ETV Bharat / state

టిడ్కో ఇళ్లపై జగన్ నిర్లక్ష్యం - లబ్దిదారులకు శాపంగా మారిన ప్రభుత్వ అలసత్వం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 10, 2023, 7:28 AM IST

Updated : Nov 10, 2023, 12:11 PM IST

CM Jagan Negligence in Completing Tidco Houses: టిడ్కో ఇళ్లు పూర్తిచేయడంలో సీఎం జగన్ అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి లబ్దిదారులకు శాపంలా మారుతోంది. టిడ్కో ఇళ్లపై రుణం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం గడువులోగా వాటిని అప్పగించకపోవడం వల్ల లబ్ధిదారుల ఖాతాలు నిరర్థక ఆస్తులుగా మారిపోతున్నాయి. దీనివల్ల భవిష్యత్తులో ఏవైనా లోన్లు తీసుకోవాలంటే దొరికే అవకాశం ఉండదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

tidco_houses
tidco_houses

టిడ్కో ఇళ్లపై జగన్ నిర్లక్ష్యం - లబ్దిదారులకు శాపంగా మారిన ప్రభుత్వ అలసత్వం

CM Jagan Negligence in Completing Tidco Houses: తెలుగుదేశం ప్రభుత్వం గతంలో రాష్ట్రంలో 3 లక్షల 313 వేల టిడ్కో గృహాల నిర్మాణం చేపట్టింది. 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే తెలుగుదేశం హయాంలో మంజూరైన టిడ్కో గృహాల్లో 52 వేల ఇళ్లను రద్దు చేసి మిగతా 2 లక్షల 62 వేల ఇళ్ల నిర్మాణాన్నే చేపట్టింది. 365 చదరపు అడుగుల విస్తీర్ణం గల గృహాలపై 3 లక్షల 15 వేల రూపాయలు, 430 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఇళ్లపై 3 లక్షల 65 వేల రూపాయలు చొప్పున లబ్ధిదారుల పేరిట రెండేళ్ల మారటోరియంతో బ్యాంకుల నుంచి టిడ్కో రుణాన్ని తీసుకుంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇలా 65 వేల మందికి బ్యాంకులు రుణాలు మంజూరు చేసినట్లు సమాచారం.

టిడ్కో ఇళ్లు బ్యాంకులకు తనఖా పెట్టొద్దు - లబ్ధిదారులతో కలిసి టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ధర్నా

మారటోరియం గడువులోగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగిస్తే వారు 3 వేల రూపాయల చొప్పున నెల వారీ వాయిదాలు బ్యాంకులకు కట్టాలి. కానీ ఇళ్లు అప్పగించకముందే టిడ్కో తీసుకున్న రుణాలపై మారటోరియం గడువు ముగిసిపోతోంది. ప్రతి నెలా పలువురు లబ్దిదారుల ఖాతాలు ఎన్​పీఏలుగా మారుతున్నాయి. గత నెల 300 మంది ఖాతాలు ఎన్​పీఏలుగా మారినట్టు ఓ బ్యాంకు టిడ్కోకు నివేదించింది. వారి రుణాలకు సంబంధించి వాయిదాల మొత్తం కోటి 50 లక్షల రూపాయలు టిడ్కోనే చెల్లించాలని కోరింది.

Problems at Tidco Housing Complex : 'హడావుడిగా పంపిణీ చేశారు.. ఆపై వదిలేశారు..!' సమస్యలకు నిలయాలుగా టిడ్కో సముదాయాలు

వీరిలో దాదాపు 100 మంది లబ్ధిదారులకు ఇళ్లు అప్పగించకుండానే ఎన్​పీఏలుగా మారినట్టు తెలిసింది. వారికి సంబంధించిన నెల వాయిదాల మొత్తం వడ్డీతో కలిపి 30 లక్షల రూపాయల మేర టిడ్కోనే చెల్లించింది. ఈ నెలాఖరు నాటికి మారటోరియం గడువు పూర్తయి మరో 500 మంది ఖాతాలు ఎన్​పీఏలుగా మారే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. డిసెంబరులో మరో 3 వేల మంది ఖాతాలు ఈ జాబితాలో చేరే అవకాశం ఉండగా వారికి ఇప్పట్లో ఇళ్లు అందేలా కనిపించడం లేదు. రాబోయే 3నెలల్లో ఎన్​పీఏలుగా మారే ఖాతాల సంఖ్య భారీగానే ఉంటుందని తెలిసింది.

Tidco Houses Lacked Security: టిడ్కో ఇళ్లలో భద్రత కరవు.. మూడేళ్ల చిన్నారిని చిదిమేసిన విద్యుత్ తీగలు

రాష్ట్రవ్యాప్తంగా టిడ్కో ఇళ్లపై మారటోరియం గడువు రెండేళ్లుగా ఉండగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో బ్యాంకు ఏడాదే గడువు నిర్దేశించింది. నెల వాయిదాల చెల్లింపు గడువు 20 ఏళ్లకు బదులు 7 ఏళ్లకే కుదించింది. సదరు బ్యాంకు మారటోరియం గడువు ముగిసినందున రుణ వాయిదాలు చెల్లించాలని ఇటీవల లబ్దిదారులకు బ్యాంకు తాఖీదులు జారీ చేసింది. ఒక్కొక్కరూ 30 వేల నుంచి 40 వేల రూపాయలు చెల్లించాలని లేకపోతే వేలం వేస్తామని బ్యాంకు అధికారులు చెబుతున్నట్లు లబ్ధిదారులు వాపోతున్నారు.

Last Updated : Nov 10, 2023, 12:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.