ETV Bharat / state

పల్నాడులో టెన్షన్​..144 సెక్షన్ విధింపు

author img

By

Published : Sep 10, 2019, 4:34 PM IST

తెదేపా, వైకాపా పోటాపోటీ 'ఛలో ఆత్మకూరు' నేపథ్యంలో పోలీసులు పల్నాడు ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. ఊరేగింపులు, ధర్నాలు, ప్రదర్శనలకు అనుమతి లేదని డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు.

డీజీపీ గౌతమ్ సవాంగ్

డీజీపీ గౌతమ్ సవాంగ్

గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో పరిస్థితి టెన్షన్​..టెన్షన్​గా ఉంది. రేపు తెదేపా, వైకాపా పోటాపోటీగా 'ఛలో ఆత్మకూరు' నిర్వహిస్తున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పల్నాడు ప్రాంతంలో 144 సెక్షన్, 30 పోలీసు యాక్టు అమలులో ఉందని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఊరేగింపులు, ధర్నాలు, ప్రదర్శనలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ప్రజలు వినాయక చవితి, మొహర్రం ప్రశాంతంగా జరుపుకుంటున్నారన్న డీజీపీ... శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దని విజ్ఞప్తి చేశారు. శాంతిభద్రతలు కాపాడటంలో రాజకీయ పార్టీలు పోలీసులకు సహకరించాలని కోరారు. అవాంఛనీయ ఘటనలు జరిగితే ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

ఇదీ చదవండీ... ప్రభుత్వం జీతం ఇస్తున్న కార్యకర్తలే గ్రామవాలంటీర్లు - కన్నా

Intro:రహదారి మరమ్మతులు చేపట్టాలి...Body:విజయనగరం జిల్లా పార్వతీపురం నుండి కూనేరు వరకు అంతర్రాష్ట్ర రహదారి మరమ్మత్తు పనులు చేపట్టి మా ప్రాణాలను కాపాడాలని కోరుతూ ఒరిస్సా రాష్ట్రం కరడ గ్రామం వద్ద మంగళవారం క సిఐటియు ఆధ్వర్యంలోఒరిస్సా ఆంధ్రా వాహన డ్రైవర్లు కలిసి రాస్తారోకో చేశారు.
ఈ సందర్భంగా సిఐటియు మండల నాయకులు కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి వాహనదారులపైనా ట్యాక్స్ రూపంలోనూ వివిధ రూపంలోనూ అనేక వేల రూపాయలు వసూలు చేస్తున్నప్పటికీ ఆ దిశగా రోడ్లు పూర్తి స్థాయిలో వాహనాలు వెళ్లే విధంగా చర్యలు తీసుకోపోవడం చాలా అన్యాయమని అలాగే పార్వతీపురం నుండి కుానేరు వరకు అంతర్రాష్ట్ర రహదారిమార్గంలో పెద్ద పెద్ద గోతులు ఉండడం వల్ల ఆ గోతుల్లో లారీలు చిన్న చిన్న వాహనాలు ఉండిపోవడం వల్ల ఆ రోజంతా వాహనాలు ట్రాఫిక్ జాము జరుగుతుందని దీనివల్ల అత్యవసర పరిస్థితిలో వెళ్లవలసిన వాళ్ళుగాని నిత్యావసర వస్తువులు కొనుక్కున్నావారు వైద్యం కోసం వెళ్లినవాళ్లు గానీ సదువు కోసం వెళ్లవలసిన విద్యార్ధులు గానీ రోజంతా పడిగాపులు కాసి తిీరిగివెనుకు వెళ్లవలసి వస్తుందని ఈ విషయంపై గతంలో అనేక సందర్భంలో రాస్తారోకోలు ధర్నాలు చేసిన సందర్భంలో సంబంధిత అధికారులు వచ్చి మరమ్మత్తు పనులు చేపట్టినప్పటికీ మొన్న కురిసిన వర్షాలకు పూర్తిస్థాయిలో మళ్ళీ గోతులు ఏర్పడడం జరిగిందని కావున అధికారులు మరమ్మత్తు పనులు చేపడుతూ పూర్తి స్థాయిలో పరిష్కారమయ్యే దిశగా ఆలోచించాలని వెంటనే మరమ్మత్తు పనులుగానీ పూర్తి స్థాయిలో పరిష్కారమయ్యే దిశగా ఆలోచించకపోతే వానలు కదిలే పరిస్థితి లేదని కావునా పూర్తిస్థాయిలో ఆంధ్రా ఒరిస్సా సరిహద్దులో వాహనాలు నిలిచిపోయే ప్రమాదం ఉందని ఎందుకంటే కల్వర్టులు కూడా శిథిలావస్థలో చేరి ఉన్నాయని కావున వెంటనే పరిష్కార మార్గాలు చూడాలని కోరుతున్నాము లేని ఎడల ఆంధ్రా ఒరిస్సా డ్రైవర్లతో ఇరవై నాలుగు గంటల బంద్ భవిష్యత్తులో చేపడుతామని అన్నారు .ఈ రాస్తారోకో కార్యక్రమంలో ఆంధ్ర ఒరిశా లారీ డ్రైవర్లు పాల్గొన్నారు.

బైట్-(సిఐటియు మండల నాయకులు కొల్లి సాంబమూర్తి)Conclusion:కురుపాం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.