ETV Bharat / state

Chandrababu Supporters Protest Outside India: 'వియ్ ఆర్ విత్‌ సీబీఎన్' అంటూ.. కదం తొక్కిన ప్రవాసాంధ్రులు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 18, 2023, 9:08 PM IST

Updated : Sep 18, 2023, 9:56 PM IST

Chandrababu Supporters Protest Outside India: చంద్రబాబు అరెస్ట్​కు వ్యతిరేకంగా ప్రవాసాంధ్రులు వివిధ దేశాల్లో నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. కేవలం వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి చంద్రబాబును అరెస్ట్ చేసిందంటూ నినాధాలు చేస్తూ... రోడ్లపైకి వచ్చి చంద్రబాబుకు మద్ధతుగా తమ సంఘీభావం తెలుపుతున్నారు. 'వియ్ ఆర్ విత్‌ సీబీఎన్' అంటూ భారీ ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.

chandrababu Supporters Protest Outside Indian Consulate In Canada
chandrababu Supporters Protest Outside Indian Consulate In Canada

Chandrababu Supporters Protest Outside Indian Consulate In Canada: తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టుపై నిరసన జ్వాలలు విదేశాల్లోనూ వెల్లువెత్తుతున్నాయి. అమెరికా నుంచి ఆస్ట్రేలియా దాకా... తెలుగు ప్రజలు ఉన్న ప్రతి చోటా.. ఆందోళనలు ఎగిసిపడుతున్నాయి. ప్రవాసాంధ్రులు ఎక్కడికక్కడ రోడ్లపైకి వచ్చి... చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నారు. 'వియ్ ఆర్ విత్‌ సీబీఎన్' (CBN) అంటూ చంద్రబాబుకు మద్దతుగా కదం'తొక్కుతున్నారు.

అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీ ఆందోళనలు: అవినీతి ఆరోపణలతో తెలుగుదేశం అధినేత చంద్రబాబును సీఐడీ అరెస్టును తీవ్రంగా తప్పుపడుతూ ప్రవాసాంధ్రులు... విదేశాల్లో నిరసనలు తీవ్రతరం చేస్తున్నారు. భారీ ప్రదర్శనలతో... చంద్రబాబుకు మద్దతును, వైసీపీ(YCP) ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ ప్రభుత్వం కావాలనే కక్షపూరితంగా వ్యవహరిస్తోందంటూ... అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీ (Washington DC) లో మహిళలు నిరసన తెలిపారు. ఈ విపత్కర పరిస్థితుల్లో తామంతా చంద్రబాబు వెంటే ఉన్నామని తేల్చిచెప్పారు. త్వరలోనే చంద్రబాబుపై పడ్డ ఆరోపణలన్నీ కొట్టుకుపోతాయని ఆకాంక్షించారు.

NRI Protests in America Over Chandrababu Arrest: అమెరికాలో గళమెత్తిన తెలుగు ప్రజలు.. టీడీపీ-జనసేన జెండాలతో భారీ ర్యాలీ

కెనడాలోని టొరంటోలో తెలుగు ప్రజల ర్యాలీ ప్రదర్శన చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ.. కెనడాలోని టొరంటోలో ప్రవాసాంధ్రులు భారీ ప్రదర్శన చేపట్టారు. ప్రవాసాంధ్రులకు సంఘీభావంగా కెనడాలోని స్థానికులూ పెద్ద సంఖ్యలో ర్యాలీలు, ప్రదర్శనల్లో పాల్గొన్నారు. జాతి, ప్రాంతం తేడాల్లేకుండా... నిజాయతీపరులకు న్యాయం జరిగేందుకు అందరూ కలిసి పోరాడాలని కెనడా (Canada) లోని స్థానికులు పిలుపునిచ్చారు. టొరంటోలోని భారత రాయబారి కార్యాలయం (India Embassy) వరకు 3 కిలోమీటర్ల మేర ర్యాలీ ప్రదర్శన సాగింది. ఆధారాల్లేకుండా అరెస్టు చేసి చంద్రబాబును అక్రమంగా నిర్బంధించారని ఆందోళనకారులు మండిపడ్డారు. చంద్రబాబు విడుదల అయ్యేలా చర్యలు చేపట్టాలని కోరుతూ... కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియాకు(Consulate General of India) వినతిపత్రం అందించారు.

Chandrababu Supporters Protest Outside India: 'వియ్ ఆర్ విత్‌ సీబీఎన్' అంటూ.. కదం తొక్కిన ప్రవాసాంధ్రులు

Telugu People Protest Against CBN Arrest in America చంద్రబాబు ఆరెస్టుపై అగ్రరాజ్యంలో ఆందోళనలు.. డల్లాస్, వాషింగ్టన్ పురవీధుల్లో తెలుగు ప్రజల ర్యాలీలు

ఆస్టిన్‌ నగరంలో ప్రవాసాంధ్రులు ధర్నా తెలుగుదేశం అధినేత అరెస్టు అక్రమమంటూ.. అమెరికాలోని ఆస్టిన్‌ నగరం (Austin city)లో ప్రవాసాంధ్రులు ధర్నాకు దిగారు. జగన్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ 400 మందికి పైగా ప్రవాసాంధ్రులు... తెలుగుదేశం సానుభూతిపరులు... కుటుంబాలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. కక్షపూరితంగా నిర్బంధించడం నిరంకుశ పాలనకు నిదర్శనమని మండిపడ్డారు.

కరోలినా రాష్ట్రంలో ఆందోళనలు అమెరికాలోని నార్త్ కరోలినా (North Carolina) రాష్ట్రంలోని రెలై ప్రాంతంలోనూ పెద్ద సంఖ్యలో తెలుగువారు బయటకు వచ్చి నిరసనలు తెలిపారు. ఐటీ విప్లవానికి తొలినాళ్లలోనే ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాంది పలకడం వల్లే... తామంతా ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డామని గుర్తు చేశారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానాన్ని ప్రవాసాంధ్రులు తీవ్రంగా తప్పుపట్టారు. త్వరలోనే ఆయన బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

జర్మనీలో భారీ ర్యాలీ..: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మరియు ప్రస్తుత ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ నగరంలో తెలుగు ప్రవాస భారతీయులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. "I am with CBN", "We Stand with CBN", "Save Democracy - Save AP" అనే నినాదాలతో నగరంలోని నిత్యం రద్దీగా ఉండే ప్రధాన వీధులలో దాదాపు మూడు గంటల పాటు ప్రదర్శన చేశారు. భారతదేశానికి సంబంధించిన ఒక రాజకీయ నాయకుడికి మద్దతుగా జర్మనీ దేశంలో ఇలా నిరసన ర్యాలీ చేయడం ఇదే ప్రప్రథమని నిర్వాహకులు తెలిపారు. పేద యువతకు ప్రపంచ స్థాయి నైపుణ్య శిక్షణ ఇప్పించడమే చంద్రబాబు చేసిన నేరమా అంటూ పలువురు ప్రశ్నించారు. ప్రజలలో ప్రతిపక్షాలకు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు మీద అక్రమంగా కేసులు పెట్టినట్లుగా ర్యాలీలో పాల్గొన్న కొందరు అభిప్రాయం వెలిబుచ్చారు.

Statewide Protests Against Chandrababu Arrest బాబు అరెస్టుపై కొనసాగుతున్న నిరసనల వెల్లువ.. ఆలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు..

Last Updated : Sep 18, 2023, 9:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.