ETV Bharat / state

Chandrababu Promise as 4 Gas Cylinders: మహిళలకు 4 వంట గ్యాస్ సిలిండర్లు.. రాఖీ పౌర్ణమి వేడుకల్లో చంద్రబాబు ప్రకటన

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 30, 2023, 6:11 PM IST

Etv Bharat
Chandrababu_said_4_cooking_gas_cylinders_under_Deepam_scheme

Chandrababu Promise as 4 Gas Cylinders : మహిళల అభ్యున్నతికి టీడీపీ ఎంతో కృషి చేసిందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్టీఆర్ భవన్​లో రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మళ్లీ అధికారంలోకి వస్తే 4 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని తెలిపారు.

Chandrababu said 4 cooking gas cylinders : మహిళలకు 4 వంట గ్యాస్ సిలిండర్లు.. రాఖీపౌర్ణమి వేడుకల్లో చంద్రబాబు ప్రకటన

Chandrababu Promise as 4 Gas Cylinders under Deepam Scheme: దీపం పథకం కింద 4 వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చే ప్రతిపాదన పరిశీలిస్తున్నామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. మినీ మేనిఫెస్టోలో ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చామని గుర్తు చేసిన ఆయన.. అవసరమైతే మరో సిలిండర్ కూడా ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ (NTR Bhavan)లో రాఖీ పౌర్ణిమ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చంద్రబాబుకు వంగలపూడి అనిత, పీతల సుజాత, ఆచంట సునీత, తెలుగు మహిళలు, బ్రహ్మ కుమారీలు రాఖీలు కట్టారు. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం కృషి చేస్తామన్నారు. ఆడబిడ్డ నిధితో మహిళలను ఆదుకుంటామని చంద్రబాబు తెలిపారు. అక్కలకు, చెల్లెళ్లకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.

Chandrababu New Vision 2047: ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మన దేశం ఎదగాలి : చంద్రబాబు

Chandrababu on Telugu Women: తెలుగు మహిళను ప్రపంచంలోనే శక్తివంతమైన మహిళగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు ఉద్ఘాటించారు. బంధాలు భారతీయ సంస్కృతికున్న ప్రత్యేకతని గుర్తుచేశారు. విదేశాల్లో కూడా భారతీయ సంస్కృతి (Indian culture) ని మెచ్చుకుంటున్నారని వివరించారు. మహిళల అభివృద్ధి కోసం దూరదృష్టితో ఆలోచన చేసి టీడీపీ ఎన్నో కార్యక్రమాలు... సంస్థలు స్థాపించిందన్నారు. మహిళలకు ఎన్టీఆర్ ఆస్తి హక్కు ( Right to property ) కల్పించారని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు. పద్మావతి మహిళా కళాశాలను నెలకొల్పింది తెలుగుదేశం పార్టీనే అని తెలిపారు. బాలికా సంవృద్ధి సంరక్షణా పథకం ప్రారంభించానన్న చంద్రబాబు... ఒక విధానంతో ఆడబిడ్డల జీవితాలు మారే విధంగా విధాన నిర్ణయాలు చేశామన్నారు. మహిళలతో పొదుపు ఉద్యమం చేయించి, ఆత్మగౌరవాన్ని కాపాడామని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

Chandrababu Fires on CM Jagan: వైసీపీ అక్రమాలపై చంద్రబాబు ఆగ్రహం.. ఇసుక దోపిడీపై సమాధానం చెప్పాలని డిమాండ్​

Rakhi Celebrations 2023: 'తెలుగు మహిళలను ప్రపంచంలోనే శక్తివంతమైన మహిళలుగా మార్చేందుకు టీడీపీ కృషి చేస్తుందని ఈ రాఖీ పండుగ సందర్భంగా తెలియజేస్తున్నా. మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ కోసం తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో పోరాడుతాం. డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేయడంతో పాటు ఆ సంఘాలకు గౌరవం ఇచ్చింది టీడీపీనే. ఈ రోజు డ్వాక్రా సంఘాలు ( Dwakra communities ) ఒక వ్యవస్థగా మారాయి. ఆ వ్యవస్థ సమర్ధవంతంగా పని చేస్తున్నాయి. మరుగుదొడ్ల నిర్మాణం పేరుతో ప్రతి ఆడబిడ్డ గౌరవాన్ని కాపాడాం.. గ్యాస్ సిలిండర్లు ఇచ్చి.. ప్రతి ఇంటికి దీపం( Deepam) పెట్టించాం. ఆడబిడ్డలకు ప్రత్యేక ఆరోగ్య సమస్యల నేపథ్యంలో ప్రత్యేకంగా వైద్య పరీక్షలు చేయించాం. బాలింతలకు పౌష్టికాహారం, పిల్లల కోసం బేబీ కిట్లు ఇచ్చాం. సామూహిక సీమంతాలు ప్రారంభించింది కూడా టీడీపీ మాత్రమే. పెళ్లి కానుక, తల్లికి వందనం పేరుతో కాళ్లు కడిగి ఆశీర్వాదం చేయించి సంస్కృతి, సంప్రదాయాలు నేర్పించాం. ప్రపంచ దేశాలన్నీ మన వైపు చూసే పరిస్థితి వస్తుందనేది వాస్తవం. పిల్లల భవిష్యత్ బంగారమయం కావాలి' అని చంద్రబాబు నాయుడు అన్నారు.

Chandrababu met CEC in Delhi about Irregularities of Votes: ఒక పార్టీ ఓట్లు తొలగించాలనే ఆలోచన ఎవరికీ రాలేదు: ఏపీలో అక్రమాలపై సీఈసీకి చంద్రబాబు ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.