ETV Bharat / state

GV Anjaneyulu: అంగలూరులో జీవీ దీక్షతో.. విద్యుత్ పునరుద్దరణ

author img

By

Published : Dec 12, 2021, 1:07 PM IST

Updated : Dec 12, 2021, 4:41 PM IST

GV Anjaneyulu Deeksha at Angaluru : తెదేపా నేత జీవీ ఆంజనేయులు గుంటూరు జిల్లా అంగలూరు ఎస్సీ కాలనీవాసులకు మద్దతుగా నిలిచారు. మూడు రోజులుగా కరెంట్ తీసేయడంతో.. కాలనీ వాసుల తరఫున నిరసన చేపట్టారు. చలిని సైతం లెక్కచేయకుండా దీక్ష చేశారు. స్పందించిన అధికారులు కాలనీలో విద్యుత్ పునరుద్దరించారు.

GV Anjaneyulu Deeksha at Angaluru, angaluru electricity issue
ఎస్సీ కాలనీవాసుల కోసం తెదేపా నేత జీవీ ఆంజనేయులు నిరసన

GV Anjaneyulu Deeksha at Angaluru : గుంటూరు జిల్లా ఈపూరు మండలం అంగలూరు గ్రామం ఎస్సీ కాలనీలో మూడు రోజులుగా కరెంట్ తీసివేయడంతో.. మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు దీక్ష చేపట్టారు. విద్యుత్‌ పునరుద్ధరించే వరకు కదలబోమని జీవీ స్పష్టం చేశారు. కాలనీవాసులు కటిక చీకట్లో కాలం గడుపుతున్నట్లు సమాచారం తెలుసుకుని... వారికి మద్దుతుగా నిలిచారు. ఈ మేరకు శనివారం సాయంత్రం నుంచీ నిరసన చేపట్టారు.

GV Anjaneyulu Deeksha at Angaluru, angaluru electricity issue
దీక్షలో జీవీ ఆంజనేయులు

రాత్రంతా జాగారం..
ఎస్సీ కాలనీ మూడు రోజులుగా చీకటిలోనే మగ్గడాన్ని నిరసిస్తూ శనివారం సాయంత్రం 6 గంటల నుంచి.. నిరసనలోనే ఉన్నారు. చలిని లెక్క చేయకుండా.. అర్ధరాత్రి వేళ రోడ్డుపైనే పడుకున్నారు. కాలనీ వాసులతో కలిసి రోడ్డుపైనే రాత్రి నుంచి జీవీ నిరసన దీక్ష కొనసాగించారు. జీవీకి మద్దతుగా కాలనీవాసులు ఈ దీక్షలో పాల్గొన్నారు.

విద్యుత్ పునరుద్దరణ..
జీవీ దీక్షతో.. అంగలూరు ఎస్సీ కాలనీకి అధికారులు విద్యుత్‌ పునరుద్ధరణ చేశారు. విద్యుత్ వచ్చిన తర్వాతనే.. తెదేపా నేత జీవీ ఆంజనేయులు దీక్ష విరమించారు. ఈ దీక్షకు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు సంఘీభావం తెలిపారు. విద్యుత్ అధికారుల హామీతో 18 గంటల దీక్షను జీవీ ఆంజనేయులు విరమించారు.

ఇదీ చదవండి: Chandrababu letter to DGP: 'తిక్కారెడ్డికి ఏం జరిగినా.. ప్రభుత్వానిదే బాధ్యత'

Last Updated :Dec 12, 2021, 4:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.