ETV Bharat / state

గుంటూరులో వివాహితపై యాసిడ్ దాడి

author img

By

Published : Nov 27, 2019, 2:42 PM IST

గుంటూరు జిల్లా వినుకొండ మండలం నీలిగంగవరంలో ఓ వివాహిత ఆమ్లదాడికి గురైంది. లైంగిక వేధింపుల నేపథ్యంలో ఓ యువకుడు ఆమెపై ఆమ్ల దాడికి పాల్పడగా... తీవ్రగాయాలతో గుంటూరు సర్వజనాస్పత్రిలో బాధితురాలు చికిత్స పొందుతోంది.

acid assault on women in guntur
గుంటూరులో వివాహితపై యాసిడ్ దాడి

గుంటూరులో వివాహితపై యాసిడ్ దాడి
గుంటూరు జిల్లాలో పట్టపగలే దారుణం జరిగింది. కూలీ పనులకు వెళ్తున్న ఓ వివాహితపై అత్యాచారానికి ప్రయత్నించాడో ప్రబుద్ధుడు. బాధితురాలు తీవ్రంగా ప్రతిఘటించటంతో వెంట తెచ్చుకున్న యాసిడ్​తో దాడి చేసి పారిపోయాడు. తీవ్రగాయాల పాలైన బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ప్రకాశం జిల్లాకు చెందిన బాధితురాలి భర్త 9 సంవత్సరాల క్రితం మరణించాడు. గుంటూరు జిల్లాలో నలుగురు పిల్లలతో ఆమె పుట్టింటికి వచ్చేసింది. గుంటూరు జిల్లా ఉమ్మడివరం గ్రామానికి చెందిన దండబోయిన ఆంజనేయులు తరచూ ఆమెను లైగింకంగా వేధించేవాడు. ఈ క్రమంలోనే ఈ నెల 24 కూలీ పనికి వెళ్తున్న బాధితురాలిపై అత్యాచారం చేయబోయాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించటంతో నిందితుడు వెంట తెచ్చిన యాసిడ్​తో దాడి చేసి పరారయ్యాడు. విషయం బయటకు చెప్తే చంపేస్తానని బెదిరించటంతో బాధితురాలు ఎవరికీ విషయం చెప్పలేదు. తమ సోదరి యాసిడ్​ దాడిలో తీవ్రంగా గాయపడిందని పోలీసులకు బాధితురాలి సోదరుడు ఫిర్యాదు చేయడం వల్ల ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడికి కఠిన శిక్ష విధించి తమకు న్యాయం చేయాలని బాధితురాలు అర్థిస్తోంది.

ఇదీ చదవండి:

పాస్టిక్ వాడకంపై జరిమానా... రగిలిన హృదయం..!

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.