ETV Bharat / state

స్నేహానికి షష్టిపూర్తి..! జీవిత చరమాంకంలో అమృత జల్లులు.. ఈ అపూర్వ కలయిక!

author img

By

Published : Feb 26, 2023, 8:47 AM IST

Friends Meet after 60 Years: స్నేహం గురించి ఏం రాసినా..ఇంకా ఏదో రాయాలని అనిపిస్తుంది. స్వచ్ఛమైనది, చిరకాలం, అప్యాయత, తెలియని బంధం..ఇలా ఎన్ని చెప్పుకున్నా, ఇంకా అనేకం వస్తూనే ఉంటాయి. వీటన్నింటిని పక్కన పెట్టి.. "నా ఫ్రెండ్" అనే ఈ ఒక్క పదం చాలు, సత్తువ కోల్పోయిన శరీరంలో సైతం కదలిక వస్తుంది. అందుకనే కావొచ్చు.. ముదిమి సమయంలో నీరసం మీదపడుతున్నా..స్నేహితులను కలవాలనే వాంఛ.. వారికి 80 ఏళ్లన్న సంగతిని మర్చిపోయేలా చేసింది. 60 ఏళ్ల స్నేహ బంధం కోసం ఉత్సాహం రెక్కలు తొడిగింది. చూసినవారికి కనులక విందుగా నిలచిన ఈ అపూర్వకలయికకు.. 'స్నేహానికి షష్టిపూర్తి' అని పేరుపెట్టారు. ఇంతకీ ఈ కలయిక ఎక్కడంటే.. !

Friends meet after 60 years
60 ఏళ్ల తర్వాత కలుసుకున్న స్నేహితులు

Friends Meet after 60 Years: దాదాపు 8పదుల వయసులో ఉత్సాహంగా కనిపిస్తున్న వీరంతా.. 1963లో కర్నాటక రాష్ట్రం బెళగావిలోని జవహర్‌లాల్‌ నెహ్రూ వైద్య కళాశాలలో చదివారు. అప్పట్లో ఆ కళాశాలలో 120 మంది తెలుగు విద్యార్థులు చేరారు. వాళ్లంతా.. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లు. వైద్య విద్య పూర్తయ్యాక వేర్వేరు చోట్ల స్థిరపడ్డారు.

ఆచార్యులుగా కొందరు.. వైద్య నిపుణులుగా మరికొందరు.. విదేశాల్లో ఇంకొందరు..మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పుడప్పుడూ..ఏదో ఒక కార్యక్రమంలో కుదిరినవాళ్లు కలుస్తూనే ఉన్నా.. అందరూ ఒకసారి కలిస్తే బాగుంటుందని అనుకున్నారు. వైద్య విద్యను అభ్యసించి 60 ఏళ్లు పూర్తైన రోజును.. దానికి వేదిక చేసుకున్నారు. డాక్టర్ వాసిరెడ్డి రమేష్‌ దానికి చొరవ తీసుకున్నారు. స్నేహానికి షష్టిపూర్తి పేరుతో గుంటూరు జిల్లా పెదపాలెంలో సమ్మేళనం ఏర్పాటు చేశారు.

1983లో 120 మంది కలిసి చదువుకోగా.. అందులో 60 మంది ఇప్పటికే మరణించారు . మిగతా 60మంది.. కార్యక్రమానికి హాజరయ్యారు. భౌతికంగా దూరమైన మిత్రుల ఫొటోలకు నివాళులు అర్పించి.. కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అనంతరం.. ఆపాత మధుర స్మృతులను గుర్తుచేసుకున్నారు. యోగక్షేమాలు తెలుసుకుంటూ.. సందడిగా గడిపారు. రెండ్రోజులపాటు జరగనున్న ఈ స్నేహానికి షష్టిపూర్తి కార్యక్రమం.. నేడు ముగియనుంది. జీవితంలో ఈ కార్యక్రమం అత్యంత ఆనందమైన సందర్భమని అందరూ సంబరపడ్డారు.

"1963లో మేమంతా కలిసి చదువుకున్నాం. దాదాపు 1963-64లో 120 మంది జాయిన్ అయ్యాం. ఈ 120 మందిలో 60 మంది చనిపోయారు. మిగిలిన 60 మందితో కలసి.. స్నేహానికి షష్టిపూర్తి అనే పేరు పెట్టుకొని.. అందరం ఈ పెదపాలెం గ్రామంలో ప్రశాంతంగా గడుపుదాం అని కలుసుకున్నాం". - వాసిరెడ్డి రమేష్‌, వైద్యుడు

"ఈ కార్యక్రమానికి కర్త, కర్మ, క్రియ డాక్టర్ రమేష్ బాబు. రమేష్ బాబులో ఉన్న గొప్పతనం ఏంటి అంటే.. ఏ కార్యక్రమం అయినా చక్కగా నిర్వర్తిస్తారు". - గరటయ్య, మాజీ ఎమ్మెల్యే

"ఇది ఎంతో అరుదైన సమావేశం. ఇంతవరకూ ఇలాంటి సమావేశం కూడా చూడలేదు. ఇంత మందిని ఒక దగ్గర కలిసేలా చేసింది రమేష్. ఇది నిజంగా గొప్ప విషయం". - భాస్కర్‌రెడ్డి, వైద్యుడు

60 ఏళ్ల తరువాత కలుసుకున్న 60 మంది వైద్య విద్యార్థులు.. వీరిలో 60 మంది ఇప్పటికే మరణించారు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.