ETV Bharat / state

'కొందరు ముఖ్యమంత్రుల పనితీరు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం'

author img

By

Published : Jan 26, 2020, 2:24 PM IST

ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరూ రాజ్యాంగానికి లోబడి పని చేయాలన్నారు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. గుంటూరు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించారు. జెండా ఆవిష్కరించిన కన్నా.. భరతమాత చిత్ర పటానికి పూలమాలలు వేశారు.

celabrate 71th republic day in state bjp party office
గుంటూరు భాజాపా రాష్ట్ర పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం

భాజపా రాష్ట్ర కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం

గుంటూరు భాజపా రాష్ట్ర పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం భరతమాత చిత్ర పటానికి పూలమాలలు వేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగం, భారత రాజ్యాంగమని కొనియాడారు. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు నడుచుకోవాలన్నారు. కొందరు ముఖ్యమంత్రులు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రశాంతంగా ఉన్న దేశంలో కాంగ్రెస్ నేతలు మత ఘర్షణలు రేపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి...

'భారత్​.. అసలైన ప్రజాస్వామ్యానికి నిలువెత్తు నిదర్శనం'

Intro:ఈశ్వరాచారి... గుంటూరు తూర్పు.. కంట్రిబ్యూటర్

యాంకర్.... గుంటూరు బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలలో ఘనంగా జరిగాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జెండా వందనం చేసి భరతమాత చిత్ర పటానికి పూలమలలు వేసి ఘాన నివాళ్ళర్పించారు. ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగం, భారత రాజ్యాంగమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. డాక్టర్. బి.ఆర్ అంబెడ్కర్ ని గుర్తుచేసుకుంటూ గణతంత్ర దినోత్సవ వేడుకలు చేసుకోవడం జరిగిందన్నారు. అంబేద్కర్ ఆశయాలకు ఆయన స్ఫూర్తికి అనుగుణంగా ప్రతి ఒక్కరు నడుచుకోవాలన్నారు. కొందరు ముఖ్యమంత్రులు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగబద్ధంగా ప్రమాణస్వీకారం చేసిన ముఖ్యమంత్రులు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లును వ్యతిరేకించడం మంచి పద్ధతి కాదన్నారు. సీఏఏ, ఎన్. ఆర్.సి బిల్లులకు వ్యతిరేకంగా ఆరోపణలు చేయడం మంచిది కాదన్నారు. ప్రశాంతంగా ఉన్న దేశంలో కాంగ్రెస్ పార్టీ నేతలు మత ఘర్షణలు రేపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరు రాజ్యాంగానికి లోబడి పని చేయాలన్నారు.


Body:బైట్... కన్నా లక్ష్మీనారాయణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.