ETV Bharat / state

ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభ..రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై పాట పాడిన బండి సంజయ్​

author img

By

Published : Dec 15, 2022, 9:13 PM IST

BJP state president Bandi Sanjay
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

JP NADDA ON CM KCR: సీఎం కేసీఆర్‌పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విరుచుకుపడ్డారు. బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సభలో పాల్గొన్న ఆయన... అవినీతి టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని సాగనంపుదామని పిలుపునిచ్చారు. కేసీఆర్‌.. బీఆర్‌ఎస్‌తో రావడం కాదు.. వీఆర్‌ఎస్‌ తీసుకునే సమయం దగ్గరికి వచ్చిందని ఎద్దేవా చేశారు. డబుల్​బెడ్​ రూం ఇళ్ల స్థలాల కోసం కేసీఆర్​ ప్రభుత్వ యాడ్​ను పాడి.. తనదైన స్టైల్​లో విమర్శించారు.

JP NADDA ON CM KCR :తెలంగాణలో త్వరలో కమలం వికసిస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆకాంక్షించారు. బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సభలో పాల్గొన్న జేపీ నడ్డా... బండి పాదయాత్ర గ్రామగ్రామానికి వెళ్తోందని పేర్కొన్నారు. అవినీతి టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని సాగనంపుదామని పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌పై పోరాటానికి తెలంగాణ ప్రజలు కలసిరావాలని అన్నారు. కేసీఆర్‌.. బీఆర్‌ఎస్‌తో రావడం కాదు.. వీఆర్‌ఎస్‌ తీసుకునే సమయం దగ్గరికి వచ్చిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని ఆరోపించారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

''దోపిడీ కోసమే ధరణీ పోర్టల్‌ తెచ్చారు. యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి, కొండగట్టు ఆంజనేయస్వామికి ప్రార్థిస్తున్నాను. సుదీర్ఘంగా కాలంగా ప్రజాసంగ్రామ యాత్ర చేస్తున్న బండి సంజయ్‌కు అభినందనలు. ఈ యాత్ర ద్వారా ఇంటింటికి వెళ్లి ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నారు. కేసీఆర్‌కు గుడ్‌ బై చెప్పాల్సిన సమయం ఆసన్నమయ్యింది. కేసీఆర్‌ ప్రభుత్వం అవినీతిమయం, ప్రజాస్వామ్యంపై కేసీఆర్‌కు నమ్మకం లేదు.'' - జేపీ నడ్డా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు

తెలంగాణలో కేసీఆర్‌ పాలనకు విశ్రాంతి... బీజేపీకి అధికారంలోకి వచ్చే సమయం వచ్చిందని ఆకాంక్షించారు. మోదీ ప్రభుత్వం అన్ని వర్గాలకు న్యాయం చేసిందని వెల్లడించారు. ఎస్సీ, ఆదివాసీ మహిళ రాష్ట్రపతి పదవిని అధిష్ఠించారని తెలిపారు. కేసీఆర్‌... ధనిక రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని విమర్శించారు.

Bandi Sanjay gets emotional: కరీంనగర్‌లో నిర్వహించిన 5వ విడత ప్రజా సంగ్రామ యాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కన్నీటిపర్యంతమయ్యారు. సభకు హాజరైన ప్రజలను చూసి.. ఒక్కసారిగా ఎమోషనల్‌ అయ్యారు. అనంతరం సభలో మాట్లాడుతూ... కరీంనగర్‌ గడ్డ బీజేపీ అడ్డా అని వ్యాఖ్యానించారు. హిందూధర్మ పరిరక్షణ కోసం పని చేస్తానని హామీనిచ్చారు. ధర్మం కోసం యుద్ధం చేస్తానని వెల్లడించారు. అవమానాలకు భయపడే వ్యక్తి కాదు ఈ బండి సంజయ్‌ అని పేర్కొన్నారు. కార్యకర్తలు, ప్రజలు కష్టార్జితం వల్ల ఎంపీగా గెలిచానని తెలిపారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

