ETV Bharat / state

కౌలు రైతుకు బయోమెట్రిక్‌ పాట్లు - ధాన్యం అమ్మాలంటే యజమాని ఉండాల్సిందే

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 5, 2024, 7:40 AM IST

Updated : Jan 5, 2024, 2:17 PM IST

conditions_of_tenant_farmers
conditions_of_tenant_farmers

Conditions of Tenant Farmers to Sell Grain: ధాన్యం కొనుగోలుకు భూ యజమాని తప్పనిసరిగా బయో మెట్రిక్‌ వేయాలన్న ప్రతిపాదనపై కౌలు రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం విక్రయించాలంటే ఇప్పటికే అనేక ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు.

కౌలు రైతుకు బయోమెట్రిక్‌ పాట్లు - ధాన్యం అమ్మాలంటే భూ యజమాని ఉండాల్సిందే

Conditions of Tenant Farmers to Sell Grain: రైతుల వద్ద నుంచి ధాన్యం కోనుగులు పారదర్శకంగా నిర్వహిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ధాన్యం కోనుగోలకు సంబంధించిన అధికారులు వివిధ నిబంధనలు విధించడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం అమ్మకునేందుకు రైతు భరోసా కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోందని అన్నదాతలు వాపోతున్నారు. అధికారులు విధించే నిబంధనలకు అందుకోలేక చాలా మంది రైతులు దళారులను ఆశ్రయిస్తున్నాయి. దీంతో దళారులు, మిల్లర్లు కుమ్మకైయి అన్నదాతలను మోసం చేస్తున్నారు. రైతులు సొంతంగా రైతు భరోసా కేంద్రంలో ధాన్యం అమ్మాలంటే అధికారులు ధాన్యానికి కొర్రీలు వేస్తున్నారు. వీటిని అధిగమించేందుకు రైతులు దళారులను ఆశ్రయిస్తారు. నేటి నుంచి ఈ తరహా దందాకు చెక్ పడనుంది. రైతు వస్తేనే ఆర్బీకేలో ధాన్యం కొనాలనే నిబంధనను అధికారులు అమలు చేస్తున్నారు.

కౌలు రైతును నిండా ముంచిన మిగ్‌జాం తుపాను-ఉదారమంటూ ఉత్తమాటలు వల్లెవేస్తున్న సీఎం జగన్‌

రైతు వస్తేనే రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొనాలనే నిబంధనను అమలు చేస్తున్నారు. బయోమెట్రిక్ వేస్తేనే ఫండ్ ట్రాన్స్‌ఫర్ ఆర్డర్ జనరేట్ అవుతుందని చెబుతున్నారు. సీజన్ ఆరంభంలోనే పంటలకు ఈ-క్రాప్‌ నమోదు చేస్తారు. పంట పేరు, రైతు, సర్వేనెంబరు, విస్తీర్ణం వివరాలు నమోదు చేస్తారు. కౌలు రైతు అయితే కౌలు రైతు పేరును యజమాని అంగీకార పత్రంతో నమోదు చేసేవారు. దీని ప్రకారమే దిగుబడి వచ్చాక పంట ఉత్పత్తులను కొంటారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో వరి రైతుల్లో 50 శాతంపైగా కౌలుకు చేసేవారే. బయో మెట్రిక్ వేయాలంటే భూ యజమానులు అందుబాటులో ఉండాలి. ఇటువంటి పరిస్థితుల్లో తమ వేలి ముద్రలే తీసుకోవాలని రైతులు, రైతు సంఘాల నేతలు కోరుతున్నారు. అధికారులు విధిస్తున్న నిబంధనలు పాటించలేక చాలామంది కౌలుదారులు ప్రైవేట్‌ వ్యాపారులకు ధాన్యాన్ని విక్రయిస్తున్నారు.

పంటల బీమాపై రైతన్నల ఆశలు - పరిహారాలతో పరిహాసమాడుతున్న ప్రభుత్వం

ఇప్పటికీ కౌలు రైతులు పంటను దళారులకు విక్రయిస్తున్నారు. ఇక ముందు కూడా ప్రభుత్వానికి విక్రయించే అవకాశం ఉండకపోవచ్చు. ఎకరానికి దాన్యం 25 క్వింటాళ్లు కొంటారు. అంతకు మించి ఉత్పత్తి వచ్చినా తీసుకోవడం లేదు. తాము సాగు చేస్తున్నాం కాబట్టి ఈ-క్రాప్​లో తమ పేరు నమోదు చేయాలని రైతు భరోసా కేంద్రం అధికారులని అడిగినా వారు పట్టించుకోలేదని కౌలు రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు బయోమెట్రిక్ వేయాలంటే భూ యజమానులు అందుబాటులో వుండకపోతే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ధాన్యం కొనుగోలకు తమ వేలి ముద్రలు తీసుకోవాలని కోరుతున్నారు. అధికారుల విధిస్తున్న నిబంధనలు పాటించలేక చాలామంది తమ తోటి కౌలుదారులు వ్యాపారులకు ధాన్యాన్ని విక్రయిస్తున్నారని చెబుతున్నారు.

కౌలు రైతులకు భరోసా హామీని విస్మరించిన జగన్‌ - హామీల్లో 99% అమలు చేయడమంటే ఇదేనా?

ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ నిబంధన కౌలు రైతులకు ఇబ్బందిగా మారుతుందని రైతు సంఘ నాయకులు ఆగ్రహాం వ్యక్తం చేశారు. కౌలు రైతులకు గుర్తింపు ఇచ్చి ప్రయోజనం ఏముందని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం విధించిన నిబంధనలతో రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ప్రభుత్వం కౌలు రైతుల బయోమెట్రిక్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. బయో మెట్రిక్ విధానంపై రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రైతులు, రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Last Updated :Jan 5, 2024, 2:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.