ETV Bharat / state

పోలీసు స్టేషన్లలో ఎస్పీ విశాల్ గున్నీ ఆకస్మిక తనిఖీలు

author img

By

Published : Nov 7, 2020, 5:30 PM IST

sp vishal gunni
sp vishal gunni

గుంటూరు జిల్లాలోని పొన్నూరు, బాపట్ల పట్టణ.. రూరల్ పోలీసు స్టేషన్లను గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి.. పోలీసు సిబ్బందికి తగు సూచనలు జారీ చేశారు.

గుంటూరు జిల్లా గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీ... పొన్నూరు, బాపట్ల పట్టణ.. రూరల్ పోలీసు స్టేషన్​లను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లలోని రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీస్ స్టేషన్​ల ఆధునీకరణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు తనిఖీ నిర్వహిస్తున్నామన్నారు. ఫిర్యాదు చేసేందుకు వచ్చే ప్రజలతో పోలీసు అధికారులు ఏ విధంగా ప్రవర్తించాలన్న విషయంలో తగు సూచనలు ఇస్తున్నామని చెప్పారు. కొందరికి శిక్షణ తరగతులు కూడా నిర్వహించామని విశాల్ గున్నీ తెలియజేశారు.

ఇదీ చదవండి

'శ్రీదేవి అక్కా.. పేకాట గురించి మాట్లాడలేదని ప్రమాణం చేస్తారా?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.