ETV Bharat / state

ఇంటికే  సరకులు... గుంటూరులో లాక్​డౌన్ కట్టుదిట్టం​

author img

By

Published : May 3, 2020, 10:55 AM IST

control room start at gunturu
గుంటూరులో మరింత కట్టుదిట్టంగా లాక్​డౌన్: ఆర్డీఓ వెంకటేశ్వర్లు

ఎవరికైనా నిత్యావసరాలు ఆర్డర్ ఇచ్చిన తరువాత దుకాణదారులు స్పందించక పోతే ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి సమాచారమిస్తే చర్యలు తీసుకుంటామంటున్నారు ఆర్డీఓ. పట్టణ ప్రజలు ఫోన్ చేయవలసిన కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లు 08647 - 295551, 295552, 29553 గా ఆర్డీఓ మొగిలి వెంకటేశ్వర్లు తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నేటి నుంచి ఇంటింటికి నిత్యావసరాలు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.

నరసరావుపేట పట్టణంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా అధికారులు పూర్తి లాక్ డౌన్ విధించారు. ఈ క్రమంలో ప్రజలకు నిత్యావసర సరుకులు, పాలు, కూరగాయలను ఏ వార్డుకు ఆ వార్డు అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఆర్డీఓ మొగిలి వెంకటేశ్వర్లు తెలిపారు. అయితే వాటి నిర్వహణలో ఏమైనా లోపాలు ఉంటే తెలియజేసేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్​ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

ఏ వార్డుకు ఆ వార్డు ప్రజలకు కావలసిన నిత్యావసరాలు అందించేందుకు ఆయా వార్డులకు కేటాయించిన దుకాణదారులకు పాస్​లు ఇచ్చామన్నారు. నేటి నుంచి కావలసిన నిత్యావసరాలు తప్పక అందిస్తామని తెలిపారు. అర్డర్​ ఇచ్చిన తర్వాత దుకాణదారులు స్పందించకపోతే కంట్రోల్​ రూమ్​కు ఫోన్​ చేసి సమాచారం ఇస్తే అధికారులు వారిని అప్రమత్తం చేస్తారని ఆర్డీఓ వెల్లడించారు.

ఇవీ చూడండి...

కంటైన్మెంట్ జోన్లపై ఆర్డీఓ ప్రత్యేక దృష్టి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.