ETV Bharat / state

'ఆక్వా సీడ్, ఫీడ్ ధరల ప్రభావం రైతులపై పడకుండా చర్యలు తీసుకోవాలి'

author img

By

Published : Dec 14, 2022, 10:05 AM IST

ఆక్వా సీడ్, ఫీడ్ ధరల ప్రభావం రైతులపై పడకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆక్వా ఉత్పత్తుల ధరల స్థిరీకరణపై ఏర్పాటైన సాధికారిక కమిటీ అభిప్రాయపడింది. మంత్రి పెద్దిరెడ్డి నేతృత్వంలో సమావేశమైన కమిటీ.. ఉత్పత్తి వ్యయంను తగ్గించడం, ధరలను స్థిరీకరించడంపై దృష్టి సారించాలని సూచించింది.

MINISTER PEDDIREDDY ON AQUA
MINISTER PEDDIREDDY ON AQUA

MINISTER PEDDIREDDY ON AQUA: రాష్ట్రంలో ఆక్వా ఉత్పత్తుల ధరల స్థిరీకరణపై ఏర్పాటైన సాధికారిక కమిటీ మరోమారు సచివాలయంలో సమావేశమై పరిస్థితిని సమీక్షించింది. ఆక్వా సీడ్, ఫీడ్ ధరల ప్రభావం రైతులపై పడకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని సాధికారిక కమిటీ అభిప్రాయపడింది. మంత్రి పెద్దిరెడ్డి నేతృత్వంలో సమావేశమైన ఆక్వా సాధికారిక కమిటీ.. ఉత్పత్తి వ్యయంను తగ్గించడం, ధరలను స్థిరీకరించడంపై దృష్టి సారించాలని సూచించింది.

రొయ్యలు సాగు చేస్తున్న రైతులకు ప్రస్తుతం మార్కెట్​లో ఆశించిన మేరకు రేటు లభిస్తోందని, దీనిని తరువాత రోజుల్లో కూడా కొనసాగేలా జాగ్రత్తలు తీసుకోవాలని కమిటీ స్పష్టం చేసింది. ఆక్వా ఉత్పత్తుల రేట్లను అన్ని ఆర్బీకేల్లోనూ ప్రదర్శిస్తున్నామని, అలాగే రైతుల సమస్యలను తెలుసుకుని, తక్షణం వాటిని పరిష్కరించేందుకు కాల్​సెంటర్​ను కూడా ఏర్పాటు చేశామని అధికారులు వివరించారు.

ఫీడ్ రేట్లను మరింతగా తగ్గించేందుకు వీలుగా ఫీడ్ తయారీదారులతోనూ సమావేశం నిర్వహించామని తెలిపారు. పూర్తిగా ఎగుమతులపైనే ఆధారపడటం వల్ల ఆక్వా రేట్లను స్థిరీకరించలేక పోతున్నామని, దేశీయంగా ఆక్వా ఉత్పత్తులు విక్రయించుకోగలిగితే రైతులకు మేలు జరుగుతుందని కమిటీ అభిప్రాయపడింది. దీని కోసం మార్కెటింగ్ కంపెనీల సహకారం తీసుకోవాలని నిర్ణయించింది.

ప్రతి నెలా వెయ్యి గ్రామాల్లో సర్వే ప్రక్రియ పూర్తి చేయాలి: 2023 డిసెంబర్ కల్లా ఆంధ్రప్రదేశ్‌లోని 17,461 గ్రామాల్లో భూముల రీసర్వే ప్రక్రియను పూర్తి చేయాలని.. మంత్రివర్గ ఉపసంఘం అధికారులను ఆదేశించింది. మంత్రి పెద్దిరెడ్డి అధ్యక్షతన భూహక్కు-భూరక్ష కార్యక్రమంపై.. కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ఇప్పటి వరకు 4.3 లక్షల సబ్‌డివిజన్‌లలో.. సుమారు 2 లక్షల మ్యుటేషన్‌లను పరిష్కరించామని మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. 2023 ఫిబ్రవరి నాటికి 4వేల గ్రామాలు, డిసెంబర్ నాటికి మొత్తం17,461 గ్రామాలకు భూహక్కు పత్రాల పంపిణీ పూర్తి చేయాలని కేబినెట్‌ సబ్‌కమిటీ సూచించింది.

ప్రతి నెలా వెయ్యి గ్రామాల్లో.. సర్వే ప్రక్రియను పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేయాలని ఆదేశించింది. రీసర్వేకు 3.08 కోట్ల సర్వే రాళ్లు అవసరమని.. అధికారులు తెలిపారు. ప్రతినెలా కనీసం 30 లక్షల సర్వే రాళ్లు సిద్ధం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు వివరించారు. అభ్యంతరాలపై నోటీసులు జారీ చేసి.. అప్పీళ్లను స్వీకరిస్తున్నామని తెలిపారు. మండలాల్లోనే అప్పీళ్లను పరిష్కరిస్తున్నామని.. అధికారులు వివరించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.