ఏలూరు ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత.. పలువురు అరెస్ట్​

author img

By

Published : Jan 2, 2023, 2:53 PM IST

కొటారి ఆదిశేషు అరెస్ట్​

Arrest of Kotari Adiseshu: రిజర్వేషన్‌ కోసం నిరాహార దీక్ష చేపట్టిన హరిరామజోగయ్య ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకునేందుకు వచ్చిన నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. దీంతో ఏలూరు ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది.

Arrests: ఏలూరు జిల్లా ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాపు సంక్షేమ సేవా సమితి అధ్యక్షుడు హరి రామజోగయ్య ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి వచ్చిన దెందులూరు నియోజకవర్గ కాపు సంక్షేమ సేవా సమితి అధ్యక్షుడు కొటారి ఆదిశేషును పోలీసులు అడ్డగించారు. అనంతరం ఆదిశేషును అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్‌కి తరలించారు. కాపు రిజర్వేషన్‌ కోసం నిరాహార దీక్ష చేపట్టదలచిన హరి రామజోగయ్యనg పోలీసులు అరెస్టు చేసి వైద్య నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రి ప్రాంగణం వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

దీక్ష భగ్నానికి యత్నం: మా నాన్న దీక్ష భగ్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని హరిరామజోగయ్య కుమారుడు సూర్యప్రకాశ్‌ ఆరోపించారు. మా నాన్న ఆరోగ్యం క్షీణించింది.. ఆహారం తీసుకోలేదని తెలిపారు. చావో రేవో తేల్చుకోవాలని సిద్ధపడ్డారన్నారు. జీవో ఇచ్చేవరకు పోరాటం ఆగదన్నారు. ఆశ్రమం ఆస్పత్రికి అని.. ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారని సూర్యప్రకాశ్‌ అన్నారు. సంఘీభావం తెలిపేందుకు వచ్చినవారిని అరెస్టు చేయడం దారుణమన్నారు.

కాపు రిజర్వేషన్ల సాధన కోసం ఆదివారం దీక్ష చేపట్టిన హరిరామజోగయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం రాత్రి పాలకొల్లులోని నివాసం నుంచి ఆయన్ని బలవంతంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అక్కడినుంచి ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రాత్రి నుంచీ పోలీసులు ఆసుపత్రి వద్ద పెద్ద ఎత్తున మోహరించారు. కాపు సంఘం నాయకులు, కార్యకర్తలు వస్తారన్న సమాచారంతో.. ఆసుపత్రి వద్ద గేట్లు మూసి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఆసుపత్రిలోనూ దీక్షను కొనసాగించడానికే హరిరామజోగయ్య పట్టుపట్టారని... వైద్యానికి నిరాకరిస్తున్నారని సమాచారం.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.