సీఎం జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ లేఖ

సీఎం జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ లేఖ
CPI Ramakrishna Letter to CM Jagan: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ లేఖరాశారు. గత మూడున్నర ఏళ్లలో రాయలసీమ ప్రాంతానికి జగన్‌రెడ్డి ఏం చేశారని ప్రశ్నించారు. వెనుకబడిన రాయలసీమ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. రాష్ట్ర విభజన చట్ట హామీ ప్రకారం రాయలసీమకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ నిధులను కేంద్రం నుండి రాబట్టాలన్నారు. సీమలోని నాలుగు జిల్లాలకు సాగునీరు, త్రాగునీరు అందించే హంద్రీ-నీవా ప్రాజెక్టును రెండింతలు చేస్తానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు.
CPI Ramakrishna Letter to CM Jagan: మూడున్నరేళ్ల పాలనలో రాయలసీమ ప్రాంతానికి ఏం చేశారంటూ.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు. రాయలసీమ జిల్లాలకు సాగునీరు, తాగునీరు అందించే హంద్రీ - నీవా ప్రాజెక్టును రెండింతలు చేస్తానన్న హామీ ఏమైందని నిలదీశారు. ప్రాజెక్టుల కింద కనీసం కాలువలు కూడా తవ్వకుండా సాగునీరు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం గురించి అతీగతీ లేదని విమర్శించారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుచేస్తామని ఒవైపు చెబుతూనే, మరోవైపు.. అమరావతిలోనే హైకోర్టు ఉంటుందని సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయటం ద్వంద వైఖరి కాదా అని ప్రశ్నించారు.
ఇవీ చదవండి:
