ETV Bharat / state

పోలీస్​ స్టేషన్​ ఆవరణలో ఖాళీ మద్యం సీసాలు.. సామాజిక మాధ్యమాల్లో వైరల్​

author img

By

Published : Jan 28, 2021, 6:01 AM IST

గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్​ స్టేషన్​ ఆవరణలో పేరుకుపోయిన ఖాళీ మద్యం సీసాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. స్టేషన్​కు ప్రహారీ గోడ లేకపోవడం వల్లే మందుబాబులు ఇలా రెచ్చిపోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అప్రమత్తమైన పోలీసులు.. వాటిని తొలగించారు.

empty wine bottles dump goes viral
సామాజిక మాధ్యమాల్లో వైరల్​

గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో పేరుకుపోయిన ఖాళీ మద్యం సీసాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. స్టేషన్​ ఆవరణలో పేరుకుపోయిన ఖాళీ మద్యం సీసాలను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు.

నిత్యం మందుబాబులు అక్కడే ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని స్థానికులు చెప్పారు. వెంటనే పోలీసు శాఖ అధికారులు వాటిని తొలగించారు. పోలీస్ స్టేషన్​కు ప్రహరీ లేని కారణంగానే అక్కడే ఇలాంటి పరిస్థితి ఉందని ప్రజలు ఆరోపించారు.

ఇదీ చదవండి:

విధుల నుంచి మాచర్ల సీఐ రాజేశ్వరరావును రిలీవ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.