అంగన్వాడీలతో ప్రభుత్వం చర్చలు విఫలం

author img

By ETV Bharat Andhra Pradesh Desk

Published : Jan 12, 2024, 6:30 PM IST

Updated : Jan 12, 2024, 10:40 PM IST

AP_Government_Talks_with_Anganwadi_Associations

AP Government Talks with Anganwadi Associations: అంగన్వాడీల సంఘాలతో ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. అంగన్వాడీల సమ్మె విరమింపజేసేందుకు మంత్రుల కమిటీ తీవ్రంగా ప్రయత్నం చేసింది. కానీ వేతనాలు పెంచాల్సిందేనని అంగన్వాడీలు డిమాండ్​ చేశారు. ప్రస్తుత తరుణంలో అంగన్వాడీల వేతనాల పెంపు ఏ మాత్రం సాధ్యం కాదని మంత్రుల కమిటీ స్పష్టం చేసింది.

AP Government Talks with Anganwadi Associations: అంగన్వాడీలతో ప్రభుత్వ చర్చలు విఫలమయ్యాయి. సచివాలయంలో అంగన్వాడీ సంఘాలతో మరోసారి ప్రభుత్వం చర్చలు జరిపింది. చర్చలకు మంత్రి బొత్స, సలహాదారు సజ్జల, అంగన్వాడి సంఘాల నేతలు హాజరయ్యారు. అంగన్వాడిలతో సమ్మె విరమింప చేసేలా ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేసింది. కానీ వేతనాలు పెంచాలని అంగన్వాడీలు డిమాండ్​ చేశారు. ప్రస్తుత తరుణంలో వేతనాల పెంపు సాధ్యం కాదని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది.

అంగన్వాడీల సమ్మెపై సచివాలయంలో ట్రేడ్ యూనియన్ ప్రతినిధులతో మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల చర్చలు జరిపారు. ఐదేళ్లు పూర్తి అయ్యాక వచ్చే ప్రభుత్వంలోనే వేతనాల పెంపు వీలవుతుందని అంగన్వాడీలకు మంత్రులు బొత్స, సలహాదారు సజ్జల తేల్చి చెప్పారు. ప్రస్తుతం అంగన్వాడీలకు వేతనాలు పెంచేందుకు ఏ మాత్రం సాధ్యం కాదని మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. దీంతో చర్చలకు ఎందుకు పిలిచారనీ మంత్రుల కమిటీని అంగన్వాడి సంఘాల నేతలు నిలదీశారు.

చర్చలకు వైఎస్ఆర్​టీయూసీ ప్రతినిధులు హాజరయ్యారు. వైఎస్ఆర్​టీయూసీ ప్రతినిధులు చర్చలకు హాజరు కావడంపై మిగిలిన అంగన్వాడీల ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వైఎస్ఆర్​టీయూసీ ప్రతినిధులు చర్చల్లో పాల్గొంటే తాము వెళ్లిపోతామని అంగన్వాడీల ప్రతినిధులు తెలిపారు. వారికి అధికారులు సర్దిచెప్పారు.

సమ్మె యథాతథంగా కొనసాగుతుంది: మహిళల పట్ల ఈ ప్రభుత్వానికి సానుకూల దృక్పథం లేదని అంగన్వాడీల ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేకసార్లు చర్చించినా తమ డిమాండ్లు నెరవేర్చలేదని ఆవేదన చెందారు. ఎస్మాకు భయపడేది లేదన్న సుబ్బరావమ్మ, కొత్తవారిని నియమించుకుంటామన్న బెదిరింపులకు భయపడమని తేల్చి చెప్పారు. ఎస్మా ప్రతులను భోగి మంటల్లో కాలుస్తామని, సమ్మె యథాతథంగా కొనసాగుతుందని తెలిపారు.

