ETV Bharat / state

'తిరుపతి ఉప ఎన్నికలో భాజపా విజయం ఖాయం'

author img

By

Published : Apr 9, 2021, 3:38 PM IST

తిరుపతి ప్రజలు భాజపాకు అవకాశం ఇవ్వాలనుకుంటున్నారని భాజపా సీనియర్​ నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. తిరుపతి ఉప ఎన్నికలో భాజపా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Bjp leader kanna  laxmi narayana
Bjp leader kanna laxmi narayana

భాజపా సీనియర్​ నేత కన్నా లక్ష్మీనారాయణ

తిరుపతి ఉప ఎన్నికలో భాజపా విజయం ఖాయమని ఆ పార్టీ సీనియర్​ నేత కన్నా లక్ష్మీనారాయణ ధీమా వ్యక్తం చేశారు. గుంటూరులో భాజపా నేతలు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కన్నా ప్రారంభించారు. వైకాపా నేతలకు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే సీఎం జగన్ తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికి వస్తున్నారని అన్నారు. భాజపాకు అవకాశం ఇవ్వాలని తిరుపతి ప్రజలు అనుకుంటున్నారని.. వైకాపా, తెదేపాకు ఓటేస్తే ఉపయోగం లేదని జనాలు భావిస్తున్నారని వ్యాఖ్యానించారు. తిరుపతిలో భాజపా-జనసేన ప్రచారం ఉత్సాహంగా సాగుతోందన్నారు. తిరుపతిలో భాజపా జెండా ఎగురవేస్తామని కన్నా లక్ష్మీనారాయణ ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: విజయవాడ దుర్గగుడిలో కొనసాగుతున్న బదిలీలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.