ETV Bharat / state

AP Crime News: కన్న కుమార్తెపై తండ్రి అత్యాచారం.. తమిళ యువతిపై వైసీపీ సర్పంచ్ లైంగిక వేధింపులు

author img

By

Published : May 14, 2023, 11:56 AM IST

AP Crime News: కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే మైనర్ బాలికపై పలుమార్లు అత్యాచానికి పాల్పడ్డారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. వైయస్సార్ జిల్లా కమలాపురం ముద్దాయిగా ఉన్న టీడీపీ నేత దాది రామయ్య జైలులో అస్వస్థతకు గురయ్యారు. మరో ఘటనలో తమిళనాడుకు చెందిన యువతిపై వైఎస్సార్సపీ సర్పంచ్ లైంగికంగా హింసకు పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది.

father raped his daughter in guntur district
మైనర్ బాలికపై కన్న తండ్రి అత్యాచారం

AP Crime News : కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రి.. కుమార్తె విషయంలో అమానుషంగా ప్రవర్తించాడు. మైనర్ బాలికపై తండ్రి అత్యాచారం చేసిన ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. తాడికొండ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన కుమార్తెను బెదిరించి తండ్రి పలుమార్లు అత్యాచారం చేసేవాడని, ఈ విషయం అమ్మకు చెబితే చంపేస్తానని బెదిరించేవాడు ఆ తండ్రి. కుమార్తె ఇంటర్మీడియట్ నర్సింగ్ రెండో సంవత్సరం పూర్తి చేసుకుని సెలవులకు ఇంటికి వచ్చింది. తన తండ్రి మళ్లీ కుమార్తెపై అఘాయిత్యానికి పాల్పడబోయాడు. మనస్తాపానికి గురైన బాలిక ఆత్మహత్య చేసుకోవడానికి సిద్దపడింది. బాలిక బంధువులు అడ్డుకోని ఆమెను కాపాడారు. బాలిక తల్లి.. ఆత్మహత్యయత్నానికి గల కారణాలు తెలుసుకున్నారు. అనంతరం బాలిక తల్లి తాడికొండ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసిందని పోలీసులు చెప్పారు.

కేసులో ముద్దాయిగా ఉన్న టీడీపీ నేతకు అస్వస్థత : వైయస్సార్ జిల్లా కమలాపురం రిమాండ్ ముద్దాయిగా ఉన్నటువంటి టీడీపీ నేత దాది రామయ్య అస్వస్థతకు గురయ్యారు. ఇటీవల కాలంలో జరిగినటువంటి వైఎస్సార్సీపీ నాయకుడు శంకర్ రెడ్డి హత్య కేసులో అరెస్టు అయ్యారు. ఉన్నట్టుండి దాది రామయ్య జైలులో కుప్పకూలారు. జైలర్ మరియు సిబ్బంది హుటాహుటిన సబ్ జైలు నుంచి కమలాపురం ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువెళ్లారు. అక్కడ పరిశీలించిన వైద్యుడు అక్కడి నుండి కడప రిమ్స్​కు సిఫార్సు చేశారు.

కమలాపురం వైద్యశాలలో ఉన్నటువంటి దాది రామయ్యను టీడీపీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహారెడ్డి పరామర్శించారు. ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఒత్తిడితో సంబంధం లేని కేసులో పోలీసులు అక్రమంగా ఇరికించారని ఆరోపించారు. దాది రామయ్యకు ఏమైనా జరిగితే దాని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, కడప ఎస్పీ, కమలాపురం సీఐ, ఎస్ఐలదే పూర్తి బాధ్యత అని అన్నారు. కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి వైఖరికి నిరసనగా ధర్నా కూడా నిర్వహిస్తామని నరసింహారెడ్డి తెలిపారు.

తమిళ యువతిపై లైంగిక హింస : చిత్తూరు జిల్లా రామకుప్పం మండలానికి చెందిన వైఎస్సార్సీపీ సర్పంచ్ తమిళనాడుకు చెందిన యువతిపై లైంగికంగా హింసకు పాల్పడ్డాడు. తనపై సదరు సర్పంచ్ చేసిన లైంగిక ఆకృత్యాలను యువతి తమిళంలో వెల్లడించిన వీడియో ఆలస్యంగా వెలుగు చూసింది. కుప్పం నియోజకవర్గం సరిహద్దు ప్రాంతం తమిళనాడులోని ఆంబూరు పట్టణానికి చెందిన తనను లైంగికంగా హింసించినట్లు బాధితురాలు ఆరోపిస్తున్నారు. తాను రాజకీయ నాయకుడు అని తనపై ఎవరికి ఫిర్యాదు చేసినా నన్నేమీ చేసుకోలేవు అని బెదిరించాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్​చల్ చేస్తోంది.

