ETV Bharat / state

AP Employees Protests: ఉద్ధృతంగా మారుతున్న పీఆర్సీ ఉద్యమం.. వారు సైతం సమ్మెలో..

author img

By

Published : Jan 29, 2022, 4:10 PM IST

AP Employees Protests: పీఆర్సీకి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు నిరసనల్ని కొనసాగిస్తున్నారు. కార్యాలయాల నుంచి బయటకు వచ్చి పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా తమ స్వరాన్ని వినిపించారు. రాష్ట్రంలోని సమస్యలను పక్కదారి పట్టించేందుకే.. వైకాపా ప్రభుత్వం కొత్తగా జిల్లాల ప్రస్తావన తెరపైకి తీసుకు వచ్చిందని మండిపడ్డారు.

AP Employees Protests
AP Employees Protests

AP Employees Protests: పీఆర్సీకి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు నిరసనల్ని కొనసాగిస్తున్నారు. కార్యాలయాల నుంచి బయటకు వచ్చి వ్యతిరేక స్వరం వినిపించారు. రాజమహేంద్రవరంలో ట్రెజరీ ఉద్యోగులు పీఆర్సీని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. విశాఖలో జీవీఎంసీ గాంధీ పార్కు వద్ద సాధన సమితి చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు.. జిల్లా వైద్యఆరోగ్య సిబ్బంది మద్దతు తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి ర్యాలీగా వచ్చిన ఉద్యోగులు.. పీఆర్సీ సాధన సమితి నేతలకు సంఘీభావం తెలిపారు. పీఆర్సీ ఉద్యమానికి మద్దతుగా.. కార్మిక సంఘాలు విజయవాడ లెనిన్‌ కూడలిలో నిరసన చేపట్టారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

గుంటూరులో కొనసాగుతున్న రీలే దీక్షలు..

మెరుగైన పీఆర్సీ, ఇతర సమస్యల పరిష్కార సాధన కోసం గుంటూరులో ఉద్యోగులు రెండోరోజూ రిలే నిరాహార దీక్షలకు దిగారు. వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘ ప్రతినిధులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ రామకృష్ణ ఉద్యోగుల ఆందోళనకు మద్దతు ప్రకటించారు. అశుతోశ్ కమిటీ నివేదికను బహిర్గతం చేయాలని.. పాత విధానంలోనే జీతాలు ఇవ్వాలని.. కొత్తగా జారీచేసిన పీఆర్సీ జీవోలను రద్దు చేయాలంటూ ఉపాధ్యాయులు నినాదాలు చేశారు. ఇవి అమలు చేయకుండా మంత్రులతో చర్చలంటూ కాలయాపన చేయడం తగదని ఉద్యోగ సంఘ నేతలు అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి: Employees Relay fasting initiations : ప్రభుత్వం తెచ్చిన పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలి...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.