ETV Bharat / state

ఆర్టీసీకి ఆదాయ సంక్రాంతి.. పండుగ రాబడి ఎన్ని కోట్లో తెలుసా?

author img

By

Published : Jan 17, 2023, 9:17 PM IST

APSRTC earns 141 crore revenue: సంక్రాంతి పండుగ ఎపీఎస్​ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించింది. ప్రయాణికులు విశేషంగా ఆదరిస్తుండటం వల్ల లాభాల పంట పండింది. గత ఏడాది సంక్రాంతి సీజన్ మొత్తం కలిపి రూ.107 కోట్ల ఆదాయం రాగా... ఈ ఏడాది ఇప్పటి వరకు రూ. 141 కోట్లు సమకూరినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. తిరుగు ప్రయాణం చేసే వారు ఇంకా ఉండటం వల్ల ఆదాయం మరింత పెరుగే అవకాశం ఉందని ఆర్టీసీ ఎండీ వెల్లడించారు.

APSRTC earns
ఆర్టీసీకి కాసులు కురిపించిన సంక్రాంతి

APSRTC got record level income: సంక్రాంతి అంటే ప్రైవేట్ ట్రావెల్స్​కు పండగే అలాంటిది. ఈ సారి ఎపీఎస్​ఆర్టీసీ రికార్డు స్థాయిలో ఆదాయాన్ని అర్జించింది. గత సంవత్సరంతో పొల్చితే రూ.34 కోట్లు అధికంగా సమకూరినట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు వెల్లడించారు.

సంక్రాంతి పండుగ ఎపీఎస్​ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించింది. ప్రయాణికులు విశేషంగా ఆదరిస్తుండటం వల్ల, ఆర్టీసీ కి లాభాల పంట పండింది. రద్దీ దృష్ట్యా ఈ నెల 6 నుంచే పలు ప్రాంతాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపడంతో... ఈనెల 14 బోగి వరకే రికార్డు స్థాయిలో రాబడి ఆర్జించినట్లు ఎపీఎస్​ఆర్టీసీ వెల్లడించింది. కేవలం 9 రోజుల్లోనే 141 కోట్లు ఆదాయం ఆర్జించినట్లు సంస్థ తెలిపింది. రోజుకు సరాసరి 15.66 కోట్లు చొప్పున రాబడి ఆర్జించినట్లు పేర్కొంది. ఈనెల 6 నుంచి 14 వరకు రోజూ తిరిగే బస్సులకు అదనంగా 3392 ప్రత్యేక బస్సులు ఆర్టీసీ నడిపినట్లు అధికారులు వెల్లడించారు. హైదరాబాద్, చెన్నై , బెంగళూరు సహా రాష్ట్రంలో పలు ప్రాంతాల మధ్య బస్సులను తిప్పినట్లు పేర్కొన్నారు. కేవలం ప్రత్యేక బస్సుల ద్వారానే 7.90 కోట్ల రాబడి వచ్చినట్లు అధికారులు తెలిపారు.

గత ఏడాది సంక్రాంతి సీజన్ మొత్తం కలిపి రూ.107 కోట్ల ఆదాయం రాగా... ఈ ఏడాది సంక్రాంతి ముందు రోజుల్లోనే అంతకు మించి రూ.141 కోట్లు రాబట్టి, రూ.34 కోట్లు అదనపు ఆదాయాన్ని పొందినట్లు అధికారులు వెల్లడించారు. గతేడాది 50 శాతం అదనపు చార్జీలువసూలు చేయగా.. ఈ సారి ప్రత్యేక బస్సుల్లో సాధారణ చార్జీలు వసూలు చేసి గణనీయమైన ఆదాయాన్ని నమోదు చేయడం విశేషం. తిరుగు ప్రయాణానికి 10 శాతం రాయితీ ఇవ్వడంతో పాటుగా, ఐదుగురు కుటుంబ సభ్యులు టికెట్ బుకింగ్ చేస్తే 5 శాతం రాయితీ ఇచ్చి ప్రయాణికులను తనవైపు ఆకర్షించింది. ప్రైవేటును వీడి ప్రభుత్వ రవాణా సంస్థ ఆర్టీసీని ఆదరించిన ప్రయాణికులకు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు సహా అధికారులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రద్దీ దృష్ట్యా ఈ నెల 18 వరకూ ప్రత్యేక బస్సులు నడుస్తాయని ఆదాయం మరింత పెరుగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.