ETV Bharat / state

సైలెన్సర్లు మార్చిన వాహనాలను పట్టుకున్న పోలీసులు

author img

By

Published : Sep 16, 2020, 12:52 PM IST

గుంటూరులో అనధికార సైలెన్సర్లు పెట్టుకున్న ద్విచక్రవాహనదారులకు జరిమానా విధిస్తున్నట్లు ఉపరవాణా కమిషనర్ మీరా ప్రసాద్​ అన్నారు.

సైలెన్సర్లు మార్చిన వాహనాలను పట్టుకున్న పోలీసులు
సైలెన్సర్లు మార్చిన వాహనాలను పట్టుకున్న పోలీసులు

అనధికార సైలెన్సర్లతో శబ్ద కాలుష్యం చేస్తున్న బుల్లెట్​ వాహనాల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు గుంటూరు ఉప రవాణా కమిషనర్​ మీరా ప్రసాద్​ తెలిపారు. ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదుల మేరకు తనిఖీలు చేస్తున్నామని పేర్కొన్నారు. మోటార్​ వాహనాల చట్టం 1988 సెక్షన్​ 190(2) ప్రకారం అధిక శబ్దం వచ్చే సైలెన్సర్​ వాడటం నేరమన్నారు. పోలీసుల తనిఖీల్లో ఇప్పటివరకు 15 వాహనాలు పట్టుబడ్డాయి.

ఇదీ చూడండి:

బకింగ్ హామ్ కెనాల్ లో ఇద్దరు యువకులు గల్లంతు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.