అంగన్వాడీల అలుపెరగని పోరాటం - డిమాండ్లు నేరవేర్చాలని డిమాండ్​

వేతనాల పెంపుపైనే ప్రధాన సమస్య: అంగన్వాడీల 11 డిమాండ్లలో 10 డిమాండ్లను ఆమోదించామని ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. వేతనాల పెంపుపైనే ప్రధాన సమస్య ఉందన్న సజ్జల, అంగన్వాడీల సమస్యపై సానుకూలంగానే ఉండాలని సీఎం చెప్పారన్నారు. గ్రాట్యుటీ విషయంలో కేంద్రానికి లేఖ రాశామని, కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చాక నిర్ణయం తీసుకుంటామన్నారు. అంగన్వాడీ రిటైర్మెంట్ బెనిఫిట్‌ను రూ.లక్షా 20 వేలకు, అంగన్వాడీ హెల్పర్‌ రిటైర్మెంట్ బెనిఫిట్‌ను రూ.50 వేలకు పెంచుతామని చెప్పారు. వేతనాలను వచ్చే జులైలో పెంచుతామని హామీ ఇచ్చామని పేర్కొన్నారు. అంగన్వాడీలు, హెల్పర్ల టీఏ, డీఏలు క్రమబద్ధీకరిస్తామని స్పష్టం చేశారు.

రాజకీయ పార్టీల వలలో చిక్కుకోవద్దు: నెరవేర్చగలిగే హామీలన్నీ అమలు చేస్తామని చెప్పామన్న సజ్జల, అంగన్వాడీల సమ్మెతో అనేక ఇబ్బందులు వస్తున్నాయని అన్నారు. గర్భిణులు, చిన్నారులకు పౌష్టికాహారం అందించాల్సి ఉందని, ప్రభుత్వ పరిమితులను అర్థం చేసుకోవాలని కోరుతున్నామన్నారు. సమ్మె విరమించాలని అంగన్వాడీలకు విజ్ఞప్తి చేస్తున్నామన్న సజ్జల, రాజకీయ పార్టీల వలలో చిక్కుకోవద్దని అంగన్వాడీలను కోరుతున్నామని హితవు పలికారు. పార్టీలు బాగానే ఉంటాయని, అంగన్వాడీలే నష్టపోతారని పేర్కొన్నారు.

వేతనాలు పెంచేందుకు ఒక పద్ధతి ఉంటుంది: అంగన్వాడీల వేతనం పెంపుపై ఒక విధానం ఉందన్న సజ్జల, వేతనాలను ఐదేళ్లకు ఒకసారి మాత్రమే పెంచాల్సి ఉందని తెలిపారు. ఈ ఏడాది జులై నాటికి ఐదేళ్లు నిండుతాయని చెప్పామన్న సజ్జల, జులైలో తప్పకుండా వేతనాలు పెంచుతామని స్పష్టం చేశారు. వేతనాలు పెంచేందుకు ప్రభుత్వానికి ఒక పద్ధతి ఉంటుందని, వెంటనే సమ్మె విరమించి విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేశారు. విధుల్లో చేరితే సమ్మె కాలానికి వేతనం, కేసులపైనా సానుకూలంగా ఉంటామన్నారు.

అంగన్వాడీల ఉద్యోగాలకు ఎసరు - విధుల్లోంచి తొలగిస్తున్నట్లు నోటీసులు

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోక తప్పదు: అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల డిమాండ్లపై పలుసార్లు చర్చించామన్న సజ్జల, విధానపరమైన అంశాల్లోనూ సానుభూతితోనే వ్యవహరించామన్నారు. అంగన్వాడీల సమస్యల పట్ల సానుకూలంగానే వ్యవహరించామని, అంగన్వాడీల డిమాండ్లు గొంతెమ్మ కోర్కెలని మేం అనడం లేదని పేర్కొన్నారు. సమ్మె విరమించకుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోక తప్పదన్న సజ్జల, కొత్తవారిని నియమించుకోవాల్సిన పరిస్థితులు కల్పిస్తున్నారని అన్నారు.

సమ్మె విరమించి విధుల్లో చేరాలని అంగన్వాడీలను కోరుతున్నాం: సజ్జల

ఎల్లకాలం సమ్మె చేస్తామంటే కుదరదు: అంగన్వాడీల సేవలు అత్యవసరం కనుకే ఎస్మా పరిధిలోకి తెచ్చామన్న సజ్జల, సమ్మెకు దిగి 32 రోజులైంది కనుకే నోటీసులు జారీ చేశామన్నారు. ఎల్లకాలం సమ్మె చేస్తామంటే కుదరదని, ఇదేమీ ఫ్యాక్టరీ కాదని తెలుసుకోవాలని హితవు పలికారు.

అంగన్వాడీల సమ్మె వెనక రాజకీయ కోణం - జీతాల పెంపు ఇప్పుడు సాధ్యం కాదు: సజ్జల

Last Updated :Jan 12, 2024, 10:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.