నాకు డిపాజిట్‌ కూడా దక్కదని అన్నారు. నా గెలుపుతో దేశం ఆశ్చర్యపోయింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షడిగా నియమానికి కారణం కరీంనగర్‌ కార్యకర్తలే. ప్రజలే అభిమానంతో గెలిపించారని మోదీ, అమిత్‌షా గుర్తించారు. కాషాయ జెండాతో రాష్ట్రాన్ని పవిత్రం చేయాలని భాజపా అధిష్ఠానం చెప్పింది. - బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

తెలంగాణ పేరుందని టీఆర్‌ఎస్‌కు 2 సార్లు ఓట్లు వేశామని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ పేరుతో తెలంగాణ పదాన్ని తొలగించారన్నారు. టీఆర్‌ఎస్‌కు తెలంగాణతో సంబంధం లేదని వెల్లడించారు. తెలంగాణ తల్లికి కేసీఆర్‌ ద్రోహం చేశారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ పేరుతో కేసీఆర్‌ తెలంగాణకు మోసం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. మద్యం పేరుతో దోచుకున్నారు, భూములు లాక్కున్నారని ఆరోపించారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

బలిదానాలతో తెలంగాణ సాధించుకున్నాం. నీళ్లు, నిధులు, నియామకాలకు సాయం చేస్తామని మోదీ చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ సహరించడం లేదు. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల ఏకమయ్యారు. దోచుకుందాం...కమీషన్లు దాచుకుందామని అనుకున్నారు. దోచుకుందాం...కమీషన్లు దాచుకుందామని అనుకున్నారు. - బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. వారిద్దరూ ఏకమై.. రెండు రాష్ట్రాలను దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రజలు తిరస్కరిస్తే ‘జై తెలంగాణ అని నేనంటా.. జై ఆంధ్రా అని నువ్వను’ అంటూ ఇద్దరూ మాట్లాడుకున్నారని అన్నారు.

తాను చేపట్టిన ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా కరీంనగర్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ.. ‘కరీంనగర్‌ గడ్డ..భాజపా అడ్డా’ అని అన్నారు. ఈ నేలలో పౌరుషం ఉందని, ధర్మం కోసం పని చేయడమే తప్ప.. విజయం కోసం అడ్డదారులు తొక్కనని చెప్పారు. అవమానాలకు భయపడే వ్యక్తిని కాదని, కార్యకర్తలు, ప్రజల కష్టార్జితం వల్లే ఎంపీగా గెలిచానన్నారు.

తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న నీళ్లు, నిధులు,నియామకాలకు సాయం చేస్తామని ప్రధాని మోదీ చెప్పారని బండి సంజయ్‌ తెలిపారు. కానీ, రాష్ట్ర అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ ఏమాత్రం సహకరించడం లేదన్నారు.

Bandi sanjay Rain Song: బండి సంజయ్​ తలపెట్టిన ఐదో విడత ప్రజా సంగ్రామ పాద యాత్ర ముగింపు సభ కరీంనగర్​లో ఈరోజు సాయంత్రం ఘనంగా జరిగింది. సభలో ప్రసంగించిన బండి సంజయ్​.. డబుల్​బెడ్​ రూం ఇళ్ల స్థలాల కోసం కేసీఆర్​ ప్రభుత్వం ఉపయోగించిన ఒక యాడ్​ ప్రస్తావించారు. అందులోని 'ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వానా' సాంగ్​ సరదాగా పాడారు. దీంతో సభలో ఒక్కసారిగా నవ్వులు పూసాయి. అనంతరం ఆ యాడ్​లో అక్కాచెల్లెళ్ల మధ్య జరిగిన సంభాషణ కూడా సరదాగా చెప్పారు.

పాట పాడిన బండి సంజయ్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.