ETV Bharat / state

ఇన్నాళ్లు దోచుకుని.. ఇప్పుడు సీఎం జగన్‌ వేదాలు వల్లిస్తున్నారు: బొండా ఉమా

author img

By

Published : Dec 14, 2022, 6:20 PM IST

Bonda Uma Fire on Jagan: మూడున్నరేళ్లలో 3లక్షల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడిన జగన్‌ రెడ్డి... ఇక చాలన్నట్లుగా మంత్రివర్గ భేటీలో వేదాలు వల్లించారని తెలుగుదేశం విమర్శించింది. అవినీతిని మీడియా వెలికి తీస్తున్నందున జాగ్రత్త పడాలని మంత్రులకు సూచించిన ముఖ్యమంత్రి.. తన దోపిడీని మాత్రం కొనసాగిస్తున్నారని తెలుగుదేశం నేత బొండా ఉమా ధ్వజమెత్తారు. ఇదే చివరి మంత్రివర్గ భేటీ అన్నట్లుగా సీఎం వ్యవహరించారని అన్నారు.

Bonda Uma Fire on Jagan
కోట్ల రూపాయల దోపిడీ చేసిన జగన్‌ రెడ్డి ఇక చాలు నీ వేదాలు

Bonda Uma Fire on Jagan: అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్లలో రూ.3లక్షల కోట్ల దోపిడీకి పాల్పడిన జగన్మోహన్ రెడ్డి.. ఇక దోపిడీ చాలన్నట్లుగా మంత్రివర్గంలో వేదాలు వల్లించాడని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమా ఆరోపించారు. మీడియా అవినీతిని వెలికితీస్తున్నందున జాగ్రత్తపడాలని మంత్రులకు సూచించిన సీఎం, తన దోపిడీని మాత్రం కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇకపై జరిగే దోపిడీ మీడియాకు తెలియకుండా చేయాలని సీఎం అమాత్యులకు సూచించారని విమర్శించారు.

గ్రీన్ ఎనర్జీలో రూ.60వేల కోట్లు, తూ.గో జిల్లాలో విక్రాంత్ రెడ్డి, అనీల్ రెడ్డి కలిసి రూ.15వేల కోట్ల లాటరైట్, విజయసాయి, జే గ్యాంగ్ కలిసి విశాఖలో రూ.40వేలకోట్ల భూములు దోచేశారని మండిపడ్డారు. మరో రూ.25వేల కోట్లు ఇతర నేతలు దోచారని విమర్శించారు. ఇసుకలోనే రూ.10వేల కోట్లు, 25వేల కోట్లు మైనింగ్​లో, మద్యంలో రూ.25 వేల కోట్లు, మాదకద్రవ్యాల్లో రూ.21వేల కోట్లు, బియ్యంలో రూ.7వేల కోట్లు దోచేశారన్న బొండా.. సిమెంట్ మాఫియా సిండికేట్​లో రూ.15వేల కోట్ల దోపిడీ జరిగిందని ఆరోపించారు.

సకుటుంబ సపరివారంగా వైకాపా నేతలు గత మూడున్నరేళ్లలో అడ్డగోలుగా దోపిడీకి పాల్పడ్డారని దుయ్యబట్టారు. ఇదే చివరి మంత్రివర్గ సమావేశం అన్నట్లు నిరాశ, నిస్పృహలో నిన్న సీఎం వ్యవహరించాడన్నారు. తెచ్చిన రూ.8.5లక్షల కోట్ల అప్పులోనూ వైకాపా నేతలు దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు.

కోట్ల రూపాయల దోపిడీ చేసిన జగన్‌ రెడ్డి ఇక చాలు నీ వేదాలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.