ETV Bharat / state

కోటప్పకొండ పర్యాటక క్షేత్రంలో అరుదైన చేపలు మృతి

author img

By

Published : Oct 11, 2019, 6:42 AM IST

చేపలు మృతి

కోటప్పకొండ పర్యాటక క్షేత్రంలోని అక్వేరియంలో ఉంచిన అరుదైన జాతి చేపలు మృతి చెందాయి. సిబ్బంది నిర్లక్ష్యం వీటి మరణానికి కారణమైందన్న ఆరోపణలు వస్తున్నాయి. లక్షలాది రూపాయల విలువైన వీటిని గత ప్రభుత్వ హయాంలో వివిధ ప్రాంతాల నుంచి తీసుకువచ్చారు.

అరుదైన చేపలు మృత్యువాత

గుంటూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి ఆలయ కొండ మార్గంలో సందర్శకుల కోసం ఏర్పాటు చేసిన పర్యావరణ, పర్యాటక క్షేత్రంలోని అక్వేరియంలో గల అరుదైన చేపలు మృత్యువాత పడ్డాయి. గత ప్రభుత్వ హయాంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని లక్షలాది రూపాయలు వెచ్చించి వివిధ ప్రాంతాల నుంచి అరుదైన జాతి చేపలు తెచ్చి 14 అక్వేరియంలలో ఉంచారు. కొంత కాలంగా అక్వేరియాల నిర్వహణ సరిగా లేనందున 50కి పైగా చేపలు చనిపోయాయి. సిబ్బంది నిర్లక్ష్యమే చేపల మృతికి కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో అనుభవజ్ఞులైన సిబ్బంది ఇక్కడ పని చేసేవారు. ప్రభుత్వం మారాక పర్యావరణ, పరిరక్షణ క్షేత్రంలో కొందరు సిబ్బందిని విధులను తప్పించారు. వారి స్థానంలో అధికార పార్టీకి చెందిన వ్యక్తులను నియమించారు. వీరికి అక్వేరియం నిర్వహణపై అవగాహన లేకపోవటం చేపల మరణానికి కారణమైంది. సుమారు రూ. 4లక్షలకు పైగా విలువైన చేపలు మృత్యువాత పడ్డాయి. చేపల మృతి అంశంపై అటవీశాఖ రేంజర్ నీలకంటేశ్వరరెడ్డిని వివరణ కోరగా ఇంతవరకూ తమకు విషయం తెలియదని... చేపల మృతిపై విచారణ జరుపుతామని తెలిపారు.

కోటప్పకొండలోని పర్యావరణ, పర్యాటక క్షేత్రంలో రూ.50 లక్షల వ్యయంతో 14 అక్వేరియంలు ఏర్పాటు చేశారు. అందులో సింగపూర్, మలేషియా దేశాల నుండి సైతం వివిధ రకాల చేపలను తెప్పించారు. వాటిలో గోల్డెన్ ప్యారేట్, కోయు కర్పప్, కిసింగ్ గోరమి, బ్లాక్ మూర్, స్యాట్ ఫిష్, ఫైర్ మౌత్ చిచీర్లిడ్, అలిబినో జెట్ గోరమి ఇవే కాకుండా పలు రకాల చేపలను సందర్శకుల కోసం తెప్పించారు. అదే విధంగా సందర్శకులు సైతం రకరకాల చేపలను చూసేందుకు భారీగా తరలి వచ్చేవారు. ఇప్పుడు చేపలు మృత్యువాత పడటంతో వారంతా నిరాశ చెందుతున్నారు.

Intro:AP_SKLM_42_10_COLLECTOR_VISIT_AVB_AP10138 శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ప్రభుత్వ ఆసుపత్రి నీ జిల్లా కలెక్టర్ జె నివాస్ ఆకస్మిక తనిఖీ చేశారు ఆసుపత్రిలో పారిశుధ్యం సక్రమంగా లేకపోవడం మందుల కోసం రోగులను బయటకి పంపించడం సరిపడే మందులు లేకపోవడం పై అక్కడ సేవలందిస్తున్న డాక్టర్ ప్రధానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతరం ఆర్ అండ్ బి బంగ్లా ఆవరణలో ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజ్ నూతన భవన నిర్మాణం ప్రారంభించక పోవడం తో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు Body:ఈటీవీConclusion:ఈటీవీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.