ETV Bharat / state

తెలుగురాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

author img

By

Published : Feb 14, 2023, 3:18 PM IST

ఎమ్మెల్సీ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థులు
BJP Candidates for MLC Elections

BJP Candidates for MLC Elections: ఏపీలో త్వరలో జరగనున్న పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు స్థానానికి సన్నారెడ్డి దయాకర్‌రెడ్డిని.. కడప-అనంతపురం-కర్నూలు స్థానానికి నగరూరు రాఘవేంద్రని, శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నానికి పీవీఎన్‌ మాధవ్‌ను ఎంపిక చేసింది.

BJP candidates for MLC elections: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జరగనున్న పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు వివిధ పార్టీలు తమ గెలుపు గుర్రాలను బరిలోకి దింపేందుకు సిద్ధమవుతున్నాయి. తాజాగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తమ పార్టీ తరపున బరిలోకి దిగుతున్న అభ్యర్థులను ఎంపిక చేసింది.

ఏపీ, తెలంగాణలో త్వరలో ఎన్నికలు జరగనున్న పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. ప్రకాశం - నెల్లూరు - చిత్తూరు పట్టభద్రుల స్థానానికి సన్నారెడ్డి దయాకర్‌రెడ్డిని ఎంపిక చేయగా.. కడప - అనంతపురం - కర్నూలు స్థానానికి నగరూరు రాఘవేంద్రని, శ్రీకాకుళం - విజయనగరం - విశాఖపట్నం స్థానానికి పీవీఎన్‌ మాధవ్‌ను భారతీయ జనతా పార్టీ ఎంపిక చేసింది.

కాగా తెలుగు రాష్ట్రాల్లోని ఉపాధ్యాయ, పట్టభద్రులు, స్థానిక సంస్థల్లో ఖాళీ అవనున్న స్థానాల్లో మార్చి 13న ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 16న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఏపీలో 3 పట్టభద్రులు, 2 ఉపాధ్యాయ, 9 స్థానిక సంస్థల స్థానాలతో కలిపి మొత్తం 14 స్థానాలకు నిర్వహించనున్నారు.

గెలుపుపై ఎవరికి వారు.. తమ ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే పలు పార్టీ నేతలు బహిరంగంగానే.. గెలుపు తమదంటే తమదని వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీపై వ్యతిరేకత ఉందని విపక్ష పార్టీలు అంటుండగా, తమ పథకాలే తమను గెలిపిస్తాయని అధికార పార్టీ నేతలు అంటున్నారు. ఎవరు గెలుస్తారో అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.