.100 కోట్లు ఖర్చు చేయడానికి వైసీపీ చూస్తోందని ఆరోపించారు.

BJP leaders
బీజేపీ నాయకులు

BJP Leaders comments on YCP: మూడేళ్ల వైసీపీ పాలనతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అభిప్రాయపడ్డారు. ఓటు బ్యాంక్ రాజకీయాలు తప్ప.. రాష్ట్రాభివృద్ధిపై దృష్టి పెట్టలేదని తీవ్రంగా విమర్శించారు. గుంటూరులో బీజేపీ జిల్లా కార్యాలయంలో మాజీ ప్రధాని వాజ్‌పేయి జయంతి కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా ఆయన పాల్గొన్నారు. ఐటీ రంగం అభివృద్ధి కోసం వైసీపీ ప్రభుత్వం చేసిన కృషి ఏంటో చెప్పాలని జీవీఎల్‌ ప్రశ్నించారు.

ప్రభుత్వంపై జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యలు

మూడున్నర సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధేమి లేదు.. ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు తప్పితే రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోవడం లేదు. స్థానిక నివాసం ఉండి వెళ్లిన వారి సంఖ్య 8 లక్షలు. ఆంధ్రప్రదేశ్ నుంచి 15 శాతం ఐటీ మ్యాన్​పవర్ ఉంటే ఐటీ రంగంలో ఆంధ్రప్రదేశ్ వాటా 0.1శాతం అంటే ఐటీ పరిశ్రమలు ఇక్కడ కనిపించడం లేదు. ఉన్నవాళ్లను కూడా మీరు తరిమేస్తున్నారు. వైసీపీ పాలనతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయిన్నారు..అందులో ఎటువంటి ఆశ్చర్యం లేదు. గత టీడీపీ పార్టీని కూడా ప్రజలు కోరుకునే పరిస్థితి లేదు. ఇక్కడ ప్రజలకు కచ్చితంగా ప్రత్యామ్నాయం కావాలి. ఆ ప్రత్యామ్నాయం కోసమే బీజేపీ జనసేనతో కలిసి ఓ ప్రయత్నం చేస్తోంది. - జీవీఎల్ నరసింహారావు, బీజేపీ ఎంపీ

రాష్ట్రంలో 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఇంకా పార్టీలో చేరికలు జరుగుతున్నాయని ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు వైసీపీపై విమర్శులు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ లో డబ్బు రాజకీయం జరుగుతుందని తెలిపారు. మాజీ ప్రధాని అటల్ బీహారి వాజ్​పేయ్ జయంతి సందర్బంగా బీజేపీ నేతలు విజయవాడలో సుపరిపాలన దినోత్సవం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో ఒక్కొక్క స్థానానికి సుమారు రూ.100 కోట్లు ఖర్చు చేయడానికి వైసీపీ చూస్తోందని సోము వీర్రాజు ఆరోపించారు. గ్రామసభను వాజ్ పేయ్ తీసుకువస్తే ఒక నాయకుడు దానిని జన్మభూమి కింద మార్పు చేసి ఏడాదికి నాలుగుసార్లు పెట్టారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఖాళీ స్థలం ఉంటే పన్ను కట్టాలని లేకపోతే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మిస్తామని ప్రభుత్వం చెబుతోందని ఎద్దేవా చేశారు. ప్రజలను భయపెట్టాలని అధికారులు ఖాళీ స్థలాల వద్ద బ్యానర్లు కడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనంతరం వివిధ పార్టీలకు చెందిన వారిని కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.