ETV Bharat / state

ఫిరంగిపురం వ్యవసాయ మార్కెట్ నూతనపాలక వర్గం ప్రమాణస్వీకారం

author img

By

Published : Sep 26, 2021, 9:02 PM IST

గుంటూరు జిల్లా ఫిరంగిపురం వ్యవసాయ మార్కెట్ యార్డ్ నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారం జరిగింది. ఛైర్మన్​గా అక్క విజయ్ కుమార్, వైస్ ఛైర్మన్​​ గా రేపూడి రంజన్ బాబు ప్రమాణ స్వీకారం చేశారు.

ప్రమాణస్వీకారం
ప్రమాణస్వీకారం

గుంటూరు జిల్లా ఫిరంగిపురం వ్యవసాయ మార్కెట్ యార్డ్ నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారం జరిగింది. ఛైర్మన్​గా అక్క విజయ్ కుమార్, వైస్ ఛైర్మన్​​ గా రేపూడి రంజన్ బాబు ప్రమాణ స్వీకారం చేశారు. సభ్యులుగా 17 మంది ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తాటికొండ శాసనసభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి, పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య, గుంటూరు నగర మేయర్ వెంకట మనోహర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి...ఛైర్మన్, వైస్ చైర్మన్​తో ప్రమాణం చేయించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడుతూ... రైతు సంక్షేమమే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని తెలిపారు. ప్రమాణ స్వీకారం ఆనంతరం మార్కెట్ యార్డు ఛైర్మన్ సభలో పలువురు డ్యాన్సర్లు చిందులు వేయటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇదీ చదవండి:

వజ్రపుకొత్తూరులో ఇద్దరు మత్స్యకారులు మృతి...మరొకరు గల్లంతు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.