ETV Bharat / state

అదనపు కట్నం కోసం వేధిస్తున్న భర్తపై భార్య ఫిర్యాదు

author img

By

Published : Apr 30, 2019, 5:03 AM IST

Updated : Apr 30, 2019, 8:44 AM IST

కట్నం తేవాలని భర్త తనను వేధిస్తున్నాడని బాధితురాలు గుంటూరు అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేసింది.

కట్నం తేవాలన్న భర్తపై ఫిర్యాదు చేసిన భార్య

కట్నం తేవాలన్న భర్తపై ఫిర్యాదు చేసిన భార్య

భర్త అదనపు కట్నం కోసం భార్యను వేధిస్తున్న ఘటన గుంటూరులో చోటు చేసుకుంది. వరంగల్ లో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్​గా విధులు నిర్వహిస్తున్న కట్టా రామకృష్ణకి గుంటూరు గోరంట్లకు చెందిన జ్యోతికి 2 సంవత్సరాల క్రితం పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది. పెళ్లి సమయంలో ఛత్తీస్​గఢ్​లో పనిచేసే రామకృష్ణ ... వరంగల్​కు బదిలీ అయ్యాడు. పెళ్లయిన మొదటి సంవత్సరం తర్వాత ఆస్తిలో భాగాన్ని, మరికొంత కట్నం ఇవ్వాలని తరచూ వేధిస్తున్నారని బాధితురాలు పేర్కొన్నారు. తాను వరంగల్ లో పని చేస్తున్నా కానీ ఇప్పటివరకు తనను గుంటూరులోనే వదిలేసి వెళ్లిపోయాడని తెలిపింది. తనను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని బాధితురాలు వాపోయింది. ఇదేంటి అని పెద్దల సమక్షంలో ప్రశ్నించగా మీ అమ్మాయి అందంగా లేదు.. ఆస్తి సరిపోలేదు... కట్నం కొంచెం ఇచ్చారని భర్త తరపు బంధువులు అంటున్నారన్నారు. తన భర్త రామకృష్ణ ఏకంగా తనపై దాడికి పాల్పడుతున్నాడని బాధితురాలు కన్నీరుమున్నీరైంది . న్యాయం చేయాలని గుంటూరు అర్బన్ ఎస్పీకి ఆమె ఫిర్యాదు చేసింది.

ఇవీ చదవండి

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు

Intro:ap_knl_131_29_aplda_ceo_opening_ab_c13

పేరు-నరసింహులు. సెంటర్-మంత్రాలయం

సెక్సస్డ్ సెమెన్ తో 90శాతం ఆడ ఆవుల వృద్ధి

సెక్సస్డ్ సెమెన్ తో 90శాతం ఆడ ఆవుల వృద్ధి చేయవచ్చని ఆంధ్రప్రదేశ్ పసుగణాభివృద్ది సంస్థ సీఈఓ కొండలరావు అన్నారు.సోమవారం కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు మండలం బనవాసిఫారంలో ఘనీకృత వీర్య అబోతు కేంద్రంలో
రూ.27లక్షలతో నిర్మించిన కార్యాలయానికి ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ రాష్ట్రంలో కర్నూల్ జిల్లాలో బనవాసిఫారం, నంద్యాల, వైజాగ్ లో మాత్రమే వీర్య అబోతు కేంద్రాలు ఉన్నాయన్నారు.
యూఎస్ఏ వారు సహకారంతో వైజాగ్ లో సెక్సస్డ్ సెమెన్ను రూ.200కోట్లతో ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.


Body:నరసింహులు


Conclusion:మంత్రాలయం
Last Updated :Apr 30, 2019, 8:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.