ETV Bharat / state

ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది: బొప్పరాజు

author img

By

Published : Jan 28, 2022, 8:42 PM IST

AP Govt Employees on New PRC: ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరోపించారు. చర్చలకు వచ్చినప్పుడల్లా మమ్మల్ని మోసం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పాత జీతాలే ఇవ్వాలని అన్నారు. తమతో చర్చలకు ప్రభుత్వం ఓపెన్‌ మైండ్‌తో లేదని పీఆర్సీ సాధన సమితికి చెందిన మరో నేత సూర్యనారాయణ అన్నారు.

AP Govt Employees on New PRC
AP Govt Employees on New PRC

AP Govt Employees on New PRC: అనేకసార్లు తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా వినిపించుకోనందునే సమ్మె బాట పట్టామని పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. చర్చలకు పిలుస్తున్నా ఉద్యోగులు ముందుకు రావడం లేదంటూ ప్రభుత్వం పేర్కొనడం సరికాదని చెప్పారు. చర్చలకు మేం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటామని అన్నారు. జీతాలు తగ్గించి చర్చల పేరిట తమపై నెపం నెట్టొద్దని అన్నారు. మూడు డిమాండ్లపై లేఖ ఇచ్చి పరిష్కరించాలని కోరామన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పాత జీతాలే ఇవ్వాలని తెలిపారు. కొత్త జీవోలను రద్దు చేసేదాకా చర్చల ప్రసక్తే లేదని.. న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.

చర్చలకు ప్రభుత్వం ఓపెన్ మైండ్‌తో లేదు..

తమతో చర్చలకు ప్రభుత్వం ఓపెన్‌ మైండ్‌తో లేదని పీఆర్సీ సాధన సమితి నేత సూర్యనారాయణ వ్యాఖ్యానించారు. ప్రభుత్వంతో చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి తాము సిద్ధమని తెలిపారు. మాటల ద్వారా మమ్మల్ని చర్చలకు రాకుండా చేస్తున్నారని చెప్పారు. చర్చలకు ముందు ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలని సూచించారు. కాగితాలపై పుట్టిన సంఘాలతో చర్చించి న్యాయం చేసినా మంచిదేనని వ్యాఖ్యానించారు. సమస్యలపై తాము ఇప్పటికే వందల దరఖాస్తులు ఇచ్చామని గుర్తు చేశారు. తాము ఇచ్చిన 859 అభ్యర్థనలు పెండింగ్‌ ఉన్నాయని సీఎస్ చెప్పారని సూర్యనారాయణ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: Employees Association: ' మాా డిమాండ్లకు అంగీకరిస్తేనే ప్రభుత్వంతో చర్చలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.