ETV Bharat / state

'సీఎం గారు..నా ఇంటిని కూల్చేశారు.. న్యాయం చేయండి'

author img

By

Published : Dec 5, 2020, 8:33 PM IST

Updated : Dec 5, 2020, 10:53 PM IST

ఆర్మీలో సేవలందిస్తూ దేశాన్ని కాపాడే తాను...నరసరావుపేటలో సొంత ఇంటిని కాపాడుకోలేకపోయానని గోవిందరెడ్డి అనే జవాను ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలోని తన ఇంటిని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని వాపోయారు. ముఖ్యమంత్రి జగన్ గారు మీరే న్యాయం చేయాలంటూ జవాను విడుదల చేసిన వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది.

'సీఎం గారు...నా ఇంటిని కూల్చేశారు న్యాయం చేయండి'
'సీఎం గారు...నా ఇంటిని కూల్చేశారు న్యాయం చేయండి'

'సీఎం గారు...నా ఇంటిని కూల్చేశారు న్యాయం చేయండి'

నా ఇల్లును కూల్చేశారు...సీఎం జగన్మోహన్​రెడ్డి గారు న్యాయం చెయ్యండంటూ ఓ ఆర్మీ జవాను వీడియో గుంటూరు జిల్లా నరసరావుపేటలో వైరల్​గా మారింది. గుర్తుతెలియని వ్యక్తులు తన ఇంటిని కూల్చారంటూ గోవిందరెడ్డి అనే ఆర్మీ జవాను వీడియో ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. గత 18 ఏళ్లుగా ఆర్మీలో సేవలందిస్తూ...2010లో నరసరావుపేటలోని బరంపేటలో స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకున్నానని తెలిపాడు. ఇటీవల మున్సిపల్ అధికారుల పేరు చెప్పి కొందరు వ్యక్తులు తన ఇంటిని పూర్తిగా కూల్చివేశారని ఆయన ఆరోపించారు. ఏ అధికారంతో తన ఇంటిని కూల్చారని మున్సిపల్ అధికారులను అడిగితే.. తాము కూల్చలేదని వారు తెలిపారన్నారు.

స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి మంచి పేరు ఉందని.. ఆయన నా ఇల్లు కూల్చి ఉండరని భావిస్తున్నానన్నారు. ఈ విషయమై తనకు న్యాయం చేయాలంటూ శుక్రవారం గుంటూరు జిల్లా కలెక్టర్​ను కలసి వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. దేశాన్ని కాపాడేందుకు ఆర్మీలో కష్టపడుతున్న తాను.. నరసరావుపేటలో ఇంటిని కాపాడుకోలేకపోయానని జవాను గోవిందరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్​ తనకు న్యాయం జరిగేలా చూడాలని అభ్యర్థించారు.

ఈ విషయంపై నరసరావుపేట మున్సిపల్ కమీషనర్ రామచంద్రారెడ్డిని వివరణ కోరగా...ఆర్మీ జవాను గోవిందరెడ్డి కొనుగోలు చేసిన స్థలం ప్రభుత్వ భూమిగా తెలిపారు. అతనికి స్థలం అమ్మిన మధ్యవర్తులు ఆ స్థలానికి వేరే సర్వే నెంబర్ వేసి రిజిస్ట్రేషన్ చేసి అతనిని మోసం చేశారన్నారు. ఆ స్థలం రజకుల ఖానా కింద కేటాయించి ఉందన్నారు. మున్సిపల్ అధికారులెవరూ ఆ ఇంటిని కూల్చలేదని తెలిపారు.

న్యాయం జరిగేలా చూస్తాం...

జవాను ఇల్లు కూల్చివేతపై నరసరావుపేట సబ్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్ స్పందించారు. జవాను వీడియో తన దృష్టికి వచ్చిందని.., సైనికుని ఇల్లు కూల్చిన వారెవరో గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఘటనపై విచారణ జరిపి జవాను కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.

న్యాయం జరిగేలా చూస్తాం...

ఇదీచదవండి

'దేశానికి రక్షణ కల్పించే సైనికులకు రాష్ట్రంలో రక్షణ లేదా?'

Last Updated :Dec 5, 2020, 10:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.