ETV Bharat / state

చెట్టు వివాదం.. తోపులాటలో కిందపడి వృద్దుడు మృతి

author img

By

Published : Mar 15, 2021, 10:48 PM IST

చెట్టు కొమ్మలు కొట్టిన విషయంలో రెండు కుటుంబాల మధ్య వివాదం చెలరేగింది. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో కిందపడి ఓ వృద్దుడు మృతి చెందాడు. ఈ విషాద గుంటూరు జిల్లా పిరంగిపురం మండలం రేపూడిలో జరిగింది.

a old man died after fell down at revudi
తోపులాటలో కిందపడి వృద్దుడు మృతి

గుంటూరు జిల్లా పిరంగిపురం మండలం రేపూడి గ్రామానికి చెందిన మారేళ్ల రమణారెడ్డి ఇంట్లో శుభకార్యం ఉన్నందున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇంటి పక్కనే ఉన్న చెట్టు కొమ్మలు అడ్డురావడంతో వాటిని కొట్టించాడు. దీంతో పక్కింటి అరె పున్నారెడ్డి, కోటిరెడ్డి.. మా చెట్టును ఎలా కొడతారని రమణారెడ్డిపై గొడవకు వచ్చారని అతని బంధువులు తెలిపారు. అప్పుడు ఇద్దరి మధ్య జరిగిన తోపులాటలో ఒక్కసారి నెట్టడంతో రమణారెడ్డి కింద పడిపోవడంతో చనిపోయినట్లు పేర్కొన్నారు.

మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు పిరంగిపురం పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి:

అదృశ్యమైన బాలుడు.. ఇంటికి సమీపంలోనే విగతజీవిగా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.