దివికేగిన నటశేఖరుడు.. పుష్పాంజలి ఘటించిన పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు

author img

By

Published : Nov 16, 2022, 12:38 PM IST

TRIBUTES TO SUPERSTAR

TRIBUTES TO SUPERSTAR : సూపర్‌స్టార్‌ కృష్ణకు నివాళి అర్పించేందుకు పద్మాలయ స్టూడియోకు తెలుగు సినీ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నాయకులు తరలివచ్చారు. తన నటనాకౌశలంతో అలరించిన దిగ్గజం తమను వదిలి వెళ్లారని తలచుకుని కన్నీటి పర్యంతమయ్యారు. భౌతిక కాయానికి పుష్పంజలి ఘటించిన ప్రముఖులు.. మహేశ్‌బాబు కుటుంబ సభ్యులను ఓదార్చారు

పుష్పాంజలి ఘటించిన పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు

TRIBUTES TO SUPERSTAR KRISHNA : చిరునవ్వుతో పలకరించే సూపర్‌స్టార్‌ ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని సినీ, రాజకీయ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. పద్మాలయ స్టూడియోలో కృష్ణ భౌతిక కాయాన్ని సందర్శించి ఘన నివాళులర్పించారు.

CM JAGAN TRIBUTES TO KRISHNA : ముఖ్యమంత్రి జగన్‌ బుర్రిపాలెం బుల్లోడు కృష్ణ పార్థివదేహాన్ని సందర్శించారు. పూలమాలలతో భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆయనతో పాటు మంత్రి గోపాలకృష్ణ, ఎంపీ భరత్‌.. నటశేఖరుడికి అంజలి ఘటించారు. అనంతరం కృష్ణ కుటుంబసభ్యులను పరామర్శించిన జగన్‌.. ధైర్యంగా ఉండాలంటూ వారిని వెన్నుతట్టి ఓదార్చారు. కృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

BALAKRISHNA FAMILY TRIBUTES TO SUPERSTAR : నటుడు నందమూరి బాలకృష్ణతో పాటు ఆయన సతీమణి వసుంధర, కుమార్తె బ్రహ్మిణి …సూపర్​స్టార్​ కృష్ణకు పుష్పాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి.. మహేశ్ బాబుకు ధైర్యం చెప్పారు. చలనచిత్ర రంగానికి ఎనలేని సేవలందించిన నటశేఖరుడు ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని బాలయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

"కృష్ణ మన మధ్య లేరన్న వార్త బాధాకరం. ప్రయోగాలకు మారుపేరు సూపర్‌స్టార్‌ కృష్ణ. చలనచిత్ర రంగానికి ఎనలేని సేవలందించారు. నటుడు, దర్శకుడు, నిర్మాతగా మంచి సినిమాలు చేశారు. సాంఘిక, జానపద, చారిత్రక చిత్రాల్లో నటించి మెప్పించారు. కొత్త నిర్మాతలు, దర్శకులను ప్రోత్సహించేవారు. ఎన్టీఆర్‌ మాదిరిగానే కృష్ణ కూడా నిర్మాతల పాలిట కల్పవృక్షం. చలనచిత్ర పరిశ్రమ బాగుండాలని ఎప్పుడూ కోరుకునేవారు"-బాలకృష్ణ

LEADERS TRIBUTES TO SUPERSTAR : సూపర్​స్టార్​ కృష్ణ పార్థివదేహానికి రాష్ట్ర రాజకీయ ప్రముఖులు, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఘన నివాళులు అర్పించారు. నటశేఖరుడి పార్థివదేహానికి తెదేపా నేతలు సోమిరెడ్డి, ఎంపీ కనకమేడల పలువురు నాయకులు అంజలి ఘటించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.