మామను హత్య చేసిన అల్లుడు : కుటుంబంలో జరిగే చిన్న చిన్న కలహాలు కారణంగా పిల్లనిచ్చిన మామను అల్లుడు హత్య చేసిన సంఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జరిగింది. అల్లుడు దుస్తులు కత్తిరించే కత్తెర తీసుకొని మామను చాతిపైన పోవడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. బంధువులు మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తీసుకు వెళ్లారు. అతను ఆస్పత్రిలోనే తుది శ్వాస విడిచాడు.

యువకుడిపై కత్తితో దాడి : పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణం విశ్వనాథ సెంటర్​లో శనివారం సాయంత్రం పాత కక్షల నేపథ్యంలో బాబురావుపై జూపల్లి ప్రసాద్ దాడి చేశాడు. కత్తితో దాడి చేయడంతో బాబురావు గాయపడ్డాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే అంబులెన్స్​ని గాయపడిన బాబురావు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తన భర్తపై జూపల్లి ప్రసాద్ అనే వ్యక్తి కత్తితో దాడి చేసి గాయపరచాడని బాబురావు భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అర్బన్ సీఐ రాజేశ్వరరావు తెలిపారు.

హిజ్రా మృతదేహం లభ్యం : కొనసీమ జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ గ్రామంలో జాతీయ రహదారిపై హిజ్రా మృతదేహం లభ్యమైంది. పశ్చిమ గోదావరి జిల్లా మాధవరం మండలం ఉప్పరగూడెం గ్రామానికి చెందిన మరిపట్ల ఆనంద్ (33) అనే వ్యక్తి (హిజ్రా) గా పోలీసులు గుర్తించారు. కొత్తపేట డీఎస్పీ కె. వెంకటరమణ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పూర్తి ఆధారాలు కొరకు వేలిముద్ర నిపుణులను, డాగ్ స్క్వాడ్ బృందాన్ని పిలిపించి ఆధారాలు సేకరించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. దీనిపై స్థానిక ఎస్​ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలియజేశారు.

శుభకార్యంలో విషాదం : అనంతపురం జిల్లా యల్లనూరు మండలం సింగవరం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలు ఈత కోసమని సమీపంలోని కెనాల్‌లో దిగి మృతి చెందారు. ఎనిమిదేళ్ల ఖుషివంత్‌, తొమ్మిదేళ్ల శివచరణ్‌ ప్రమాదవశాత్తూ కాలుజారి కెనాల్‌లో పడి చనిపోయారు. వీరిద్దరి స్వస్థలం పార్ణవల్లి గ్రామం. కాగా సింగవరంలో బంధువుల గృహ ప్రవేశ కార్యక్రమానికి తల్లిదండ్రులతో కలిసి వచ్చారు. గ్రామానికి సమీపంలోనే ఉన్న కెనాల్‌లో సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లి కాలుజారి పడి మృతిచెందారు. శుభకార్యం వేళ బంధుమిత్రుల సందడి, కోలాహలంతో ఆనందంగా ఉండాల్సిన తరుణంలో చిన్నారుల మృతితో విషాదఛాయలు అలుముకున్నాయి.

డీసీఎం లారీ, కోళ్లు వ్యాన్ ఎదురెదురుగా ఢీ : ప్రకాశం జిల్లా కనిగిరి సమీపంలోని కొత్తూరు వద్ద డీసీఎం లారీ, కోళ్లుతో వెళుతున్న వ్యాన్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో రెండు వాహనాల డ్రైవర్లకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఫలితంగా అటుగా వెళ్లే వాహనాలకు కొంత సమయం అంతరాయం ఏర్పడింది. పొదిలి నుండి కనిగిరి మీదుగా పామూరు వెళ్తున్న డీసీఎం లారీ, పామూరు నుండి కలిగిరికి కోళ్ల లోడుతో వస్తున్న వ్యాన్ కొత్తూరు సమీపంలోకి రాగానే రెండు వాహనాలు ఒకదానికి ఒకటి ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయాల పాలైన డ్రైవర్లను వైద్యశాలకు తరలించారు. అనంతరం రోడ్డుకు అడ్డంగా పడిన రెండు వాహనాలను క్రేన్ సహాయంతో పక్కకు తొలగించి అటుగా వెళ్లే వాహనదారులకు ఎటువంటి అంతరాయం కలగకుండా ట్రాఫిక్​ను క్లియర్ చేశారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.