ETV Bharat / state

HC: రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ.. షోకాజ్​ నోటీసు సస్పెండ్​ చేసిన న్యాయస్థానం

author img

By

Published : May 2, 2023, 11:43 AM IST

High Court : ఈ సంవత్సరంలో ఏప్రిల్​ నెలలో ప్రభుత్వం జారీ చేసిన షోకాజ్​ నోటీసును సస్పెండ్​ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య శాఖలో జరిగిన బదిలీలను నిరసిస్తూ చేపట్టిన కార్యక్రమానికి.. ఈ ఏప్రిల్​లో రాష్ట్ర ఉద్యోగుల సంఘ నేత కేఆర్‌ సూర్యనారాయణకు షోకాజు నోటీసులు అందాయి.

High Court
హైకోర్టు

Andhra Pradesh High Court : రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వాణిజ్య పన్నుల శాఖ సర్వీసు అసోసియేషన్‌ గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ ప్రభుత్వం జారీచేసిన షోకాజ్‌ నోటీసును హైకోర్టు సస్పెండ్‌ చేసింది. గుర్తింపును రద్దు చేయాలని ముందుగా నిర్ణయించుకొని షోకాజ్‌ ఇచ్చినట్లుందని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. అంతేకాకుండా విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఏపీ వాణిజ్య పన్నులశాఖ సర్వీసు అసోసియేషన్‌ గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ సాధారణ పరిపాలనశాఖ కార్యదర్శి ఈ ఏడాది ఏప్రిల్‌ 18న ఇచ్చిన షోకాజ్‌ నోటీసును సవాలు చేస్తూ సంబంధిత అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ గతంలో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్​పై విచారణ జరిపిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది.

వాణిజ్య పన్నుల శాఖ సర్వీసు అసోసియేషన్‌ గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ ప్రభుత్వం జారీచేసిన షోకాజ్‌ నోటీసును హైకోర్టు సస్పెండ్‌ చేసింది. వాణిజ్య పన్నుల శాఖలో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న బదిలీలను నిరసిస్తూ గతేడాది డిసెంబర్‌ 27న కార్యక్రమం చేపడితే.. ఈ ఏడాది ఏప్రిల్‌ 18న షోకాజ్‌ నోటీసు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించింది. సుమారు మూడున్నర నెలల తర్వాత షోకాజ్‌ జారీచేయడంలో చోటు చేసుకున్న జాప్యానికి కారణాలేమైనా పేర్కొన్నారా అని ప్రశ్నింంచింది. వేధింపులకు గురిచేయడం కోసం షోకాజ్‌ జారీచేశారన్న పిటిషనర్ల తరఫు న్యాయవాదుల వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. షోకాజ్‌ నోటీసు అమలును నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డి.రమేశ్‌ ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.

పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది వైవీ రవిప్రసాద్, న్యాయవాది పీవీజీ ఉమేశ్‌చంద్ర వాదనలు వినిపించారు. ‘వాణిజ్య పన్నులశాఖలో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న బదిలీలు, ఈ వ్యవహారంపై విచారణ అధికారిగా నియమితులైన వాణిజ్య పన్నులశాఖ అదనపు కమిషనర్‌ ఛాంబర్‌ వద్ద ధర్నాకు దిగి నివేదిక బయటపెట్టాలని కోరినందుకు షోకాజ్‌ నోటీసు ఇచ్చారు. ఇలాంటివి పునరావృతమైతే చర్యలు తప్పవని వాణిజ్య పన్నులశాఖ చీఫ్‌ కమిషనర్‌ లేఖ పంపారు. ఈ వ్యవహారం అంతటితో పరిష్కారం అయ్యింది. ఉద్యోగుల జీతాలను ప్రభుత్వం సకాలంలో చెల్లించడం లేదని గవర్నర్‌ను కలిసిన విషయంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణకు ఇచ్చిన షోకాజ్‌ నోటీసును హైకోర్టు సస్పెండ్‌ చేసింది. ధర్నాలో పాల్గొన్న వాణిజ్య పన్నులశాఖ ఉద్యోగులకు ఛార్జిమెమోలు జారీచేస్తే విచారణ జరిపిన న్యాయస్థానం బలవంతపు చర్యలొద్దని స్పష్టం చేసింది. ప్రభుత్వం అనుకున్నది నెరవేరకపోయేసరికి గతేడాది డిసెంబర్లో చోటు చేసుకున్న ఘటనను తెరపైకి తెచ్చి.. ఈ ఏడాది ఏప్రిల్‌ 18న షోకాజ్‌ జారీచేశారని కోర్టుకు తెలిపారు. పిటిషనర్‌ను వేధించడం కోసమే ప్రభుత్వం ఇలాంటి చర్యలు చేపడుతోందన్నారు. అసోసియేషన్‌ గుర్తింపును రద్దు చేయాలని ముందుగా నిర్ణయించుకొని నోటీసు ఇచ్చారని.. నోటీసు అమలును నిలుపుదల చేయండి’ అని కోరారు.

షోకాజ్‌ నోటీసుకు విరవణ ఇవ్వకుండా హైకోర్టును ఆశ్రయించడానికి వీల్లేదని ప్రభుత్వ న్యాయవాది మహేశ్వరరెడ్డి వాదనలు వినిపించారు. వ్యాజ్యానికి విచారణ అర్హత లేదన్నారు. వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని షోకాజ్‌ ఇవ్వలేదన్నారు. చట్ట నిబంధనల మేరకు నోటీసు జారీచేశామన్నారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయమూర్తి.. షోకాజ్‌ నోటీసులోని లోపాల్ని ఎత్తిచూపారు. దానిని సస్పెండ్‌ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.