ETV Bharat / state

కాంట్రాక్టు ఉద్యోగులకు సకాలంలో జీతాలు: సీఎం జగన్

author img

By

Published : Jul 13, 2020, 3:17 PM IST

కాంట్రాక్టు ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రెగ్యులర్‌ ఉద్యోగుల్లానే.. సకాలంలో కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు అందించాలని సీఎం‌ ఆదేశాలు జారీ చేశారు. అలాగే వారికి సామాజిక, ఆరోగ్య భద్రత కల్పించే దిశగా అధ్యయనం చేయాలని చెప్పారు.

cm jagan
cm jagan

వివిధ ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ విభాగాలతో పాటు, వివిధ సొసైటీలు, విశ్వవిద్యాలయాల్లోని కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాల విడుదలలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా.. సకాలానికే అందించాలని సీఎం స్పష్టం చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల స్థితిగతులపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్షించారు.

వివిధ ప్రభుత్వ విభాగాల్లోని కాంట్రాక్టు ఉద్యోగులు, వారి జీతాలు, స్థితిగతులను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాలు, సొసైటీలు, యూనివర్సిటీల్లో పని చేస్తున్న సుమారు 54 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు గత ప్రభుత్వం చేసింది సున్నా అని సమావేశంలో పలువురు ప్రస్తావించారు. ఎన్నికలకు ముందు మినిమం టైం స్కేల్‌పై హడావిడిగా జీవో జారీ చేసిందని.. అయినా అమలు చేసే బాధ్యతను ఈ ప్రభుత్వమే తీసుకుందన్నారు. 2019 జులై నుంచి మినిమం టైం స్కేల్‌ అమలు చేస్తున్నట్లు తెలిపారు.

దీని వల్ల రాష్ట్ర ఖజానాపై రూ.1000 కోట్ల భారాన్ని ఈ ప్రభుత్వం తీసుకుంటోందని అధికారులు వెల్లడించారు. రెగ్యులర్‌ ఉద్యోగుల్లానే.. సకాలంలో కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు అందించాలని సీఎం‌ ఆదేశాలు జారీ చేశారు. గ్రీన్‌ ఛానల్లో పెట్టి వారికి నిర్ణీత సమయానికి జీతాలు అందించాలన్నారు. పర్మినెంట్‌ ఉద్యోగుల్లానే సామాజిక, ఆరోగ్య భద్రత కల్పించే దిశగా అధ్యయనం చేయాలని, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తనకు అందించాలని సీఎం ఆదేశాలిచ్చారు.

ఇదీ చదవండి

ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషాకు కరోనా పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.