ETV Bharat / state

UNEMPLOYEES JAC: జాబ్ క్యాలెండర్​పై పోరాటానికి ఉద్యోగ సాధన సమితి

author img

By

Published : Jun 26, 2021, 5:36 PM IST

జాబ్ క్యాలెండర్​పై తమ నిరసనను ప్రభుత్వానికి బలంగా తెలియజేయాలని గుంటూరులో యువజన విద్యార్థి సంఘాలు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సాధన సమితిగా ఏర్పడ్డాయి. ప్రభుత్వం వేల సంఖ్యలో ఉద్యోగ ఖాళీలను చూపించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 28న రాష్ట్రవ్యాప్తంగా ఛలో కలెక్టరేట్​కు పిలుపునిచ్చాయి.

fight over job calendar in the state
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సాధన సమితి

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్​పై నిరాశకు గురైన నిరుద్యోగులు తమ నిరసనను ప్రభుత్వానికి బలంగా తెలియజేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా గుంటూరులో యువజన, విద్యార్థి సంఘాలు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సాధన సమితిగా ఏర్పడ్డాయి. ప్రభుత్వం వేల సంఖ్యలో ఉద్యోగ ఖాళీలను చూపించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 28న రాష్ట్రవ్యాప్తంగా ఛలో కలెక్టరేట్​కు పిలుపునిచ్చాయి.

ఉద్యోగ సాధన సమితి ఉద్యమ కార్యాచరణకు ఎమ్మెల్సీ కె.యస్. లక్ష్మణరావు మద్ధతు ప్రకటించారు. అన్ని శాఖల్లో వేల సంఖ్యలో ఖాళీలు ఉండగా.. ప్రభుత్వం జాబ్ క్యాలెండర్​లో చూపించిన ఖాళీలను చూసి నిరుద్యోగులు నిరాశకు గురయ్యారని.. ఎమ్మెల్సీ లక్ష్మణరావు వ్యాఖ్యానించారు. వేల సంఖ్యలో ఖాళీలను చూపుతూ మళ్లీ ప్రభుత్వం అనుబంధ జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని.. ఈ నెల 30న మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించాలని ఎమ్మెల్సీ లక్ష్మణరావు డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

APPSC: ఏపీపీఎస్సీ పోటీపరీక్షల్లో ఇంటర్వ్యూలు ఎత్తివేత

ఆ రెండు నగరాలకు 'స్మార్ట్​ సిటీస్​' అవార్డు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.