ETV Bharat / state

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 5PM

author img

By

Published : Dec 14, 2022, 5:00 PM IST

.

AP TOP NEWS
AP TOP NEWS

  • ఈ నెల 22న హైకోర్టుకు సీఎస్​ జవహర్​రెడ్డి హాజరు కావాలని ఆదేశం
    HC ORDERS TO CS JAWAHAR: పాఠశాల ప్రాంగణాల్లో సచివాలయాల నిర్మాణాలపై ధర్మాసనం మరోసారి మండిపడింది. నిర్మాణాలు చేపట్టవద్దని గతంలో ఇచ్చిన ఆదేశాలను.. అమలు చేయకుండా కట్టడాలు చేపట్టారని మండిపడిన న్యాయస్థానం.. ఈ నెల 22న కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని సీఎస్​ను ఆదేశించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పల్నాడులో ఉద్రిక్తత.. వెల్దుర్తి పోలీస్​స్టేషన్​ను చుట్టుముట్టిన టీడీపీ కార్యకర్తలు
    TENSION IN PALNADU : పల్నాడు జిల్లా వెల్దుర్తి పోలీస్​స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇద్దరు తెదేపా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారంటూ.. ఆ పార్టీ నేత జూలకంటి బ్రహ్మారెడ్డి ఆరోపించారు. అరెస్టు చేసిన కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఆ వ్యాఖ్యలు తప్పు.. ఇప్పటివరకు లక్షన్నర ఇళ్లు నిర్మించాం: శ్రీలక్ష్మీ
    CS SRI LAKSHMI: పీఎం ఆవాస్​ యోజన కింద కేవలం 5 ఇళ్లు మాత్రమే నిర్మించారని కేంద్రం చేసిన వ్యాఖ్యలను పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి ఖండించారు. గత మూడేళ్లలో లక్షన్నర ఇళ్లు నిర్మించామని ఆమె స్పష్టం చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఇళ్ల స్థలాల పేరుతో వైసీపీ నేతలు వందల కోట్లు దోచుకున్నారు: కాలవ శ్రీనివాసులు
    Kalva Srinivasulu Comments On Housing Scheme : మూడున్నరేళ్లలో జగన్మోహన్ రెడ్డి కట్టిన ఇళ్ల కంటే.. కూల్చినవే ఎక్కువనీ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు ధ్వజమెత్తారు. ఇళ్ల స్థలాల కేటాయింపును కుంభకోణంగా మార్చుకుని వందల కోట్లు వైకాపా నేతలు దండుకున్నారని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'మీరు తాగుబోతులా?'.. కల్తీ మద్యంపై బిహార్ అసెంబ్లీలో దుమారం.. సీఎం ఫైర్
    బిహార్​లో దారుణం జరిగింది. కల్తీ మద్యం తాగి ఐదుగురు మరణించారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, ఘటనపై రాష్ట్ర అసెంబ్లీలో అధికార విపక్షాల మధ్య వాడీవేడీ చర్చకు దారితీసింది. ఓ దశలో సీఎం నీతీశ్ కుమార్ సహనం కోల్పోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మత్తులో దారుణం.. శునకం చెవులు, తోకను కత్తిరించి మందులోకి స్టఫ్​గా..
    మూగజీవి పట్ల అమానుషంగా ప్రవర్తించారు ఇద్దరు మందుబాబులు. తమ క్రూరత్వాన్ని శునకం పిల్లలపై చూపించారు. వాటి చెవులు, తోక కత్తిరించి పైశాచిక ఆనందాన్ని పొందారు. ఈ అమానవీయ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని బరేలి జిల్లాలో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • తవాంగ్ ఘర్షణపై చైనాకు అమెరికా షాక్.. భారత్​కు పూర్తి మద్దతు
    అరుణాచల్‌ప్రదేశ్‌ తవాంగ్‌ సెక్టార్‌లో జరిగిన ఘర్షణకు సంబంధించి అగ్రరాజ్యం అమెరికా.. చైనాను తప్పుబట్టింది. ఉద్రిక్తతలు తగ్గించడం కోసం భారత్‌ తీసుకొన్న చర్యలకు పూర్తి మద్దతును ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మస్క్ సంపద డౌన్.. ప్రపంచ కుబేరుడిగా బెర్నార్డ్ ఆర్నాల్ట్.. అసలు ఎవరీయన?
    Bernard Arnault World Richest Man : ప్రపంచ కుబేరుల జాబితాలో ఎలాన్‌ మస్క్‌ రెండో స్థానానికి పడిపోయారు. ఫ్రెంచ్‌ వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్ మొదటి స్థానంలో నిలిచారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పుజారా, శ్రేయస్​ సూపర్ ఇన్నింగ్స్​​​.. చివర్లో ఎదురుదెబ్బ.. తొలి రోజు స్కోరు..
    బంగ్లాదేశ్​తో జరిగిన మొదటి టెస్టు తొలి రోజు ముగిసే సరికి టీమ్​ఇండియా ఆరు వికెట్లు కోల్పోయి 278 పరుగులు చేసింది. ఆ వివరాలు.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • బాలీవుడ్​ ఫిల్మ్​ మేకర్స్​కు కమల్​హాసన్​ అడ్వైజ్​.. ఏంటంటే?
    తాను చాలా మంది బాలీవుడ్‌ వాళ్లని చూసి స్ఫూర్తి పొందినట్లు కమల్‌ హాసన్‌‌ చెప్పారు. ఈ ఏడాది హిందీ సినిమాలు ఆశించిన స్థాయిలో అలరించకపోవడంపై.. బాలీవుడ్‌ దర్శకులకు ఆయన సలహా ఇచ్చారు. అదేంటంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.