ETV Bharat / state

మాజీమంత్రి నారాయణకు హైకోర్టులో ఊరట...

author img

By

Published : Dec 21, 2022, 6:25 PM IST

Ex Minister Narayana
మాజీమంత్రి నారాయణ

Ex Minister Narayana: అమరావతి రాజధాని ఇన్నర్‌రింగ్ రోడ్ కేసులో మాజీమంత్రి నారాయణకు హైకోర్టులో ఊరట లభించింది. ఆరు వారాల పాటు బెయిల్ గడువును పొడిగిస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని అంతర్వలయ రహదారి మాస్టర్ ప్లాన్ అలైన్‌మెంట్‌లో అవకతవకలు జరిగాయని దాఖలైన కేసులో... నారాయణపై సీఐడి కేసు నమోదు చేసింది.

Minister Narayana Bail Petition: రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో మాజీమంత్రి నారాయణకు హైకోర్టులో ఊరట లభించింది. ఆరు వారాలు పాటు బెయిల్ గడువులను పొడిగిస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను న్యాయస్థానం ఈనెల 27కు వాయిదా వేసింది. రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ మాస్టర్ ప్లాన్ అలైన్ మెంట్​లో అవతవకలు జరిగాయని దాఖలు చేసిన కేసులో మాజీమంత్రి నారాయణపై సీఐడి కేసు నమోదు చేసిందిన విషయం తెలిసిందే. ఈ కేసులో గతంలో నారాయణకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ గడువు ఈరోజుతో ముగియనుండటంతో పిటీషన్ పై హైకోర్టు విచారణ జరిపింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.