Gang war: గుంటూరు నల్లపాడు పోలీస్‌స్టేషన్ పరిధిలో.. అల్లరిమూకల ఆగడాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. స్వర్ణభారతీ నగర్‌కు చెందిన యువకుడు.. ప్రత్యర్థి వర్గంలోని యువకుడితో స్నేహంగా ఉంటున్నాడని.. రెండురోజుల కిందట కర్రలు, రాళ్లతో దాడిచేశారు. సుమారు 10 మంది.. ఇష్టారీతిన చావబాదారు. వారందరూ అల్లరిమూక కావడం వల్ల.. యువకుడిని రక్షించడానికి ఎవరూ సాహసం చేయలేదు. కొందరు నల్లపాడు స్టేషన్‌కి ఫోన్ చేయడం.. ఆ వెంటనే పోలీసులు రావడంతో అల్లరిమూక పరారైంది. బాధితుడిని పోలీసులు జీజీహెచ్‌కు తరలించారు. ఘర్షణకు పాత గొడవలే కారణమా? లేక ఇంకైమనా కారణముందా అన్న కోణంలో.. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువకుడిపై మూకుమ్మడి దాడి చేసిన వీడియో.. సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే.. ఘర్షణ జరిగి రెండు రోజులు కావస్తున్నా పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకోకపోవడం ప్రశ్నర్ధకంగా మారింది.
ఇదీ చదవండి: